Telangana Government issues final notification of New Districts Formation

కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్‌ విడుదల
తెలంగాణలో కొత్త జిల్లాల ఆవిర్భావానికి రంగం సిద్ధమైంది. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం సోమవారం అర్ధరాత్రి విడుదల చేసింది. హైదరాబాద్‌ మినహా మిగతా 30 జిల్లాలకు సంబంధించి రెవిన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నిర్వహించే కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొని కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు. మరోవైపు ఆయా జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విస్తీర్ణం పరంగా కొత్తగూడెం ప్రథమ స్థానంలో నిలవగా హైదరాబాద్‌ ఆఖరు స్థానంలో ఉంది. జనాభా పరంగా హైదరాబాద్‌ అగ్రభాగాన ఉంది. సిరిసిల్ల ఆఖరున ఉంది. తెలంగాణలో సగటు విస్తీర్ణం 3704 చ.కి.మీగా ఉంది. ఇక 75 జిల్లాలతో ఉత్తరప్రదేశ్‌ దేశంలోనే ప్రథమస్థానంలో ఉంది. తెలంగాణ తొమ్మిదో స్థానానికి చేరింది.

కొత్త జిల్లాల్లో ఉదయం 11.12 నిమిషాలకు జాతీయ పతాకావిష్కరణ
కొత్త జిల్లాల్లో ఉదయం 11.12 నిమిషాలకు జాతీయ పతాకావిష్కరణ జరగనుంది. ఉదయం 11.22 నిమిషాల్లోపు కలెక్టర్‌ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. తెలంగాణలో కొత్తగా 21 జిల్లాలు, 23 రెవెన్యూ డివిజన్‌లు, 125 మండలాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 31 జిల్లాలు, 68 డివిజన్‌లు, 584 మండలాలు ఉంటాయి.

Leave a Comment