రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి: రజత్ కుమార్

హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత రజత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 17 నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. 5 గంటల వరకు 17 నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలను రజత్ కుమార్ మీడియాకు తెలిపారు. 

ఆదిలాబాద్ 66.76, పెద్దపల్లి 59.24, కరీంనగర్ 68, నిజామాబాద్ 54.2, జహీరాబాద్ 67.8, మెదక్ 68.6, మల్కాజ్‌గిరి 42.75, సికింద్రాబాద్ 39.2, హైదరాబాద్ 39.49 , చేవెళ్ల 53.8, మహబూబ్‌నగర్ 64.99, నాగర్ కర్నూల్ 57.12, నల్గొండ 66.11, భువనగిరి 68.25, వరంగల్ 60, మహబూబాబాద్ 59.99, ఖమ్మం 67.96 శాతం పోలింగ్ నమోదయినట్లు రజత్ కుమార్ వెల్లడించారు. 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 61 శాతం పోలింగ్ నమోదయిందన్నారు. 

తుది పోలింగ్ వివరాలు రేపు వెల్లడిస్తాం. పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది. పెరిగిన పోలింగ్ శాతం వివరాలు రేపు వెల్లడిస్తాం. ఎక్కడా బూత్ క్యాప్చరింగ్ జరగలేదు. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు. అన్ని ఈవీఎంలు అర్ధరాత్రి కల్లా రిసెప్షన్ సెంటర్‌కు చేరుతాయి. నిజామాబాద్‌లో చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని రజత్ కుమార్ స్పష్టం చేశారు.

Leave a Comment