సీసీఎల్‌ఏ వెబ్‌సైట్‌లో భూరికార్డులు.. రైతులంతా చూసుకునే అవకాశం

తెలంగాణ: ప్రక్షాళన జరిగి డిజిటల్ సంతకాలు పూర్తయిన 52.34 లక్షల ఖాతాల భూరికార్డులను సమాచారం సీసీఎల్‌ఏ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ మినహా 30 జిల్లాల భూరికార్డులను http://ccla.telangana.gov.in/Welcome.do వెబ్‌సైట్‌లో know our land status లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.

http://ccla.telangana.gov.in/Welcome.do వెబ్‌సైట్‌ల్లో క్లిక్‌ జిల్లా, రెవెన్యూ డివిజన్‌, మండలం, గ్రామం, ఖాతా/సర్వే నంబరు నమోదు చేసి డిజిటల్‌ సంతకాలు చేసిన రికార్డులను చూసుకోవచ్చు. నిర్ధారించిన సమాచారాన్నే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వీటి కాపీలు కావాలనుకొనే రైతులు మీ-సేవ నుంచి తీసుకోవాలి. భూమి రిజిస్ట్రేషన్ తర్వాత మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకునే అధికారం మీ-సేవకు అప్పగించారు. భూరికార్డులు పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టడంతో రైతులంతా రికార్డులు చూసుకునే అవకాశం లభించింది.

Leave a Comment