Bigboss2 Telugu Show Started

Bigg Boss Telugu Season 2 Contestants Names 2018.

తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్‌ 2 ప్రారంభమైంది. మొదటి సీజన్‌ బంపర్‌ హిట్‌ కావటంతో బిగ్‌ బాస్‌ రియాల్టీ షో రెండో సీజన్‌పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. నాని వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌ విషయంలో ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆదివారం రాత్రి ప్రారంభం అయిన ఈ షోలో బిగ్‌బాస్‌ 2 సెట్‌ గురించి తొలుత నాని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్‌ను ఒక్కొక్కరిని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. వరుసగా ఇప్పటివరకు షోలో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్‌ వివరాలివి..

  • తొలి కంటెస్టెంట్‌గా టాలీవుడ్‌ పాపులర్‌ సింగర్‌ గీతా మాధురి షోలో అడుగుపెట్టారు
  • రెండో కంటెస్టెంట్‌ నటుడు అమిత్‌ తివారీ (విక్రమార్కుడు, ఖలేజా, అత్తారింటికి దారేది, టెంపర్‌, సన్నాఫ్‌ సత్యమూర్తి, తదితర చిత్రాల్లో నటించాడు)
  • మూడో కంటెస్టెంట్‌గా షోలో అడుగుపెట్టిన యాంకర్‌ దీప్తి నల్లమోతు (ఓ ప్రముఖ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేస్తున్నారు. భద్ర, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ లాంటి పలు చిత్రాల్లో కూడా ఆమె నటించారు)
  • నాలుగో కంటెస్టెంట్‌ నటుడు తనీష్‌ (బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి, తర్వాత టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో హీరోగా కనిపించిన యువనటుడు)
  • ఆశ్చర్యకరంగా ఐదో కంటెస్ట్‌గా బాబు గోగినేని (హ్యూమన్‌ రైట్స్‌ యాక్టివిస్ట్) బిగ్‌బాస్‌ 2 షోలో అడుగుపెట్టాడు.
  • ఆరో కంటెస్టెంట్‌ భాను శ్రీ( బాహుబలిలో తమన్నాకు డూప్‌గా కొన్ని సీన్లలో నటించారు)
  • ఏడో కంటెస్టెంట్‌గా రాప్‌ సింగర్ రోల్‌ రిడా (రాహుల్‌ కుమార్‌ అలియాస్‌ రోల్‌ రిడా), రాప్‌ సింగర్‌తో కలిసి ప్రత్యేక నృత్యంతో అలరించిన ముమైత్‌ ఖాన్‌
  • ఎనిమిదో కంటెస్టెంట్‌ యాంకర్‌ శ్యామల (పలు టీవీ షోలో యాంకర్‌గా వ్యవహరించారు, అలాగే కొన్ని చిత్రాలలో నటిగా మెప్పించారు)
  • తొమ్మిదో కంటెస్టెంట్‌ కిరీటి ధర్మరాజు (పలు షార్ట్‌ ఫిలింస్‌. టాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్)
  • పదో కంటెస్టెంట్‌ దీప్తీ సునయన (సోషల్‌ మీడియా సెన్సేషన్‌. డబ్‌ స్మాష్‌ వీడియోల‌తో బాగా పాపులర్ అయ్యారు‌. నిఖిల్‌ హీరోగా నటించిన కిర్రాక్‌ పార్టీలో ఓ పాత్రలో కనిపించారు)
  • పదకొండో కంటెస్టెంట్‌గా నటుడు కౌశల్‌ (పలు సీరియల్‌లో నటుడిగి మెప్పించారు, పలు చిత్రాల్లోనూ అలరించారు.)
  • పన్నెండో కంటెస్టెంట్‌గా తేజస్వి మదివాడ( కేరింత, ఐస్‌క్రీమ్‌, నాన్న నేను నా బాయ్‌ ఫ్రెండ్స్‌, శ్రీమంతుడు పలు చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు)
  • పదమూడో కంటెస్టెంట్‌ నటుడు సామ్రాట్‌ రెడ్డి (అహనా పెళ్లంట, పంచాక్షరి లాంటి చిత్రాల్లో మెయిన రోల్‌లో కనిపించారు, అంతేకాకుండా పలు సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్నెళ్ల క్రితం భార్యతో విబేధాల కారణంగా వార్తల్లో నిలిచారు.)
  • పద్నాలుగో కంటెస్టెంట్‌గా సెలబ్రిటీలతో కలిసి హౌజ్‌మేట్‌గా సామాన్యుడు గణేశ్‌ పాల్గొనబోతున్నారు.‌
  • బిగ్‌బాస్‌2లోకి సామాన్యురాలిగా పదిహేనో కంటెస్టెంట్‌ సంజన
  • మరో సామన్యుడిగా, పదహారో కంటెస్టెంట్‌గా నూతన్‌ నాయుడు (సామాజిక కార్యకర్త)

Leave a Comment