కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది.

హైదరాబాద్‌ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గెలుపొందిన స్థానాల(63) కంటే కూడా ఎక్కువ స్థానాలు(ప్రస్తుతం 85) కైవసం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌ రావు తెలంగాణలో మరోసారి  ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కారు జోరుగా దూసుకుపోతోంది. ఇప్పటికే 85 స్థానాలను కైవసం చేసు​కున్న గులాబీ పార్టీ మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా టీడీపీతో జట్టుకట్టిన కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఎన్నడూలేని విధంగా పార్టీ సీనియర్‌ నేతలు ఓటమి పాలవడంతో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది.

సొంత నియోజకవర్గాల్లో ప్రచారానికే పరిమితమైనప్పటికీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఇద్దరు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు సహా ప్రతిపక్ష నేత జానారెడ్డి, సీఎం అభ్యర్థులుగా ప్రచారం పొందిన డికె అరుణ వంటి మహామహులు సైతం మట్టికరిచారు. అంతేకాకుండా లోక్‌సభ నుంచి అసెంబ్లీకి మారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసిన మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, పోరిక బలరాం నాయక్‌లకు కూడా ఓటమి రూపంలో నిరాశే ఎదురైంది. జగిత్యాల నియోజకవర్గంలో తిరుగులేని నేతగా గుర్తింపు పొంది.. గత ఎన్నికల్లో కరీంనగర్‌ జిల్లా నుంచి గెలుపొందిన ఏకైక నాయకుడిగా నిలిచిన జీవన్‌రెడ్డి సైతం టీఆర్‌ఎస్‌ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. ఇక చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కొండా సురేఖకు ఓటమి తప్పలేదు.

కాగా ఇప్పటివరకు కాంగ్రెస్‌ పార్టీ కేవలం 18 స్థానాల్లో మాత్రమే గెలుపొంది మరో 1 సీటు సొంతం చేసుకునే అవకాశం కన్పిస్తోంది. ఇక తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడినా గెలిచినా తనదే పూర్తి బాధ్యత అన్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హూజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డిపై స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు.

ఓడిపోయిన కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖులు

పేరు నియెజకవర్గంప్రత్యర్థి పార్టీమెజారిటీ
రేవంత్‌ రెడ్డికొడంగల్‌పట్నం నరేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌
పొన్నం​ ప్రభాకర్‌కరీంనగర్‌ గంగుల కమలాకర్‌ టీఆర్‌ఎస్‌
జానారెడ్డినాగార్జున సాగర్‌ నోముల నర్సింహులు టీఆర్‌ఎస్‌
డికె అరుణగద్వాలబండ్ల కృష్ణమోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌
జీవన్‌రెడ్డి  జగిత్యాలడాక్టర్‌ సంజయ్‌కుమార్ టీఆర్‌ఎస్‌
దామెదర రాజనర్సింహఆందోల్‌క్రాంతికిరణ్‌  టీఆర్‌ఎస్‌
జె. గీతారెడ్డిజహీరాబాద్‌మాణిక్‌రావు టీఆర్‌ఎస్‌
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  నల్గొండ కంచర్ల భూపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌
పొన్నాల లక్ష్మయ్యజనగామముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి టీఆర్‌ఎస్‌
కొండా సురేఖపరకాలచల్లా ధర్మారెడ్డి టీఆర్‌ఎస్‌
సర్వే సత్యనాయణసికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌జి. సాయన్న టీఆర్‌ఎస్‌
బలరాం నాయక్‌మహబూబాబాద్‌బానోత్‌ శంకర్‌నాయక్  టీఆర్‌ఎస్‌
సంపత్‌కుమార్‌ఆలంపూర్అబ్రహం టీఆర్‌ఎస్‌
చిన్నారెడ్డి వనపర్తి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి   టీఆర్‌ఎస్‌
ముఖేష్‌ గౌడ్‌గోషామహల్‌రాజాసింగ్‌బీజేపీ
మల్లురవి జడ్చర్లచర్నకోల లక్ష్మారెడ్డిటీఆర్‌ఎస్‌

Leave a Comment