7న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఈ నెల 7న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు 7న సెలవు ప్రకటిస్తున్నట్లు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే 7న సెలవు ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. శాసనసభ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది.

Leave a Comment