విరాట్ కోహ్లీ సూప‌ర్ సెంచ‌రీ.. ధోనీ అజేయ హాఫ్ సెంచ‌రీల‌తో.. టీమిండియా థ్రిల్లింగ్‌ విక్ట‌రీ కొట్టింది.

విరాట్ కోహ్లీ సూప‌ర్ సెంచ‌రీ.. ధోనీ అజేయ హాఫ్ సెంచ‌రీల‌తో.. టీమిండియా థ్రిల్లింగ్‌ విక్ట‌రీ కొట్టింది. అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండ‌వ వ‌న్డేలో భార‌త్ ఆరు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్ 1-1తో స‌మం అయ్యింది. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు సాగిన గేమ్‌లో.. కోహ్లీ, ధోనీలు తమ బ్యాటింగ్ ట్యాలెంట్‌తో ఆక‌ట్టుకున్నారు. ఆసీస్ విసిరిన 299 ర‌న్స్ టార్గెట్‌ను.. భార‌త్ మ‌రో 4 బంతులు మిగిలి ఉండ‌గానే అందుకున్న‌ది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో ధోనీ ఓ సిక్స‌ర్‌, సింగిల్‌తో.. భార‌త్‌కు సూప‌ర్ విక్ట‌రీ అందించాడు. రోహిత్ శ‌ర్మ 43, దినేశ్ కార్తీక్ 25 నాటౌట్‌తో టీమిండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో షాన్ మార్ష్ 131 ర‌న్స్ చేశాడు. భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన భార‌త్‌కు.. కెప్టెన్ కోహ్లీ సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడాడు. వ‌న్డేల్లో అత‌ను 39వ సెంచ‌రీ న‌మోదు చేశాడు. 112 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 104 ర‌న్స్ చేశాడు. 

Leave a Comment