తప్పుడు సర్వేలను నమ్మొద్దు.. కేటీఆర్ ట్వీట్

కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు విడుదల చేస్తున్న తప్పుడు సర్వేలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. గోబెల్స్ కే పెద్దన్న లాంటి చంద్రబాబు ఇటు తన అనుకూల మీడియా సంస్థలతో పాటు అటు సోషల్ మీడియాలో ఇంకా చాలా దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. వాళ్లు చేసే తప్పుడు ప్రచారంతో గందరగోళపడవద్దు అని తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణను కాపాడుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.

 

Leave a Comment