మూడు విడ‌త‌ల్లో జ‌రిగే ఎన్నిక‌ల పోలింగ్ వివ‌రాలు ఇవే..!

హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. జనవరి 21న మొదటి విడత పోలింగ్.. రెండో విడత పోలింగ్ జనవరి 25న.. మూడో విడత పోలింగ్ జనవరి 30న నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. 

తొలి విడత ఎన్నికలు

జనవరి 7న నోటీస్ ఇవ్వనున్న రిటర్నింగ్ అధికారులు
7 నుంచి 9 వరకు నామినేషన్ల స్వీకరణ
10న నామినేషన్ల పరిశీలన
11న ఆర్డీవోలకు అప్పీలు చేసేందుకు అవకాశం
12న ఆర్డీవోలచే అప్పీల పరిష్కారం
13న నామినేషన్ల ఉపసంహరణ
21 పోలింగ్, ఓట్ల లెక్కింపు

రెండో విడత ఎన్నికలు

జనవరి 11న నోటీస్ ఇవ్వనున్న రిటర్నింగ్ అధికారులు
11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణ
14న నామినేషన్ల పరిశీలన
15న ఆర్డీవోలకు అప్పీలు చేసేందుకు అవకాశం
16న ఆర్డీవోలచే అప్పీల పరిష్కారం
17న నామినేషన్ల ఉపసంహరణ
25న పోలింగ్, ఓట్ల లెక్కింపు

మూడో విడత ఎన్నికలు

జనవరి 16న నోటీస్ ఇవ్వనున్న రిటర్నింగ్ అధికారులు
16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ
19న నామినేషన్ల పరిశీలన
20న ఆర్డీవోలకు అప్పీలు చేసేందుకు అవకాశం
21న ఆర్డీవోలచే అప్పీల పరిష్కారం
22న నామినేషన్ల ఉపసంహరణ
30 పోలింగ్, ఓట్ల లెక్కింపు

Leave a Comment