ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు

  • చింతమడకలో సీఎం కేసీఆర్‌ దంపతులు..
  • సోమాజిగూడలో గవర్నర్‌..
  • కోదాడలో ఉత్తమ్‌..
  • నందినగర్‌లో కేటీఆర్‌

లోక్‌సభ ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు గురువారం ఓటు వేశారు. సిద్దిపేట రూరల్‌ మండలంలోని చింతమడకలో సీఎం కేసీఆర్‌, సతీమ ణి శోభతో కలిసి ఉదయం 11.16 గంటలకు ఓటు వేశారు. కేసీఆర్‌కు పొన్నాల గ్రామం వద్ద సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వాగతం పలికారు. ఓటు వేసేందుకు క్యూలైన్లలో ఉన్న గ్రామస్థులను ఆప్యాయంగా పలకరించారు. పోలింగ్‌ సరళి వన్‌సైడ్‌గా ఉందని, భారీ మెజారిటీతో గెలుస్తావంటూ మెదక్‌ లోక్‌సభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి సీఎం ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. సోమాజిగూడలోని ఎంస్‌ మక్తాలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఓటు వేశారు. ఓటు అనేది ప్రజాస్వామ్యలో ఎంతో విలువైనదని, దానిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయ న పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ వర్కిం గ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఓటు హక్కును  వినియోగించుకున్నారు. వెంకటేశ్వరకాలనీ డివిజన్‌ పరిధి నందినగర్‌లోని పోలింగ్‌ స్టేషన్‌కు భార్య శైలిమతో వచ్చి సాధారణ పౌరుడిగా లైన్‌లో నిల్చొని ఓటు వేశారు. బంజారాహిల్స్‌లోని ఉదయ్‌నగర్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ ఓటు వేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఉత్తమ్‌ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెజారిటీ స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ లోక్‌సభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత.. తన అత్తగారి గ్రామమైన నవీపేట మండలం పోతంగల్‌లో భర్త అనిల్‌తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక యూపీఎస్‌ పాఠశాలలోని 183వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. కాచిగూడ డివిజన్‌లోని దీక్షా మోడల్‌ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో సికింద్రాబాద్‌ బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి తన సతీమణి కావ్యతో కలిసి ఓటు వేశారు. ఈ పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంలు మొరాయించడంతో గంటసేపు కిషన్‌రెడ్డి నిరీక్షించాల్సి వచ్చింది. మరోవైపు నిజామాబాద్‌ జిల్లాలోని పోచారంలో స్పీకర్‌ పోచారం దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేటలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, నిర్మల్‌లోని ఎల్లపల్లిలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి ఓటేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎరబెల్లి దయాకర్‌రావు దంపతులు ఓటేశారు.

సినీ తారల క్యూహైదరాబాద్‌ సిటీ/ బంజారాహిల్స్‌/ రాయదుర్గం, ఏప్రిల్‌ 11 : నగరంలో ఓటింగ్‌ కేంద్రాల వద్ద రాజకీయ, సినీ ప్రముఖుల సందడి కనిపించింది. కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి తన భార్య సురేఖ, కుమారుడు రామ్‌ చరణ్‌, కోడలు ఉపాసన తో కలిసి జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో ఓటు వేశారు. నానక్‌రామ్‌గూడలో నాగచైతన్య, సమంత దంపతులు ఓటు వేశారు. హీరో కృష్ణ, మా అధ్యక్షుడు నరేశ్‌, ఆయన కుమారుడు నవీన్‌ ఓటు వేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ తన తల్లి షాలిని, భార్య ప్రణీతతో కలిసి జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 10 ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఓటు వేశారు. ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖుల్లో వెంకటేశ్‌, అల్లు అర్జున్‌, రవితేజ, మంచు మోహన్‌బాబు, లక్ష్మి, విష్ణు, మనోజ్‌, జీవిత, రాజశేఖర్‌ దంపతులు, కీరవాణి, పోసాని, వేణు, నారా రోహిత్‌, కోట శ్రీనివా్‌సరావు, పరుచూరి గోపాలకృష్ణ, రాఘవేంద్ర రావు, దగ్గుబాటి రానా, వందేమాతరం శ్రీనివాస్‌ ఉన్నారు. బేగంపేట్‌లో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌,

జూబ్లీహిల్స్‌లో చేవెళ్ల టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి, ఎస్‌ఆర్‌నగర్‌లో కే రోశయ్య, ఆల్వాల్‌లో గద్దర్‌, చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సంగీతరెడ్డి దంపతులు, సినీ నటి విజయశాంతి బంజారాహిల్స్‌లో ఓటు వేశారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఇతర ప్రముఖుల్లో సీఎస్‌ ఎస్కే జోషి, సీఈవో రజత్‌ కుమార్‌, సీపీ అంజనీకుమార్‌, బీజేపీ నేత లక్ష్మణ్‌, కాంగ్రెస్‌ నేత వీహెచ్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌, మైనంపల్లి హన్మంతరావు, ముఠా గోపాల్‌, సాయన్న, మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు, స్వామి పరిపూర్ణానంద, సానియా మీర్జా ఉన్నారు.

Leave a Comment