భోగి పండ్లను పిల్లల నెత్తిన ఎందుకు పోస్తారు?

Telugu
తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజును 'భోగి'గా పిలుస్తారు. రెండో రోజును 'మకర సంక్రాంతి'గా, మూడో రోజును 'కనుమ'గా పిలుస్తారు. నాలుగో రోజును 'ముక్కనుమ' అంటారు. సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయడం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. భోగి రోజు చేసే బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్లు పోస్తారు. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు

సంక్రాంతి రోజున స్నానం చేయకుండా వుండకండి..

Telugu
పుష్యమాసం, శుక్లపక్షంలో వచ్చే సంక్రాంతి నాడు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. సూర్యుడు ధనుర్ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజు సంక్రాంతి. ఈ రోజును అత్యంత శుభదినంగా భావిస్తాం. శాస్త్రాల్లో సంక్రాంతి రోజున పుణ్యతీర్థాల్లో స్నానమాచరించడం ద్వారా పుణ్య ఫలితాలను పొందవచ్చు. సంక్రాంతి రోజున గంగ, గోదావరి, కృష్ణ, కావేరీ నదుల్లో స్నానమాచరించే వారికి బ్రహ్మలోక ప్రాప్తి చేకూరుతుంది. నదీస్నానం చేయలేని వారు ఇంట్లోనే శుచిగా స్నానమాచరించవచ్చు. వీలైనంతవరకు మకర సంక్రాంతి నాడు చల్లని నీటితోనే స్నానం చేయాలి. సంక్రాంతి రోజున స్నానం చేయని వారు నిరుపేదలుగా, అనారోగ్యాలతో బాధపడతారని శాస్త్రాలు చెప్తున్నాయి. మకర సంక్రాంతి నాడు ఎవరైతే తీర్థస్నానం చేసి.. పిండ ప్రదానం చేసి బ్రాహ్మణులకు దానం ఇస్తే.. స్వర్గ వాసులు దానిని స్వీకరించి ఆశీర్వదిస్తారు. భోగి, సంక్రాంతి రోజున ఇంట్లోని స్వామి వారి ప్రతిమలకు పవిత్ర

makara ankranthi 2018

Telugu
ఈ తేదీల్లోనే.. సంక్రాంతి ఎందుకు? సంక్రాంతి పండుగ పిల్లలకు ఇష్టమైన పండుగ... భారతదేశమంతా జరిగే వేడుక... రివ్వున ఎగిరే గాలిపటాలు... కమ్మకమ్మని పిండి వంటలు... అందమైన ముగ్గులు... డూడూ బసవన్నలు... అన్నీ కలిస్తే... అదే సంక్రాంతి పండుగ. ఇదంటే శాన్వికి ఎంతో ఇష్టమట. అయితే సంక్రాంతి ఎందుకు చేస్తారు? ఇది మాత్రం ఒకే తేదీన ఎందుకు వస్తుందంటూ బోలెడు సందేహాలున్నాయట. అవన్నీ వాళ్లమ్మని అడుగుతానంటూ పరుగులు తీసింది. మరి వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటో? మనమూ తెలుసుకుందామా! శాన్వి : అమ్మా! నాకు అన్ని పండుగ సెలవులకన్నా సంక్రాంతి సెలవులంటే చాలా ఇష్టం... అమ్మ: ఎందుకు? శాన్వి : చక్కగా ఇంటి నిండా ముగ్గులు పెట్టేస్తావూ... మాకు నచ్చిన కమ్మని వంటలన్నీ వండేస్తావూ. ఇంకా తాతయ్య దగ్గరుండి గాలిపటం చేసిచ్చి పొద్దున్నుంచి మాతోపాటే సరదాగా గడుపుతారు. బసవన్నల్ని చక్కగా అలంకరించి తీసుకొస్తారు. పట్టణాల్లో చదువుకుంటున్న

Kollywood focus on Janvi Kapoor

jhanvi kapoor
జాన్వీపై కోలీవుడ్‌ కన్ను కొత్త తారలను పరిచయం చేయడంలో కోలీవుడ్‌ ఎప్పుడూ ముందుంటుంది. అదే విధంగా వర్ధమాన నటీమణులు తమిళ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపుతారు. అతిలోకసుందరిగా పేరు గడించిన నటి శ్రీదేవి లాంటి వారు కోలీవుడ్‌లో కథానాయకిగా రాణించిన వారే. శ్రీదేవి కోలీవుడ్, టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలిగి ఆ తరువాత బాలీవుడ్‌లో సెటిల్‌ అయ్యారు. ఆ మధ్య నటిగా రీఎంట్రీ ఇచ్చి ఇంగ్లీష్‌ వింగ్లీష్, మమ్మీ వంటి చిత్రాలతో సత్తా చాటుకున్న శ్రీదేవి తాజాగా తన వారసురాలిగా పెద్ద కూతురు జాన్వీని రెడీ చేశారు. ఇప్పటికే హిందీలో కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో దడక్‌ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. ఆ చిత్రంలో నాజూగ్గా ఉండడానికి సన్నబడాలన్న దర్శకుడి ఆంక్షల మేరకు జాన్వి అందుకు కసరత్తులు చేసే పనిలో నిమగ్నమైంది. కాగా సెలబ్రిటీస్‌ను ఫొటోల్లో బంధించడానికి విమానాశ్రయాలు, నక్షత్ర హోటళ్లు, జిమ్‌ల వంటి ప్రాంతాల్లో ఫొటోగ్రాఫర

Special chit chat with shruti haasan

shruti haasan
శ్రుతిహాసన్ పెళ్లికి అందరూ పెద్దలే... ‘‘ఇంకా పెళ్లి డేట్‌ ఫిక్స్‌ కాలేదు ...  అబ్బాయి ఎవరో డిసైడ్‌ కాలేదు కానీ...  ఈ పెద్దలు పెళ్లికార్డులు కొట్టించి పంచేస్తున్నారు’’ అని పంచ్‌ వేసింది శ్రుతీహాసన్‌ ఈ మధ్య ఎక్కడ చూసినా మీరు... మీతో పాటు మరో వ్యక్తి (మైఖేల్‌ కోర్సలే – లండన్‌కి చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌).... 2017 ఎండింగ్‌లో ఔత్సాహికులకు కావాల్సినంత మేత ఇచ్చారు..  (నవ్వేస్తూ). ఆ మాటకొస్తే నా లైఫ్‌ ఎప్పుడూ పబ్లిక్కే. చిన్నప్పుడు బయట కనిపిస్తే చాలు.. ‘పెద్దయ్యాక ఏమవుతావ్‌. పాటలు బాగా పాడతావా? డాన్స్‌ చేస్తావా? యాక్ట్‌ చేస్తావా?’ అని అడిగేవాళ్లు. నాకేం చెప్పాలో తెలిసేది కాదు. పుట్టిన ప్పటి నుంచి ఇప్పటి వరకూ నాకు పర్సనల్‌ స్పేస్‌ అంటూ లేకుండా పోయింది. మొత్తం పబ్లిక్‌. ఇప్పుడైతే చాలా విసుగు అనిపిస్తోంది. అందుకే నా పర్సనల్‌ లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ట్రై చేయకపోతే బాగుంటుందనిపిస్తోంది

నువ్వు జ్ఞాపకం కాదు… నువ్వే నా జీవితం

Love Stories, Telugu
నా ఫ్రెండ్స్‌లో ఓ అమ్మాయి ఒకరోజు తన ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ లో పెట్టిన పిక్చర్‌ నాలో అలజడి సృష్టించింది. ఆ ఫోటోలో ముగ్గురు అమ్మాయిలున్నారు. అందులో వున్నా ఒక అమ్మాయి కళ్లలో ఏదో మాయ. నన్ను చూపు తిప్పుకోనివ్వ లేదు. ఎన్ని సార్లు ఆ ఫొటో చూశానో... ఎన్ని సార్లు షేర్‌ చేశానో నాకే తెలియదు. ఇంతలో నా ఫ్రెండ్‌ ఫోన్‌ చేసింది. ఏరా అన్ని సార్లు షేర్‌ చేస్తున్నావ్‌.. ఏంటి సంగతి అంది? తన గురించి అడిగాను. తనూ నా డిప్లొమో ఫ్రెండ్‌ అని చెప్పింది. ఫోన్‌ నంబరు అడగాలనుకున్నాను. రాత్రి నిద్ర పట్టలేదు. ఫోన్‌ చేసి తన నంబర్‌ తీసుకోవాలనిపిస్తోంది. మెసేజ్‌ చేశాను. తన రూపం కనురెప్పలకు అడ్డం పడుతోంది. అవి మూతపడటం లేదు. తెల్లారి ఫోన్‌ చూసుకుంటే తన నంబర్‌ మెసేజ్‌ వచ్చింది. నా ఫ్రెండ్‌కి ఫోన్‌ చేశాను. ‘ఒరే... నువ్వు మంచివాడివని... ఇంతకుముందెప్పుడు ఏ అమ్మాయి గురించి అడగలేదని...నీకు ఈ నంబర్‌ పంపాను. మిస్‌ బిహేవ్‌ చేయకు...
Telangana New districts Division Zones and Mandals

Telangana New districts Division Zones and Mandals

Political News
జిల్లాలు.. డివిజన్లు.. మండలాల కొత్త రూపు తెలంగాణ రాష్ట్రం కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. నవ తెలంగాణ సమగ్ర స్వరూపం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రం 31 జిల్లాలతో సరికొత్త స్వరూపాన్ని సంతరించుకుంది. బంగారు తెలంగాణకు వడివడిగా అడుగులు పడుతున్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా, ప్రజాభిష్టాలకు అనుగుణంగా జిల్లాల పునర్విభజన జరిగింది. ప్రతీ పల్లె స్వయంసమృద్ధి సాధించే దిశగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజన చారిత్రాత్మక నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. Download: telangana-newdistricts
Telangana new-districts transport department to new bosses

Telangana new-districts transport department to new bosses

Hero
రవాణాశాఖకు కొత్తబాస్‌లు - నేటి నుంచి విధుల్లో అధికారులు కొత్తజిల్లాలకు రవాణాశాఖ అధికారుల నియామక ప్రక్రియను ప్రభుత్వం పూర్తిచేసింది. రోడ్డు రవాణాశాఖ అధికారి (ఆర్టీవో) కార్యాలయాల్లో ప్రస్తుతం సీనియర్లుగా ఉన్న తొమ్మిది మంది ఎంవీఐలకే ఆర్టీవోలుగా బాధ్యతలు అప్పగించింది. అదేవిధంగా కొత్తజిల్లాలకు కొత్త కోడ్లను కేటాయించింది. పలుచోట్ల జేటీసీలు, డీటీసీలకు కూడా బాధ్యతను భుజాలకెత్తింది. మంగళవారం (దసరా పండుగ) నుంచి నూతన జిల్లాల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించేలా రవాణాశాఖ చర్యలు తీసుకున్నది. జిల్లాస్థాయిలో పనిచేస్తున్న డీటీసీలు, ఆర్టీవోలతో పలు దఫాలుగా చర్చించి కొత్త జిల్లాల పాలనకు అవసరమైన అన్నిచర్యలు చేపట్టింది. ప్రతిజిల్లాకు ఆర్టీవో కార్యాలయం ఏర్పాటు చేయడం, ప్రతిపాదిత కొత్తజిల్లాలో ఇప్పటికే పనిచేస్తున్న ఎంవీఐ యూనిట్ ఆఫీసులను అప్‌గ్రేడ్ చేస్తూ ఆర్టీవో కార్యాలయాలుగా మార్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిస
Telangana new districts collectors list

Telangana new districts collectors list

Political News
కలెక్టర్లు, ఎస్పీలను నియమించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్, నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణా, ఖమ్మం కలెక్టర్ లోకేశ్‌కుమార్‌ను తిరిగి ఆయా జిల్లాల కలెక్టర్లుగానే కొనసాగించగా.. మెదక్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్‌ను మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. మిగతా 26 జిల్లాలకు పూర్తిగా కొత్త వారిని కలెక్టర్లుగా, 31 జిల్లాలకు ఎస్పీలను నియమించింది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో యువ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కలెక్టర్లు, ఎస్పీలుగా అవకాశం లభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిది జిల్లాలకు మహిళా కలెక్టర్లు నియామకమయ్యారు. ఇక రాజీవ్‌శర్మ కొత్త జిల్లాలకు నియమ