Telangana new-districts transport department to new bosses

రవాణాశాఖకు కొత్తబాస్‌లు – నేటి నుంచి విధుల్లో అధికారులు
కొత్తజిల్లాలకు రవాణాశాఖ అధికారుల నియామక ప్రక్రియను ప్రభుత్వం పూర్తిచేసింది. రోడ్డు రవాణాశాఖ అధికారి (ఆర్టీవో) కార్యాలయాల్లో ప్రస్తుతం సీనియర్లుగా ఉన్న తొమ్మిది మంది ఎంవీఐలకే ఆర్టీవోలుగా బాధ్యతలు అప్పగించింది. అదేవిధంగా కొత్తజిల్లాలకు కొత్త కోడ్లను కేటాయించింది. పలుచోట్ల జేటీసీలు, డీటీసీలకు కూడా బాధ్యతను భుజాలకెత్తింది. మంగళవారం (దసరా పండుగ) నుంచి నూతన జిల్లాల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించేలా రవాణాశాఖ చర్యలు తీసుకున్నది. జిల్లాస్థాయిలో పనిచేస్తున్న డీటీసీలు, ఆర్టీవోలతో పలు దఫాలుగా చర్చించి కొత్త జిల్లాల పాలనకు అవసరమైన అన్నిచర్యలు చేపట్టింది. ప్రతిజిల్లాకు ఆర్టీవో కార్యాలయం ఏర్పాటు చేయడం, ప్రతిపాదిత కొత్తజిల్లాలో ఇప్పటికే పనిచేస్తున్న ఎంవీఐ యూనిట్ ఆఫీసులను అప్‌గ్రేడ్ చేస్తూ ఆర్టీవో కార్యాలయాలుగా మార్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది.

యూనిట్ ఆఫీసులు లేని ఏడు కొత్తజిల్లాల్లో అద్దె భవనాల్లో తాత్కాలికంగా సర్దుబాటు చేసుకుని వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని క్యాటగిరీలకు చెందిన సిబ్బంది 949 మంది ఉన్నారు. వీరిలో ఇటీవల ప్రభుత్వం నియమించిన 43 మంది ఏఎంవీలతో కలుపుకుని క్యాడర్ స్ట్రెంత్ ఉంది. రవాణాశాఖలో మొత్తం 1,283 పోస్టులకు 949 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 331 ఉద్యోగాల ఖాళీలున్నాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బందినే కొత్త జిల్లాలకు పంపిణీ చేసేందుకు రవాణాశాఖ కసరత్తు చేసింది. భవష్యత్‌లో కొత్త ఉద్యోగాల నియామకంపై ఆశలు పెట్టుకున్నది.

new-districts-transport-department-patika2

Leave a Comment