రవ్వ పులిహోర
కావలసినవి
బియ్యంరవ్వ: 2 కప్పులు, నిమ్మకాయలు: 2, ఇంగువ: అరటీస్పూను, వేరుసెనగ గింజలు: టేబుల్‌స్పూను, ఉప్పు: సరిపడా, నూనె: 6 టీస్పూన్లు, పసుపు: టీస్పూను, కరివేపాకు: 4 రెబ్బలు, పచ్చిమిర్చి: 2, పోపుకోసం: ఆవాలు: అరటీస్పూను, ఎండుమిర్చి: 2, సెనగపప్పు: 2 టీస్పూన్లు, మినప్పప్పు: 2 టీస్పూన్లు
తయారుచేసే విధానం
*బియ్యం రవ్వలో పసుపు, టీస్పూను ఉప్పు, టీస్పూను నూనె వేసి ఒకటికి రెండు చొప్పున నాలుగు కప్పుల నీళ్లు పోసి కుక్కర్‌లో ఉడికించాలి. 3 విజిల్స్ వచ్చాక దించి ఉడికిన రవ్వను పొడిపొడిగా చేసి చల్లారనివ్వాలి.
* బాణలిలో 5 టీస్పూన్ల నూనె వేసి పచ్చిమిర్చి, ఇంగువ, వేరుసెనగగింజలు వేసి వేగాక మిగిలిన పోపు దినుసులు కూడా వేసి కరివేపాకు వేసి చిటపటమన్నాక దించాలి.
* ఈ తాలింపులోనే నిమ్మరసం పిండి, సరిపడా ఉప్పు వేసి రవ్వలో కలపాలి. చివరగా కొత్తిమీర చల్లితే నోరూరించే రవ్వ పులిహోర రెడీ. ఇష్టమైతే క్యారెట్ తురుము కూడా కలుపుకోవచ్చు.
| Next >బియ్యపు ఉప్మా|Telugu Vanitha Vantakalu |
|---|
Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details
Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details
Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details