తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌: టీఆర్‌ఎస్‌కు స్వల్ప మొగ్గు

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్గిట్‌ పోల్‌ ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించబోతున్నదని ఎగ్జిట్స్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు 66 స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు 37 స్థానాలు, బీజేపీకి ఏడు స్థానాలు వస్తాయని టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసింది.


ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించనుందని.. 79 నుంచి 91 స్థానాలు సాధించి.. కారు దూసుకుపోనుందని అంచనా వేసింది. ఈ సర్వేలో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు కేవలం 21 నుంచి 33 స్థానాలు, బీజేపీకి ఒకటి నుంచి మూడు స్థానాలు వస్తాయని పేర్కొంది. ఈ సర్వేలో ఇతరులు నాలుగు నుంచి ఏడు స్థానాలు కైవసం చేసుకోనున్నారని తెలిపింది.

రిపబ్లిక్‌ టీవీ ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో టీఆర్‌ఎస్‌-ప్రజాకూటమి మధ్య హోరాహోరీ ఉన్నట్టు ఉన్నట్టు పేర్కొంది. టీఆర్‌ఎస్‌కు 50 నుంచి 65 స్థానాలు, కాంగ్రెస్‌కు 38 నుంచి 52 స్థానాలు, బీజేపీకి నాలుగు నుంచి ఏడు స్థానాలు వస్తాయని రిపబ్లిక్‌ టీవీ పేర్కొంది.

న్యూస్‌ 18 సర్వే ప్రకారం చూస్తే.. కాంగ్రెస్‌ సారథ్యంలోని ప్రజా కూటమి, తెరాస మధ్య బలమైన పోటీ ఉన్నట్టు సర్వేలు స్పష్టంచేస్తున్నాయి. తెరాస 50 నుంచి 56 సీట్లు, కాంగ్రెస్‌ సారథ్యంలోని ప్రజాకూటమికి 38 నుంచి 52, భాజపాకు 4 నుంచి 7, ఇతరులకు 8 నుంచి 14 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది.

AGENCY TRS‌ KUTAMI (Congress + TDP + TJS + CPI ) BJP OTHERS
TIMES NOW 66 37 7 9
INDIA TODAY 79-91 21-33 01-03 04-07
NEWS 18 50-65 38-52 4-7 8-14
AARA-TV9 75-85 25-35 02-03 7-8
REPUBLIC 50-65 38-52 4-7 5-7
NDTV 69 37 4 9
CNX 76 32 4 7
NEWS-X 57 46 6 10

Leave a Comment