ఎక్కడ తిరిగినా రాత్రికి సిద్ధిపేట చేరుకోకుంటే నిద్రపట్టదు!

సిద్దిపేట నియోజకవర్గ ప్రజల ఆదరణ మరువలేనిదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్ధిపేటలో మంత్రి హరీశ్‌రావు రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల్లో గెలుపోటముల గురించి ఆలోచించడం లేదన్నారు. సిద్ధిపేట పేరు దేశం మొత్తం మార్మోగుతోంది. ఎక్కడ తిరిగినా రాత్రికి సిద్ధిపేట చేరుకోకుంటే నిద్రపట్టదని భావోద్వేగానికి లోనయ్యారు. ఆంధ్ర నాయకులు తెలంగాణలో కుట్రలు చేస్తున్నారు. నాలుగేండ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి మీ అందరికీ తెలుసు.

రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మీ, కేసీఆర్‌కిట్, గురుకులాలు ఏర్పాటు చేశాం. సిద్ధిపేటలో కార్పొరేట్‌స్థాయి ఆస్పత్రిని నిర్మించుకున్నాం. సిద్ధిపేట మార్కెట్‌యార్డు, రైతు బజార్, ఔటర్ రింగురోడ్డు, కోమటిచెరువు చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుంది. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఓటుతో మన ఆత్మగౌరవాన్ని చాటుదాం. మెజార్టీలో మనకు మనమే పోటీ పడదామని హరీశ్ పేర్కొన్నారు.

Leave a Comment