105 మంది అభ్యర్ధులను ప్రకటించిన కేసీఆర్‌

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను ప్రకటిస్తున్నామని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్‌ నిరాకరించామన్నారు. హుస్నాబాద్‌ బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుడతామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉందన్నారు. అనేక త్యాగాల, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధిని ప్రధాని, పలు రాష్ర్టాల సీఎంలు ప్రశంసించారన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులపై విపక్షాలు ప్రజల్ని తప్పుదారి పట్టించాయని విమర్శించారు. స్వల్పకాలంలోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందన్నారు.

దేశంలోనే నెంబర్‌ వన్‌గా తెలంగాణ దూసుకుపోతోందన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయలో కమీషన్లు దండుకున్నామని విపక్షాలు బురదచల్లుతూ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. అంతకుముందు క్యాబినెట్‌ సమావేశంలో అసెంబ్లీని రద్దు చేస్తూ ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. కేబినెట్‌ తీర్మానాన్ని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌కు సీఎం కేసీఆర్‌ అందించారు. కేబినెట్‌ తీర్మానాన్ని గవర్నర్‌ ఆమోదిస్తూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను గవర్నర్‌ కోరారు.

అసెంబ్లీ రద్దు అయిన మరుక్షణమే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ ఈ జాబితాను వెల్లడించారు. 105 నియోజకవర్గాలకు ఇవాళ పేర్లు ప్రకటిస్తున్నామన్న కేసీఆర్.. ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. మేడ్చల్, మల్కాజ్‌గిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ నియోజవకర్గాలకు ఆయా లోకల్ లీడర్లతో మాట్లాడిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఈ ఐదు నియోజకవర్గాలకు మినహాయించి.. మిగిలిన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తున్నాం. అనేక సర్వేల తర్వాత టికెట్లు ఇచ్చాం. ఇద్దిరికి మాత్రమే టికెట్ నిరాకరించాం. చెన్నూర్, ఆందోళ్‌కు మాత్రం సిట్టింగ్‌లు కాదని కేసీఆర్ తెలిపారు.

105-trs-party-declares-election-candidates-by-kcr-2018

TELANGANA RASHTRA SAMITHI
List of MLA Candidates
Bhadradri Kothagudem
1. Bhadrachalam : Dr.Thellam Venkat Rao
2. Pinapaka : Payam Venkateshwarlu
3. Ashwaraopet : Thati Venkateshwarlu
4. Yellendu : Koram Kanakaiah
5. Kothagudem : Jalagam Venkat Rao

Khammam
6. Khammam : Puvvada Ajay Kumar
7. Paleru : Tummala Nageshwar Rao
8. Wyra : Banoth Madan Lal
9. Madhira : Lingala Kamalraj
10.Sathupalli : Pidamarthi Rav

Mahabubabad
11.Mahabubabad : Banoth Shanker Naik
12.Dornakal : D S Redya Naik

Warangal(Rural)
13.Parkala : Challa Dharma Reddy
14.Narsampet : Peddi Sudershan Reddy
15.Wardhannapet : Aroori Ramesh

Warangal(Urban)
16.Warangal West : Dasyam Vinay Bhasker

Jayashankar Bhupalapalli
17.Bhupalapalli : S.Madhusudhana Chary
18.Mulugu : Ajmira Chandulal

Jangoan
19.Jangaon : Muthireddy Yadagiri Reddy
20.Station Ghanpur : Dr.Thatikonda Rajaiah
21.Palakurthi : Errabelly Dayakar Rao

Nalgonda
22.Nalgonda : Kancharla Bhupal Reddy
23.Miryalaguda : N.Bhasker Rao
24.Nagarjuna Sagar : Nomula Narsimaiah
25.Devrakonda : Ramavath Ravindra Kumar
26.Munugodu : Kusukuntla Prabhaker Reddy
27.Nakrekal : Vemula Veeresham

Suryapet
28.Suryapet : Gunthakandla Jagadeesh Reddy
29.Tungaturthi : Gyadari Kishore Kumar

Yadadri Bhuvanagiri
30.Aleru : Smt.Gongidi Sunitha
31.Bhuvanagiri : Pylla Sekhar Reddy

Nizamabad
32.Nizamabad Urban : Ganesh Bigala
33.Nizamabad Rural : Bajireddy Goverdhan
34.Armoor : Ashannagari Jeevan Reddy
35.Balkonda : Vemula Prashanth Reddy
36.Bodhan : Shakeel Ahmed

Kamareddy
37.Banswada : Pocharam Srinivas Reddy
38.Kamareddy : Gampa Govardhan
39.Jukkal : Hanumanthu Shinde
40.Yellareddy : Enugu Ravinder Reddy

Adilabad
41.Adilabad : Jogu Ramanna
42.Boath : Rathod Babu Rao
43.Khanapur : Smt.Rekha Naik

Asifabad
44.Asifabad : Smt.Kova Laxmi
45.Sirpur Kagaz Nagar : Koneru Konappa

Nirmal
46.Nirmal : Allola Indra Karan Reddy
47.Mudhole : G.Vittal Reddy

Mancheryal
48.Mancheryal : Nadipelli Diwakar Rao
49.Bellampally : Durgam Chinnaiah
50.Chennur : Balka Suman

Karimnagar
51.Karimnagar : Gangula Kamalakar
52.Huzurabad : Eetala Rajender
53.Manakondur : Rasamai Balakishan

Siricilla
54.Siricilla : K T Rama Rao
55.Vemulawada : Chennamaneni Ramesh

Jagityal
56.Jagityal : Dr M.Sanjay Kumar
57.Korutla : Kalavakuntla Vidyasagar Rao
58.Dharmapuri : Koppula Eeshwar

Peddapally
59.Peddapally : Dasari Manohar Reddy
60.Manthani : Putta Madhukar
61.Ramagundam : Somarapu Sathyanarayana

Siddipet
62.Siddipet : Tanneru Harish Rao
63.Dubbaka : Solipeta Ramalinga Reddy
64.Gajwel : Kalvakuntla Chandrasekhar Rao
65.Husnabad : Vodithela Satish Kumar

Medak
66.Medak : Smt.M.Padma Devender Reddy
67.Narsapur : Chilumula Madan Reddy

Sangareddy
68.Sangareddy : Chintha Prabhakar
69.Narayankhed : M.Bhupal Reddy
70.Andhole : Chanti Kranthi Kiran
71.Patancheruvu : Gudem Mahipal Reddy

Mahaboobngar
72.Mahaboobngar : V.Srinivas Goud
73.Jadcherla : Dr Chernakola Laxma Reddy
74.Devarakadra : Ale Venkateshwar Reddy
75.Narayanpet : S.Rajender Reddy
76.Makthal : Chittem Ram Mohan Reddy

Nagarkurnool
77.Nagarkurnool : Marri Janardhan Reddy
78.Kollapur : Jupally Krishna Rao
79.Achampet : Guvvala Bal Raj
80.Kalwakurthy : G.Jaipal Yadav

Wanaparthy
81.Wanaparthy : Singi Reddy Niranjan Reddy
Gadwal
82.Gadwal : Bandla Krishna Mohan Reddy
83.Alampur : Vallur Mallepogu Abraham

Vikarabad
84.Parigi : Koppula Mahesh Reddy
85.Thandur : Patnam Mahender Reddy
86.Kodangal : Patnam Narender Reddy

Rangareddy
87.Shadnagar : Y.Anjaiah Yadav
88.Rajendra Nagar : T.Prakash Goud
89.Maheshwaram : Teegala Krishna Reddy
90.Ibrahimpatnam : Manchireddy Kishan Reddy
91.Serilingam Pally : Arekapudi Gandhi
92.L B Nagar : Muddagoni Rammohan Goud
93.Chevella : Kale Yadaiah

Malkajgiri-Medchal
94.Quthbullapur : K P Vivekananda
95.Kukatpally : Madavaram Krishna Rao
96.Uppal : Bethi Subhash Reddy

Hyderabad
97.Secunderabad : T.Padma Rao Goud
98.Sanath Nagar : Talasani Srinivas Yadav
99.Cantonment : G.Sayanna
100. Jubilee Hills : Maganti Gopinath
101. Yakathpura : Sama Sundar Reddy
102. Chandrayana Gutta : M.Seetharam Reddy
103. Karwan : T.Jeevan Singh
104. Bahdurpura : Inayath Ali Baqri
105. Nampally : Munukuntla Anand Goud

Leave a Comment