Subramanyam For Sale Movie Review

Subramanyam For Sale Movie Review
Cast: Sai Dharam Tej, Regina Cassandra, Brahmanandam, Nagababu, Suman, Adah Sharma, Tejaswi Madivada, Ajay, Rao Ramesh, Jhansi, Pragathi, Fish Venkat etc
Directed by: Harish Shankar (Story, screenplay, dialogues)
Produced by: Dil Raju
Banner: Sri Venkateswara Creations
Action: Ram-Laxman
Music by: Mickey J. Meyer
Release date: 24 September, 2015
subramanyam-for-sale-11

One more commercial entertainer film movie from mega family. Director Harish Shankar’s entertainment elements, Dil Raju’s family values are blended well in this movie. And Sai Dharam Tej’s energetic performances are plus points.
After the big failure of ‘Ramayya Vasthavayya’ movie, Harish Shankar took time to come up with his next and made ‘Subramanyam For Sale’ with Sai Dharam Tej in the lead. The movie has released worldwide today, i.e. on 24th September. Dil Raju produced this movie under his banner Sri Venkateswara Creations.
Subramanyam (Sai Dharam Tej) is a youngster who goes to America to make money and send them to India. He does everything for money. Seetha (Regina Cassandra) goes to USA and gets into a problem. Both of them turn friends and they had to act as husband and wife due to necessary circumstances. Rest of the story is about how they fall in love for real and convince everybody.

'పిల్లా నువ్వులేని జీవితం' లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత మెగా ఫ్యామిలీ వారసుడు సాయిధరమ్ తేజ్ అదే బ్యానర్ లో అదే హీరోయిన్ తో చేస్తున్న సినిమా కావటంతో 'సుబ్రమణ్యం ఫర్ సేల్' రిలీజ్ కు ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా 'రామయ్యా వస్తావయ్యా' లాంటి ఫెయిల్యూర్ తరువాత హరీష్ శంకర్ ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమా చేశాడు. అందుకే మేకింగ్ నుంచి ప్రమోషన్ వరకు ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకొని సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చాడు.

సుబ్రమణ్యం ఫర్ సేల్ కథ:
కర్నూలులోని ఓ పెద్ద కుటుంబానికి చెందిన సీత (రెజీనా) తన తండ్రి రెడ్డప్ప (సుమన్) తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడన్న కోపంతో ఇంట్లో నుంచి పారిపోతుంది. తన కుటుంబానికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో అమెరికా చేరిన సీతకు, అక్కడే వుద్యోగం చేస్తూ తన జీవితంలోని ప్రతి నిమిషాన్ని డాలర్లుగా మార్చాలన్న కసితో ఉన్న సుబ్రమణ్యం (సాయి ధరమ్ తేజ్ ) పరిచయం అవుతాడు. అదే సమయంలో వారితో కలిసిన చింతకాయ్ (బ్రహ్మనందం), రెజీనా, సుబ్రమణ్యం మంచి మిత్రులవుతారు.

ఇంట్లో నుంచి వెళ్లిపోయిందన్న కోపంతో సీతను కుటుంబసభ్యులు ద్వేషిస్తుంటారు. అదే సమయంలో తన చెల్లెలు (తేజస్వి) పెళ్లికి రావాలనుకున్న సీత… సుబ్రమణ్యంను తన భర్తగా నటించమంటుంది. అలా తిరిగి కర్నూలు చేరిన కథ ఎలాంటి మలుపు తిరిగింది. సుబ్బుకు అప్పటికే గోవింద్ (అజయ్), అతని చెల్లెలు దుర్గ (ఆదాశర్మ)లతో ఉన్న శతృత్వం ఏంటన్నదే మిగతా కథ.

నటన:
తొలి సినిమాతోనే తానేంటో రుజువు చేసుకున్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో మరింత పరిణతి కనబరిచాడు. ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామాలో ఉండాల్సిన ఎమోషన్స్ ను చాలా బాగా పండించాడు. అయితే ఎక్కువ సన్నివేశాల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల బాడీలాంగ్వేజ్ , డైలాగ్ మాడ్యూలేషన్ లను ఇమిటేట్ చేయటంతో ఒరిజినాలిటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ రెజీనా గ్లామర్ తో పాటు నటిగా కూడా ఆకట్టుకుంది. రొమాంటిక్ సీన్స్ తో పాటు ఎమోషనల్, కామెడీ సీన్స్ లో కూడా తన మార్క్ చూపించి సీత క్యారెక్టర్ కు తనే పర్ఫెక్ట్ ఛాయిస్ అని ప్రూవ్ చేసుకుంది. నాగబాబు, సుమన్, రావు రమేష్ ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు:
పాత కథను సరికొత్తగా వెండితెర మీద ఆవిష్కరించటంలో హరీష్ శంకర్ సక్సెస్ అయ్యాడు. రొటీన్ ఫార్ములా సినిమాకు, ఫ్యామిలీ డ్రామాను యాడ్ చేసి మంచి ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాడు. ఇక హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేయటంలో, హీరోయిజం బిల్డప్ చేయటంలో తనకు తిరగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. పంచ్ డైలాగులు, యాక్షన్, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించాడు. లొకేషన్స్, సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. మిక్కీ జె మేయర్ సంగీతం, రామ్ లక్ష్మణ్ స్టంట్స్ మరింత ప్లస్ అయ్యాయి.

విశ్లేషణ:
విడుదలకు ముందు నుంచి చెపుతున్నట్టుగానే దొంగమొగుడు, బావగారు బాగున్నారా.., పరుగు, బృందావనం లాంటి సినిమాల ఇన్ స్పిరేషన్ తో ఈ సినిమా కథను రెడీ చేసినట్టుగానే కనిపిస్తుంది. రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్ టైనరే అయినా హరీష్ తన టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. సినిమా స్టార్టింగ్ లో కథలోకి వెళ్లడానికి కాస్త ఆలస్యం అయినట్టు అనిపిస్తుంది. పాత్రలను ఎస్టాబ్లిష్ చేయటంలో తన మార్క్ చూపించిన దర్శకుడు, సాయి ధరమ్ తేజ్ ఎనర్జీని బాగా ప్రజెంట్ చేశాడు. అయితే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపిస్తుంది. తొలి భాగం అంతా ఎక్కువగా సాయి, రెజీనా లవ్ సీన్స్ మీదే దృష్టిపెట్టడంతో బోర్ ఫీలింగ్ వస్తుంది. కథ కర్నూలు చేరాక వచ్చిన కామెడీ సన్నివేశాలు అలరిస్తాయి. బ్రహ్మనందం కామెడీతో పాటు, మ్యూజిక్, యాక్షన్ ఎపిసోడ్స్ కమర్షియల్ మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *