ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 11న తెలంగాణతో సహా ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగితా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. ఐదు గంటల లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకుని క్యూలైన్లో నిలుచున్న వారికి ఓటు వేసే అవకాశం క‌ల్పించారు. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా 69శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో సాయంత్రం 4 గంటల వరకు 67 శాతం న‌మోదైన‌ట్లు సమాచారం.

Leave a Comment