Allu arjun in the direction of shekhar kammula

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో…?
arjun-01052015
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. శేఖర్ కమ్ముల ఇప్పటివరకు పెద్ద హీరోలతో సినిమా చేయలేదు. తాజాగా ఆయన అల్లు అర్జున్‌తో సినిమాకు సన్నాహాలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, సరికొత్త పాయింట్‌తో శేఖర్‌కమ్ముల చెప్పిన కథ నచ్చడంతో అల్లు అర్జున్ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని త్వరలో వెల్లడించనున్నారు. ఈ సంవత్సరాంతంలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. దీనికి సల్మాన్‌ఖాన్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Leave a Comment