స్త్రీలలో సంతాన లేమి సమస్యలు

పెళ్లయి 5 ఏళ్లయినా ఇంకా సంతానం కలగలేదా? ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకుండాపోయిందా? ఈ ప్రశ్నలకు ఔనని చెప్పే దంపతుల సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. వాస్తవానికి పెళ్లి అనేది దాంపత్య జీవితానికి ఒక నాంది మాత్రమే. సంతానం కలిగితేనే ఆ జీవితం సంపూర్ణమవుతుంది. అయితే, సంతానలేమి సమస్యతో ఎంతో మంది దంపతులు ఒక అసంపూర్ణమైన జీవితం గడుపుతున్నారు. ఇంతకీ సంతాన లేమి అని ఎప్పుడనాలి? దంపతులు ఏడాది పాటు వైవాహిక జీవితం గడిపిన తర్వాత కూడా సంతానం కలగకపోతే సంతానలేమి అంటారు.మహిళల్లో సంతాన లేమి కారణాలుట్యూబర్‌ బ్లాక్‌ : సంతానలేమికి గల కారణాల్లో ట్యూబర్‌ బ్లాక్‌ సమస్య ఒకటి. సహజంగా అండం, శుక్రకణంతో కలిసి ఫలధీకరణం చెందడానికి ముఖ్యమైన దారిగా ఉపయోగపడేవే ఫాలోపియన్‌ ట్యూబ్స్‌. అయితే, ట్యూబర్‌క్యులార్‌ ఇన్‌ఫెక్షన్లు, మూత్రనాళం ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఈ ట్యూబ్‌లలో బ్లాక్స్‌ ఏర్పడినప్పుడు అండం, శుక్రకణంతో ఫలదీకరణ చెందదు. ఫలితంగా సంతానం కలగదు. 

ఫైబ్రాయిడ్స్‌: గర్భాశయంలో కణుతుల్లా ఏర్పడే ఫైబ్రాయిడ్స్‌ సంతానలేమికి దారి తీసే మారో కారణం. ఫైబ్రాయిడ్స్‌ ఉన్న వారికి బహిష్టు సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఇదే క్రమంలో సబ్‌మ్యూక్‌సలో ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడితే గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ సబ్‌ సెరోసల్‌లో మాత్రమే ఫైబ్రాయిడ్స్‌ ఉంటే పిండం ఎదుగుదలకు ఆటంకమేమీ ఉండదు. అందుకే ఫైబ్రాయిడ్స్‌ ఎక్కడ ఉన్నాయనేది కీలకాంశం అవుతుంది. 

ఎడినోమయోసిస్‌ : కొంతమందికి బహిష్టు సమయంలో ఎక్కువ రోజుల పాటు రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఈ సమయంలో తలెత్తే ఇన్‌ఫెక్షన్ల కారణంగా పొట్టలో ఏర్పడే అడ్‌హెనిసన్స్‌ వల్ల బహిష్టు సమయయంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ పరిణామాలు కూడా సంతానలేమికి కారణమవుతాయి. 

పి.సి. ఓ. డి : పాలిసిస్టిక్‌ ఓవరియన్‌ డిసీజ్‌ అనే ఈ సమస్య ఉన్నవారిలో హార్మోన్‌పరమైన అసమతుల్యత ఏర్పడి అండాలు సరిగా విడుదల కావు. ఈ సమయంలో రుతుక్రమం కూడా సరిగా ఉండదు. ఈ పరిణామాల వల్ల గర్భం దాల్చే అవకాశం ఉండదు. 

ఎండో మెట్రియాసిస్‌: గర్భాశయం లోపలి పొరల్లోని కణాలు కొన్ని గర్భాశయం బయట అసహజంగా తయారవుతాయి. ఫలితంగా బహిష్టు సమయంలో విపరీతమైన రక్తస్రావం అవుతుంది. దీనివల్ల ఇన్‌ఫెక్షన్లు తీవ్రమై అండాలు బలహీనమవుతాయి. ఇది కూడా గర్భధారణకు అంతరాయంగా మారుతుంది. 

ఆధునిక పరిష్కారాలుఈ సమస్య పరిష్కారానికి ఇప్పుడు మూడు రకాల విధానాలు అందుబాటులో ఉన్నాయి.

ఐ.యు.ఐ: భర్తనుంచి సేకరించిన వీర్యాన్ని ల్యాబ్‌లో పరీక్షించి వాటిల్లోంచి ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్న కణాలను వేరు చేస్తారు. ఆ తర్వాత ఒక సన్నని గొట్టం ద్వారా స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ విధానంలో సంతానం కలిగే అవకాశాలు 15 శాతం దాకా ఉంటాయి. ఆరు రుతు చక్రాల పాటు ఈ చికిత్స చేయవలసి ఉంటుంది. అప్పటికీ ఫలితం లేకపోతే, అప్పుడు ఐ.వి.ఎఫ్‌ ద్వారా ప్రయత్నించవచ్చు. 

క్సీ: స్త్రీ నుంచి సేకరించిన అండాల్లోకి పురుషుని శుక్రకణాన్ని ఒక ప్రత్యేకమైన మైక్రో మానిప్యులేటర్‌ ద్వారా ప్రవేశపెట్టి ఫలదీకరణ చెందిస్తారు. తర్వాత వాటిని తిరిగి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ విధానంలో సంతానం కలిగే అవకాశాలు 40శాతం దాకా ఉంటాయి. శుక్రకణాల సంఖ్య మరీ తక్కువగా ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 

ఐ.వి. ఎఫ్‌: దీన్నే టెస్ట్‌ ట్యూబ్‌ విధానం అంటారు. స్త్రీ నుంచి పక్వమైన అండాలను బయటికి తీసి పురుషుడి శుక్రకణాలతో బయటే ఫలదీకరణ చెందిస్తాయి. ఇలా ఏర్పడిన తొలిదశ పిండాల్లో రెండు లేదా మూడింటిని తిరిగి స్త్రీ గర్భాశయంఓకి ప్రవేశ పెడతారు. ఈ విధానం ద్వారా సంతానం కలిగే అవకాశాలు 35 శాతం దాకా ఉంటాయి. సంతాన సాఫల్య చికిత్సలకు సంబంధించి ఇటీవలి కాలంలో మరెన్నో కొత్త విధానాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫలదీకరించిన పిండాల్లో గర్భాశయంలోకి ప్రవేశపెట్టగా మిగిలిన పిండాలను అతి శీతల పరిస్థితుల్లో ఉంచి ఆ తర్వాత వాటినే వాడ టం జరుగుతుంది. అవసరాలను బట్టి అండాలను గానీ, శుక్రకణాలను గానీ ధాతల నుంచి స్వీకరించి కూడా వాడటం జరగుతుంది. వీటితో పాటు పిండాన్ని మరో స్త్రీ గ ర్భాఃశయంలో పెంచే ఒక వినూత్నమైన సర్రోగసీ విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. అందుకే ఇప్పుడు సంతానం కలగడం లేదని ఏళ్లతరబడి అలా బాధపడుతూ ఉండిపోవాల్సిన అవసరం లేదు. మీకు అండ గా నిలబడి మీరు ఆశించిన సంతాన భాగ్యాన్ని కలిగించేందుకు ఫర్టీ హాస్పిటల్‌ మీ కోసం సిద్ధంగా ఉంది. 

డాక్టర్‌. సి. జ్యోతిఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ఫెర్టి 9 హాస్పిటల్‌సికింద్రాబాద్‌, కూకట్‌ పల్లి, మాదాపూర్‌, సంతోష్నగర్‌, వరంగల్‌ఫోన్‌: 90300 15588,www.ferty9.com

Leave a Comment