i am fear of god says pawan kalyan

‘ఒక్క హిట్ తీయన్నా.. చచ్చిపోతున్నామన్నా’
41420390183_625x300
హైదరాబాద్: దేవుడంటే తనకు చాలా భయమని హీరో పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను నమ్మే దేవుడికి ఆకారం లేదని, నికారుడైన దేవున్ని సంపూర్తిగా నమ్ముతానని వెల్లడించారు. శిల్పాకళావేదికలో ఆదివారం జరిగిన ‘గోపాల గోపాల’ సినిమా ఆవిష్కరణ కార్యక్రమంలో హీరో వెంకటేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

పవన్ ప్రసంగం ఆయన మాటల్లోనే…
‘చిన్నప్పటి నుంచి ఏమవ్వాలో తెలిసేదికాదు. చదవు పెద్దగా చదవలేదు. ఏమయ్యాలో తెలియక నేను, నా స్నేహితుడు ఆనందసాయి శ్రీశైలం అడువుల్లోకి పారిపోదామనుకున్నాం. అప్పుడే హైదరాబాద్ నుంచి అన్నయ్య ఫోన్ చేశారు. వెంటనే బయలుదేరి హైదరాబాద్ రమ్మన్నారు. సాయిని వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయాను. ధ్యానం, యోగ నేర్చుకున్నాను, అందులోపడి మొత్తం బాధ్యతలు వదిలేశాను.

ఇంట్లో అన్నయ్యకు కథలు చెబుతుండేవాడిని. సంపాదించే అన్నయ్య, అమర్చిపెట్టే వదిన ఉంటే ఎన్నికథలైనా చెబుతావని అన్నయ్య అన్నారు. అన్నయ్య అన్న మాటలతో చెంపమీద కొట్టినట్టయింది. అన్నయ్య పడిన కష్టం సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసొచ్చింది. ఖుషీ సినిమా రేపు రిలీజ్ అనగా రాబోయే కొన్ని సంవత్సరాలు కష్టాలు ఉంటాయని నాకు మనసులో అనిపించింది. అది తర్వాత నిజమైంది. దేవుణ్ని ఎప్పుడు ఏమీ కోరలేదు. ఒక్క హిట్ తీయన్నా.. చచ్చిపోతున్నామన్నా.. బయట తలెత్తుకుని తిరగలేకపోతున్నామన్నా అంటూ ఒక అభిమాని నాతో అన్నాడు. జీవితంలో మొదటిసారి అభిమానుల కోసం ఒక కోరిక కోరాను. తన సినిమాలు వరసగా విఫలం అవుతున్న రోజులలో చాలా ఇబ్బంది పడ్డానని ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు.ఒక్క విజయం ఇవ్వాలని దేవుడిని ప్రార్ధించానని ఆయన అన్నారు. అయితే నా మొర ఆలకించి దేవుడు కరుణించి వరస విజయాలు ఇచ్చారన్నారు. తాను భగవంతుడిని నమ్ముతానని, తనకు జీవితంలో సమస్యలను ఎదుర్కోవడం తెలుసునని, జయాలు వచ్చినా, అపజయాలతో నిమిత్తం లేకుండా పోరాడతామని, కాని వెన్ను మాత్రం చూపనని అన్నారు. అయితే విజయం అన్నది తన చేతిలో లేదని, శ్రమ,కృషి తన చేతులలో ఉన్నాయని అన్నారు.రాజకీయాలలో భుజం కాస్తానని, సేవలు చేస్తానని అన్నారు.తాను భగవంతుడి ముందు మోకరి్ల్లే ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు.వెంకటేష్ తో కలిసి గోపాల,గోపాల నటించడం సంతోషంగా ఉందని అన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేశానని ఆయన చెప్పారు. అన్నివదిలేసి వెళ్లిదామనుకున్న సమయంలో నన్ను సినిమాల్లోకి తీసుకొచ్చాడు. మీ అందరి ముందు ఇలా నిలిపాడు. ఏదైనా పొరపాట్లు ఉంటే మన్నించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.

Leave a Comment