టీడీపీ నేతలు డబ్బులు పంచుతూ పట్టుబడ్డారు

హైదరాబాద్ : నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో తెలుగు దేశం పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. డబ్బు ఆశ చూపి ఓటర్లను కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. బాలానగర్ విమల్ సినిమా హాల్ లో టీడీపీ నేతలు డబ్బులు పంచుతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. టీడీపీ నాయకుల నుంచి రూ. 7 లక్షలను ఫ్లయింగ్ స్కాడ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

Leave a Comment