కావలసిన పదార్థాలు :
బొప్పాయి కాయ - అరకేజీ
కొబ్బరి కోరు - అర కేజీ
నెయ్యి - 100గ్రా
బెల్లం - పావు కిలో
పంచదారం - పావు కిలో
యాలకులు - తగినన్ని
జీడిపప్పు - తగినంత
కిస్‌మిస్ - తగినన్ని
తయారీ విధానం :
మొదట బొప్పాయి కాయ చెక్కు తీసి తురుముకోవాలి. తరువాత ఈ తురిమిన కోరుని ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తరువాత నీళ్లు తీసేసి తురుమును ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇంకో గిన్నెలో బెల్లం, పంచదార కొన్ని నీళ్లు వేసి సన్నని సెగపై పాకం పట్టాలి. పాకం వచ్చిన తరువాత ఉడికించిన బొప్పాయి తురుముతో పాటు కొబ్బరి తురుమును కూడా ఈ పాకంలో వేయాలి. పాకం కాస్త చిక్కగా అయిన తరువాత దానిలో నెయ్యి వేసి స్టవ్‌మీదనుంచి దించేయాలి. తరువాత దీనిని లడ్డూల్లా ఉండలు చుట్టుకొని జీడిపప్పు, కిస్‌మిస్ వేసి గార్నిష్ చేసుకోవాలి.
- జె. అర్పితాదేవి, తిలక్ వీధి, కాకినాడ
కావలసిన పదార్థాలు :
చిలగడ దుంపలు - కేజీ
బెల్లం - అరకేజీ
వేయించిన శనగపప్పు(పుట్నాల పప్పు) - పావు కిలో
యాలకులు - 10గ్రా
మినప పప్పు - పావు కిలో
బియ్యం - అరకేజీ
నూనె - అర కేజీ
తయారీ విధానం :
మొదట బియ్యం, మినప్పప్పును నీటిలో నానబెట్టుకోవాలి. తరువాత దీనిని మిక్సీలో వేసి కాస్త ఉప్పు చేర్చి పూర్ణం పిండిలా పట్టుకోవాలి. తరువాత చిలగడ దుంపలను ముక్కలు కోసి ఉడకబెట్టుకోవాలి. చల్లారిన తరువాత ఈ ముక్కలకు బెల్లం, యాలకులు కలిపి మెత్తని ముద్దలా చేసుకోవాలి. పుట్నాల పప్పును పొడిచేసి ఈ ముద్దలో కలపాలి. ఇప్పుడు ఈ ముద్దను ఉండ ల్లా చేసుకొని పూర్ణం పిండిలో ముంచి నూనెలో దోరగా వేయించి తీసుకోవాలి. దీంతో చిలగడ దుంప పూర్ణాలు రెడీ అయినట్టే.
- వి. స్వరాజ్యలక్ష్మి, చనుగొండ, కృష్ణా
కావలసిన పదార్థాలు :
మైదా పిండి, నూనె, పాలు, నెయ్యి, వేరుసెనగ గుళ్లు, ఎండు కొబ్బరి, బెల్లం, పుట్నాల పప్పు(వేయించిన సెనగపప్పు), డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు మనకు కావలసిన మోతాదును బట్టి క్వాంటిటీని ఎన్నుకోవాలి.
తయారీ విధానం :
ముందుగా మైదాను పాలతో తడిపి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి, బెల్లంను తురుముకోవాలి. నువ్వులు, వేరుసెనగను వేయించి కొంచెం గరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్‌ను నేతిలో వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. దీంతోపాటు పుట్నాల పప్పును గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మైదాను బాగా పిసికి చిన్నచిన్న ముద్దలుగా చేసుకొని పూరీల్లా వత్తుకోవాలి. ఒకే పరిమాణంలో ఉన్న చిన్న గిన్నెలు తీసుకుని గిన్నెల వెనుక వైపునకు ఈ పూరీలను అంటించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ బాణలిలో నూనె పోసి వేడిక్కిన తరువాత ఈ గిన్నెలను అందులో వేయాలి. గిన్నెల నుంచి పూరీలు విడిపోయిన తర్వాత వీటిని నూనెలో నుంచి తీసెయ్యాలి. ఇప్పుడు పిండి కప్పులు రెడీ అయ్యాయన్న మాట! ఈ పిండి కప్పుల్లో మొదట కొద్దిగా నెయ్యి రాసి దానిపైన కొబ్బరి తురుము, వేరుసెనగ కాయల పొడి, దానిపైన బెల్లం తురుము తరువాత నువ్వుల పొడి, పుట్నాల పప్పు పొడి వేసి పైన డ్రై ఫ్రూట్స్ వేసి అలంకరించుకుంటే కమ్మని తెలుగింటి చాట్ రెడీ అయినట్లే. ఇది భలే టేస్టీగా ఉంటుంది.
- మావిళ్ల పద్మారాణి, దోమలగూడ, హైదరాబాద్
కావలసిన పదార్థాలు :
ఉడికించిన బంగాళ దుంపలు - 4,
ఖర్జూర పండు ముక్కలు - 20,
జీడిపప్పు - 20 పలుకులు,
కిస్‌మిస్ - 20, సారపప్పు - చెంచా,
పంచదార పొడి - మూడు చెంచాలు,
యాలకుల పొడి - రెండు చెంచాలు,
నెయ్యి - తగినంత.
తయారీ విధానం :
ముందుగా బంగాళ దుంపలను మొత్తగా ఉడికించి పూర్తిగా శుభ్రం చేసి మొత్తగా చిదమాలి. తరువాత ఆ మిశ్రమాన్ని నేతిలో వేయించి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. జీడిపప్పు, బాదంపప్పు, సారపప్పు ముక్కలను కూడా నేతిలో వేయించి వాటిని బంగాళదుంపల మిశ్రమంలో వేసి కలపాలి. అందులో పంచదార పొడి, యాలకుల పొడి కూడా వేసి చిన్నచిన్న ఉండలుగా చుట్టి వాటిని కొబ్బరి పొడిలో అద్దుకోవాలి. కావాలనుకుంటే వాటిపైన ఒక చెర్రీ పెట్టుకుని అలంకరిచుకోవచ్చు. దీంతో 'ఆలూ ఫ్రూట్ బాల్స్' సిద్ధమయినట్లే.
- పి. శ్రీదేవి, మారుతి నగర్, సంతోష్‌నగర్, హైదరాబాద్
కావలసిన పదార్థాలు :
పాల మీగడ - 100 గ్రా
పనీర్ తురుము - అరకేజీ
జామూన్ మిక్స్ - 200గ్రా
పంచదార - కేజీ
నీళ్లు - తగినన్ని
నూనె - వేయించడానికి సరిపడా
మైదా - 100గ్రా
యాలకుల పొడి - అరచెంచా
తయారీ విధానం :
పనీర్ తురుములో మైదా, పాలమీగడ, జామూన్ మిక్స్, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. ఈ పిండిని అరగంట పాటు నానబెట్టుకోవాలి. పంచదారలో తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత పిండిని చిన్నచిన్న ముద్దలుగా చేసి గుండ్రని బిళ్లల్లా వత్తి నూనెలో దొరగా వేయించుకోవాలి. తర్వాత వీటిని పంచదార పాకంలో వేసి మూడు నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత వీటిని తీసేసి కాస్త పంచదారలో రెండువైపులా దొర్లించి తీసి ట్రేలో విడివిడిగా సర్దుకోవాలి. వీటి రుచి అమోఘంగా ఉంటుంది. అంతేకాక ఈ మలైకాజాను వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు కూడా.
- యు. శిరీషా, తణుకు
(సొరకాయ పాయసం)
కావలసిన పదార్థాలు :
సొరకాయ - చిన్నది 1
పాలు - లీటర్
బాస్మతి రైస్ - 100గ్రా
కార్న్ ఫ్లోర్ - 100గ్రా
కోవా లేదా ఖలాకండ్ - పావు కిలో
పంచదార - అరకేజీ
మిల్క్ మెయిడ్ - 400గ్రా
నెయ్యి - 50గ్రా
జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష - 50గ్రా
ఫుడ్ కలర్ (గ్రీన్) - చిటికెడు
తయారీ విధానం :
ముందుగా బాస్మతి బియ్యాన్ని చిటికెడు నెయ్యిలో వేయించి పిండి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో పాలు పోసి అవి మరుగుతున్నప్పుడు బియ్యం పిండిని నీళ్లలో కలిపి పేస్టులా చేసి గరిటెతో కలుపుతూ ఆ పాలల్లో పోయాలి. అలాగే మొక్కజొన్న పిండిని కూడా పేస్టులా చేసి అందులో పోయాలి. దాంతోపాటు సొరకాయ తురుమును కాస్త ఉడికించి పాలల్లో వేయాలి. తర్వాత చక్కెర వేసి కాస్త చల్లారిన తర్వాత కోవా, మిల్క్ మెయిడ్, గ్రీన్ కలర్‌లను వేసి బాగా కలపాలి. చివరగా జీడిపప్పు, బాదంపప్పు, ఎండుద్రాక్షలను నెయ్యిలో దోరగా వేయించి నెయ్యితో పాటు పాయసంలో పోసి ఒక అరగంట డీప్ ఫ్రిజ్‌లో పెట్టి సర్వ్ చేస్తే చాలా మధురంగా ఉంటుంది. ఈ పాయసం ఫ్రిజ్‌లో వారం, పది రోజుల పాటు నిల్వ ఉంటుంది.
- రూహీ, ఎస్.సి. కమ్యూనిటీ హాల్ దగ్గర, లింగాల రోడ్డు, అచ్చంపేట, మహబూబ్‌నగర్
కావలసిన పదార్థాలు :
క్యారెట్ - పావు కిలో
చిక్కటి పాలు - లీటరు
పంచదార - పావు కిలో
జీడిపప్పు - వంద గ్రా.,
యాలకులు - 4 (పొడిచేసుకోవాలి)
తయారీ విధానం :
క్యారెట్‌ని ముక్కలుగా కోసి కుక్కర్‌లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత ఈ ఉడికిన ముక్కలు, జీడిపప్పు కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి. పాలు కాచి, పొంగువచ్చే సమయంలో ఈ ముద్ద, యాలకుల పొడి వేయాలి. సన్నని సెగపై అడుగు అంటకుండా కలయతిప్పుతూ ఉండాలి. ఇలా పదినిమిషాల పాటు తిప్పి పంచదార వేయాలి. దీంతో క్యారెట్ ఖీర్ తయారయినట్టే.
ఈ ఖీర్‌ను వేడి వేడిగా తీసుకుంటే భలే రుచిగా ఉంటుంది. చల్లారాక కూడా దీని రుచిలో మార్పేమి ఉండదు. ఇది చాలా బలవర్థకమైన ఆహారం. బాదం పాలులా కనిపించే దీనిని పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు.
- టి. కవిత, వినాయక నగర్, పెదగంట్యాడ, విశాఖపట్టణం.
కావలసిన పదార్థాలు :
పాలు - అర లీటరు
పంచదార - 200గ్రా
కొబ్బరి పాలు - అర లీటరు (కొబ్బరి కోరుని మిక్సీలో వేసి చిక్కగా పాలు తీసుకోవాలి)
యాలకుల పొడి - కొద్దిగా
మైదా - 200గ్రా
గోధుమపిండి - 200గ్రా
ఉప్పు - అరచెంచా
గసగసాలు - 25గ్రా
పూరీలు వేయించడానికి
సరిపడా నూనె
తయారీ విధానం :
ముందుగా మైదా, గోధుమపిండి, ఉప్పు, నీళ్లు వేసి పూరీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. కాచిన పాలలో పంచదార, కొబ్బరిపాలు, యాలకుల పొడి, గసగసాల పొడి(నూనె వేయకుండా వేయించి పొడిచేసి ఉంచుకోవాలి) వేసి పంచదార బాగా కరిగేవరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండితో పూరీలు చేసి ఎర్రగా వేయించి ఈ పాలలో వేయాలి. ఇవి బాగా నానితే మంచి రుచితో నోరూరిస్తాయి. ఈ పాల పూరీలు మంచి బలమైన ఆహారం కూడా.
- కె. త్రిపురా సింగ్, పి.ఎఫ్ క్వార్టర్స్, మర్రిపాలెం, విశాఖపట్నం
కావలసిన పదార్థాలు :
లేత మొక్కజొన్న గింజలు - మూడు కప్పులు
పంచదార - అరకిలో
నెయ్యి - వంద గ్రాములు
యాలకులు - 5
జీడిపప్పు - 10 పలుకులు
ఎండు ద్రాక్ష - చెంచా
తయారీ విధానం :
ముందుగా మొక్కజొన్న గింజలను మెత్తగా రుబ్బి అందులోంచి పాలను పిండి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఓ పాత్రలో కొంచెం నేయి వేసి అందులో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ నాన్‌స్టిక్ పాన్‌లో గ్లాసు నీళ్లు, పంచదార వేసి మరిగించాలి. కాస్త పాకం వచ్చిన తరువాత మొక్కజొన్న పాలను అందులో వేసి చిక్కబడే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అది చిక్కబడి ముద్దలా తయారవుతుంది. అప్పుడు అందులో నెయ్యి వేసి హల్వాలా అయ్యేవరకు కలిపాలి. చివరగా యాలకుల పొడి, నేతిలో వేయించి తీసిన ఎండుద్రాక్ష, జీడిపప్పు ఆ ముద్దలో వేసి కలపాలి. ఇప్పుడు ఈ హల్వాను చిన్న పళ్లెంలో వేసి చల్లారిన తరువాత ముక్కలుగా కోస్తే సరి, నోరూరించే బుట్టా కా హల్వా తయారవుతుంది.
- బి. భావన, సికింద్రాబాద్
కావలసిన పదార్ధాలు :
మైదాపిండి - కప్పు
అరటిపండు గుజ్జు - కప్పు
డాల్డా లేదా నెయ్యి - ఒకటిన్నర కప్పు
వెన్న - రెండు చెంచా
పంచదార - పావు కిలో
కిస్‌మిస్‌లు - 20
యాలకులు - 5
బాదం పప్పు - 20గ్రా
జీడిపప్పు - 20గ్రా
తయారీ విధానం :
ముందుగా మైదాను శుభ్రంగా జల్లించుకోవాలి. అరటిపండును తొక్కతీసి గుజ్జుగా చేసుకోవాలి. ఇప్పుడు ఓ పాత్రలో మైదా, అరటిపండు గుజ్జు వేసి అందులో వెన్న వేసి ముద్దలా కలపాలి. తరువాత ఓ బాణలిలో కిద్దిగా నెయ్యి వేసి అందులో జీడిపప్పును వేయించి తీసేయాలి. ఇప్పుడా బాణలిలో మరో రెండు చెంచాల నెయ్యిని వేసి ముద్దగా చేసిపెట్టుకున్న మైదా మిశ్రమాన్ని అందులో వేసి దోరగా వేయించాలి. ఇలా చేయడం వల్ల ముద్ద పచ్చివాసన పోతుంది. ఇప్పుడీ ముద్దలో కిస్‌మిస్, జీడిపప్పు, యాలకులు పొడి వేసి మెత్తగా పూరీల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడా పిడిని చిన్న చిన్న బిళ్లల్లా చేతితో పట్టుకుని వత్తుకోవాలి. ఇలా బిళ్లల్లా వత్తుకున్న తరువాత బాణలిలో నెయ్యి వేసి కరిగిన తరువాత ఈ బిళ్లలను వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. వేయించిన తీసిన బిళ్లలను ఓ ప్లేటులో కింద పేపర్ పెట్టి వీటిని సర్ది పైన పంచదార చల్లుకుంటే అరటిపండు డ్రై బర్ఫీ సిద్ధమయినట్లే!
- పంపిన వారు పేరు రాయలేదు
కావలసిన పదార్థాలు :
బాగా పండిన బొప్పాయి పండు - చిన్నది
పంచదార - రెండు కప్పులు
నెయ్యి - కప్పు
యాలకులు పొడి- అర చెంచా
జీడిపప్పు తురుము (పొడవుగా సన్నగా తురిమినది) - మూడు చెంచాలు బాదం తరుము - రెండు చెంచాలు
ఆరెంజ్ లేదా రెడ్ కలర్ - పావు చెంచా (ఇష్టమైతేనే)
మైదా - అర కప్పు
చిక్కటి పాలు - కప్పు
బాదం పప్పు ముక్కలు - చెంచా
కిస్‌మిస్ - 12
పచ్చి కొబ్బరి - పావు కప్పు.
తయారీ విధానం :
ముందుగా బొప్పాయి పండు చెక్కు తీయాలి. తరువాత దానిని శుభ్రం చేసి సగానికి కోసి లోపల గింజలను పూర్తిగా తొలగించి చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కల్ని మిక్సీలో వేసి పేస్టులా చేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో స్పూను నెయ్యి వేసి మైదాను మంచి వాసన వచ్చేవరకు వేయించి ఓ గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నాన్‌స్టిక్ పాన్ తీసుకుని దాంట్లో పంచదార ఒక కప్పు, నీళ్లు పోసి చిక్కటి పాకం వచ్చేవరకు ఉడికించి, కప్పు పాలు పోయాలి. పాలు రెండు నిమిషాల్లో విరిగిపోతాయి. అందులో కలర్, మైదా, బొప్పాయి పేస్టు, పచ్చికొబ్బరి, జీడిపప్పు, బాదం తురుము, ముక్కలు వేసి అందులో నెయ్యి పోసి కలపాలి. తరువాత ఓ పళ్లానికి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని పోసి పైన కిస్‌మిస్‌లు అందంగా అలంకరిస్తే సరి 'కాజు-బొప్పాయి ముర్జీ' రెడీ అయినట్టే. ఇంకా కావాలనుకుంటే కావాల్సిన ఆకారంలో ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు.
- కె. శ్రీమాధవి, పొన్నూరు, గుంటూరు జిల్లా
కావలసిన పదార్థాలు :
తెల్ల నువ్వుల - పావు కిలో
బెల్లం - పావు కిలో
బియ్యం పిండి - పావు కిలో
యాలకులు - 5
ఎండు కొబ్బరి - 100గ్రా
నూనె - తగినంత
తయారీ విధానం :
ఓ బాణలిలో నూనె వేసి అందులో తెల్ల నువ్వులను వేసి దోరగా వేయించాలి. నువ్వులు చల్లారిన తరువాత మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. తరువాత బెల్లం, యాలకులను కూడా పొడి చేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరిని తురుములా చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిలో తగినంత నీరు పోసి కొంచెం ఉప్పు వేసి జారుడుగా కలుపుకోవాలి. అనంతరం పొడిగా చేసిపెట్టుకున్న నువ్వుల పొడి, బెల్లం, యాలకుల పొడి, కొబ్బరి తురుమును బాగా కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె పోసి కాగిన తరువాత ఈ నువ్వుల ఉండలని జారుడుగా కలిపి ఉంచిన పిండిలో ముంచి నూనెలో వెయ్యాలి. దోరగా వేయించి తీస్తే సరి నూగుపొడి పూర్ణాలు సిద్ధమయినట్టే. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు.
- సాగి రాజేశ్వరి, పాతూరు, నరసరావుపేట,గుంటూరు జిల్లా
* పకోడీలు కరకరా రావడానికి శెనగపిండి మిశ్రమానికి కాస్త కార్న్‌ఫ్లోర్‌ను కలపాలి.
* అల్యూమినియం పాత్రలు మాడిపోయినప్పుడు దానిలో ఒక ఉల్లిపాయను నీళ్లలో వేసి మరిగించాలి. లోపల అంటుకున్నదంతా తెట్టులా పైకి దానంతట అదే తేలిపోతుంది.
* చల్లటి నీటికి నిమ్మరసాన్ని కలిపి వడిలిపోయిన కూరగాయలను అందులో కాసేపు నాననిస్తే తాజాదనాన్ని సంతరించుకుంటాయి.
* వడిలిపోయిన టమాటాలను ఉప్పు కలిపిన చల్లటి నీటిలో వేసి రాత్రంతా వదిలేస్తే ఉదయానికల్లా తాజాగా అవుతాయి.
* ఆకుపచ్చ బఠానీల రంగు మారకుండా చాలాకాలం నిలవ ఉండాలంటే మరిగే నీటిలో వేసి ఉడికించాలి. నీటిని వంచేసి చల్లటి నీటిలో తడిపి ఆరబెట్టాలి.
* కంటనీరు పెట్టకుండా ఉల్లిపాయలను కొయ్యాలంటే ముందు రెండు ముక్కలుగా కోసి నీళ్లలో వెయ్యాలి. కాసేపు ఫ్రిజ్‌లో పెట్టినా మంచిదే.
Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details
Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details
Samantha Photos telugu actress photos,Samantha Photos actress Pictures, Samantha Photos actress gallery, Samantha Photos actress stills,samantha stills See details
Tamanna Photo Gallery, tamanna stills, Tamanna Pictures, Tamanna sexy pics, Tamanna images, Tamanna wallpapers, Tamanna photos, Tamanna See details
Kajal Agarwal Telugu Actress Hot Pictures NewKajal Agarwal Telugu Actress Hot Pictures NewKajal Agarwal Telugu Actress Hot Pictures New See details
Telugu Actress Priyamani Photo Gallery, Priyamani photo gallery, Priyamani photos, Actress Priyamani Photo Gallery, Priyamani hot gallery, Priyamani wallpapers, actress Priyamani hot, Priyamani hot pictures, Priyamani hot See details
Telugu Actress Asin Photo Gallery, Asin photo gallery, Asin photos, Actress Asin Photo Gallery, Asin hot gallery, Asin wallpapers, actress Asin hot, Asin hot pictures, Asin hot images. See details
Nitya Menon Gallery telugu actress photos,Nitya Menon Gallery actress Pictures, Nitya Menon Gallery actress gallery, Nitya Menon Gallery actress stills See details
Telugu Actress Ileayana Photo Gallery, Ileayana photo gallery, Ileayana photos, Actress Ileayana Photo Gallery, Ileayana hot gallery, Ileayana wallpapers, actress Ileayana hot, Ileayana hot pictures, Ileayana hot See details
Tapsee photo gallery, Telugu Actress Tapsee Photo Gallery, Tapsee Picture Gallery, Tapsee Stills, Tapsee Hot Photo Gallary, Tapsee spicy photos, Tapsee hot, Tapsee sexy, Tapsee gallery See details
Actress Anushka hot gallery, Actress Anushka photos, Actress Anushka stills, Anushka hot Stills, Actress Anushka, anushka photos See details