ఎలక్ట్రానిక్ ఓటింగ్‌పై తెలుసుకుందాం..

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్‌లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ జిల్లాలో 49 ప్రాంతాల్లో నమూనా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవేకాకుండా మరో పది మొబైల్ పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. ఇంకా అనేక ప్రాంతాల్లో వీటి ఏర్పాటు ఆవశ్యకత ఉండడంతో 100 కేంద్రాలు నెలకొల్పాలని నిర్ణయించారు. ప్రస్తుతం తొమ్మిది మొబైల్ కేంద్రాలు, 49 స్టాటిక్ కేంద్రాలు ఏర్పాటు పూర్తయినట్లు, త్వరలో స్టాటిక్ కేంద్రాలను 100కి విస్తరించనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.

నమూనా పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడంటే..

ముషీరాబాద్- రాజీవ్‌గాంధీనగర్ కమ్యూనిటీ హాల్, జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్, తాళ్లబస్తీ కమ్యూనిటీహాల్, మలక్‌పేట్- సలీంనగర్ శ్రీపురం కమ్యూనిటీ హాల్, సోహెబ్ మెమోరియల్ లైబ్రరీ పార్కు, ఆస్మాన్‌గడ్ పద్మావతి కల్యాణ మండపం, అంబర్‌పేట్- జీహెచ్‌ఎంసీ స్టేడియం/ప్లేగ్రౌండ్, కాచిగూడ హర్జన్‌పేట వార్డు కార్యాలయం, విక్రంనగర్ పార్కు వార్డు కార్యాలయం, ఖైరతాబాద్- నారాయణగూడ కేశవ్ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్, జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కార్యాలయం, బంజారాహిల్స్ రోడ్ నెం-7లోని వార్డు ఆఫీసు- 8ఏ, 8బీ, జూబ్లీహిల్స్- ఎర్రగడ్డ ఫతేనగర్ కమ్యూనిటీహాల్, యూసుఫ్‌గూడ వెంకటగిరి కమ్యూనిటీహాల్, వినాయక్‌రావు కమ్యూనిటీహాల్, సనత్‌నగర్- పాటిగడ్డ మోడల్ మార్కెట్ కమ్యూనిటీ హాల్, బన్సీలాల్‌పేట్ సీసీనగర్ కమ్యూనిటీహాల్, ఎస్‌ఆర్‌నగర్ బాపూనగర్ కమ్యూనిటీహాల్, నాంపల్లి- గుడిమల్కాపూర్ నవోదయ కమ్యూనిటీహాల్, నాంపల్లి జాగిర్‌హుస్సేన్ కమ్యూనిటీహాల్, అహ్మద్‌నగర్ బడాబజార్ కమ్యూనిటీహాల్, బజార్‌ఘాట్ వార్డు కార్యాలయం, కార్వాన్- వార్డు-13 ఆఫీస్, గోల్కొండ వార్డు-9 ఆఫీస్, టోలీచౌకీ మున్సిపల్ వార్డు కార్యాలయం, గోషామహల్- బేగంబజార్ వార్డు ఆఫీస్, రహీంపుర ప్లే గ్రౌండ్, జాంబాగ్ వార్డు ఆఫీస్, చార్మినార్- మొఘల్‌పుర జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సర్దార్ మహెల్ జీహెచ్‌ఎంసీ ఆఫీసు, పేట్లబుర్జు జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయం, చాంద్రాయణగుట్ట- రక్షాపురం మోడల్ మార్కెట్, జంగమ్మెట్ జీహెచ్‌ఎంసీ వార్డు ఆఫీసు, హఫీజ్ బాబానగర్ జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాల్, యాకుత్‌పుర- సింగరేణి కాలనీ ఆఫీసర్స్ కో ఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్, మస్కతీ ప్లేగ్రౌండ్ జీహెచ్‌ఎంసీ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్.

గౌలిపుర మిత్రక్లబ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎస్‌ఆర్‌టీ కాలనీ జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీహాల్, బహదూర్‌పుర- చందూలాల్‌బారాదరి స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫలక్‌నుమ సర్‌ఫరాజ్‌జంగ్ కాలనీ వార్డు ఆఫీసు, రాంనాస్‌పుర వార్డు ఆఫీసు, సికింద్రాబాద్- బుద్ధనగర్ కమ్యునిటీహాలు, తార్నాక నాగార్జుననగర్ కమ్యూనిటీహాల్, తుకారాంగేట్ బాబూ జగ్జీవన్‌రాం కమ్యూనిటీహాల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్- బోయిన్‌పల్లి కంటోన్మెంట్ బోర్డు ఆఫీస్, మడ్‌ఫోర్ట్ కంటోన్మెంట్ బోర్డు వర్క్‌షాప్, కంటోన్మెంట్ బోర్డు మెయిన్ ఆఫీసు, బొల్లారం కంటోన్మెంట్ బోర్డు సర్కిల్ ఆఫీసు, లిబర్టీలోని బల్దియా ప్రధాన కార్యాలయం.

Leave a Comment