Regina comments on the hot glamor

తన గ్లామర్ పై… ఘాటైన వ్యాఖ్యలు చేసిన – రెజీనా
2_203_484_Regina Stills
అందాల భామ రెజీనా..నటనా పరంగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ, తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమెకు ఇప్పటివరకూ సరైన హిట్ పడలేదు. అయితే ఇప్పటివరకూ ఆమె చేసిన సినిమాలన్నీ చోటా సినిమాలే కావడంతో పెద్దగా ఫోకస్ కాలేదు. అయితే త్వరలో విడుదల కాబోతున్న సాయిధరమ్ తేజ్ ”సుబ్రమణ్యం ఫర్ సేల్”పై చాలా ఆశలే పెట్టుకుంది. ఇదే క్రమంలో ఆ చిత్రాన్ని తన భుజాల పై వేసుకుని మరీ ప్రమోట్ చేస్తుంది. అయితే మూవీ ప్రమోషన్ లో భాగంగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా హీరోయిన్స్ గ్లామర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడిన మాటలు చాలా వింతగా ఉన్నాయని మీడియా వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

అసలు రెజీనా ఏం మాట్లాడింది అంటే…ఆమె అందం గురించి చెబుతూ…తాను పెద్ద అందగత్తెను కాదు అని, ఇప్పటివరకూ తన సినిమా చూసిన వారంతా త‌ను గ్లామ‌ర‌స్ రోల్స్‌కి సరిపోను అంటూ ముద్ర వేసేశారని, దాన్ని అధిగమించేందుకే తన తాజా సినిమాలో పూర్తి గ్లామారస్ పాత్రను చేశానని తెలిపింది. అంతేకాకుండా మ‌హేష్‌, ఎన్టీయార్ లాంటి బడా హీరోలతో నటించాలని తనకు ఉందని, కానీ వారు తనను అసలు పట్టించుకోవడం లేదు అని, అలా ఎందుకు జరుగుతుందో తనకు తెలీదు అంటూ కామెంట్ చేసింది.

ఇక బికినీ విషయంలో సైతం తన మనసులోని మాటను భయట పెట్టింది, సినిమాలో బికిని ధ‌రించ‌డం గురించి మాట్లాడుతూ అలాంటి సీన్లు తాను చేయనని అంటూ తాను ఎక్స్‌పోజింగ్‌కు వ్య‌తిరేక‌మ‌నో మ‌రో వంక చెప్పి త‌ప్పించుకోనని తన ఫిజిక్‌కు అలాంటి టు పీస్ డ్ర‌స్ లకు న‌ప్ప‌ద‌ని కుండా బద్దలు కొట్టింది.
మరి ఇలా ప్రతీ విషయాన్ని ఇలా ఓపెన్ గా మాట్లాడిన రెజీనాకు ఇప్పటికైనా సైరైన అవకాశాలు దక్కుతాయో లేదో చూడాలి.

Leave a Comment