Asia cup 2018 India vs Pakistan cricket match

 క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న భారత్‌-పాక్‌ మ్యాచ్‌ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఆసియాకప్‌లో భాగంగా భారత్‌ చిరకాల ప్రత్యర్థితో అమీతుమీ తేల్చుకోనుంది. గతేడాది జూన్‌లో ఛాంఫియన్స్‌‌ ట్రోపీలో భాగంగా ఈ రెండు జట్లు తలపడినప్పుడు పాక్‌నే విజయం వరించింది. అయితే, ఈసారి ఎలాగైనా దాయాది జట్టును ఓడించి ముందుకు వెళ్లాలనే కసితో టీమిండియా సన్నద్ధమవుతోంది. టోర్నీ ఏదయినా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఉందంటే యావత్‌ ప్రపంచం దృష్టంతా అటువైపే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఈ మ్యాచ్‌ జరగనున్న దుబాయ్‌ స్టేడియంలో టికెట్లన్నీ కొద్ది రోజుల ముందే అమ్ముడుపోయాయి. అంతేకాదు.. మ్యాచ్‌కున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు కూడా టికెట్ల…

Read More

Fight for the Finale Ticket in bigg boss house

కౌశ‌ల్‌, తనీష్ వ‌ల‌న టాస్క్ రద్ధు చేసిన బిగ్ బాస్ బిగ్ బాస్ సీజ‌న్2 తుది ద‌శ‌కి చేరుకున్న క్ర‌మంలో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌లు మ‌రింత క‌ఠినంగా ఉంటున్నాయి. వంద‌వ ఎపిసోడ్‌లో ఇంటి స‌భ్యులు అంద‌రు నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్నార‌ని బిగ్ బాస్ హెచ్చరించిన నేప‌థ్యంలో కంటెస్టెంట్‌ల మ‌ధ్య‌ పెద్ద వివాదం చెల‌రేగింది. ముఖ్యంగా కౌశ‌ల్‌ని టార్గెట్ చేస్తూ మిగ‌తా కంటెస్టెంట్స్ మూకుమ్మ‌డి దాడి చేశారు. 101వ ఎపిసోడ్‌లోను ఇదే కొన‌సాగింది. ‘మీ ఇసుక జాగ్రత్త’ అనే ఫిజికల్ టాస్క్ లో త‌నీష్‌, కౌశ‌ల్‌లు శారీర‌క హింస‌కి పాల్ప‌డిన‌ నేప‌థ్యంలో బిగ్ బాస్ వారిద్ద‌రికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ త‌ర్వాత లివింగ్ రూంలో కూర్చున్న…

Read More

Jubilee Hills MLA Candidate

-జూబ్లీహిల్స్ అభ్యర్థి కోసం కాంగ్రెస్, టీడీపీ వెతుకులాట -పొత్తులో ఇచ్చేస్తే మంచిదని ఎవరికి వారుగా ప్రయత్నాలు -ఓడిపోయే సీటులో ఎందుకు బలవ్వాలని గుసగుసలు – బంజారాహిల్స్ : అన్నా ఈసారి ఎన్నికల్లో మన పరిస్థితి ఏంటంటావ్.. ఓ కాంగ్రెస్ కార్యకర్తతో మరో కార్యకర్త ముచ్చట. అరే ఊరుకో భాయ్.. మన అన్న ఈసారి పక్క నియోజకవర్గం నుంచి నిలబడ్తా అంటూ గాంధీభవన్ చుట్టూ తిరుగుతున్నడు.. ఇక్కడికి ఎవరిని తీసుకొచ్చి రుద్దుతారో అనే టెన్షన్ ఉంది.. మరో కార్యకర్త ఆందోళన. అన్నా.. కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నారు కదా.. మరి మన పార్టీకి సీటు వస్తే ఎవర్ని నిలబెడ్తారంటావ్?.. ఓ టీడీపీ నాయకుడి ప్రశ్న. దేవుడి దయవల్ల ఈ…

Read More

అసెంబ్లీ రద్దుపై గవర్నర్‌ ఆమోదం.. ఈసీకి అందజేత

అసెంబ్లీ రద్దుపై గవర్నర్‌ ఆమోదం.. ఈసీకి అందజేత

తెలంగాణ అసెంబ్లీ రద్దు తీర్మానానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను ఈసీ, అసెంబ్లీ కార్యదర్శికి రాజ్‌భవన్‌ వర్గాలు పంపాయి. ఈ మేరకు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఆ వివరాలు.. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు గవర్నర్‌ను ఈ రోజు(06-09-2018) కలిసి తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా తీర్మానించిన ప్రతిని గవర్నర్‌కు సమర్పించారు. సీఎంతోపాటు ఆయన మంత్రివర్గం చేసిన సిఫారసును గవర్నర్ ఆమోదించారు. కేసీఆర్‌తోపాటు ఆయన మంత్రివర్గాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగించాల్సిందిగా గవర్నర్ కోరారు. గవర్నర్ వినతికి కేసీఆర్‌ అంగీకరించారు అని రాజ్‌భవన్ తన ప్రకటనలో వెల్లడించింది.

Read More

105 మంది అభ్యర్ధులను ప్రకటించిన కేసీఆర్‌

105 మంది అభ్యర్ధులను ప్రకటించిన కేసీఆర్‌

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను ప్రకటిస్తున్నామని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్‌ నిరాకరించామన్నారు. హుస్నాబాద్‌ బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుడతామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉందన్నారు. అనేక త్యాగాల, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధిని ప్రధాని, పలు రాష్ర్టాల సీఎంలు ప్రశంసించారన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులపై విపక్షాలు ప్రజల్ని తప్పుదారి పట్టించాయని విమర్శించారు. స్వల్పకాలంలోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందన్నారు….

Read More

తెలంగాణ అసెంబ్లీ రద్దు అప్‌డేట్స్‌

తెలంగాణ అసెంబ్లీ రద్దు అప్‌డేట్స్‌

హైదరాబాద్‌: ముందుస్తు ఎన్నికల దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా శాసనసభను రద్దు చేయాలని నిర్ణయించింది. గురువారం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకునున్నారు. అసెంబ్లీ రద్దుపై వ్యూహాలు అవలంభించాలన్న దానిపై ప్రతిపక్షాలు చర్చోపచర్చలు జరుపుతున్నాయి. బీజేపీ నేతలు గవర్నర్‌ను కలవాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి రాజీనామా చేశారు. . ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా లేరని కోదండరాం అన్నారు. తెలంగాణ శాసనసభ రద్దుకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు మీ కోసం.. మధ్యాహ్నం 3 గంటలు:ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ సంచలన నిర్ణయాన్ని వెలువరించారు. అసెంబ్లీ రద్దు చేసిన రోజే 105 మంది అసెంబ్లీ…

Read More

Telangana Panchayat Secretary 2018 recruitment begins Sep 3

జవాబు తప్పయితే పావు మార్కు కోత కొత్త జోన్లలో తొలి నోటిఫికేషన్‌.. 3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఎస్సీలకు 15 %, ఎస్టీలకు 6 % రిజర్వేషన్‌.. ప్రతి కోటాలో మూడోవంతు స్ర్తీలకే జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు జారీ హైదరాబాద్‌: జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి పంచాయతీరాజ్‌ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం 9,355 పోస్టులకు పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేస్తారు. కొత్త జోనల్‌ విధానం జీఓ 124 ప్రకారం ఇది జిల్లాస్థాయి పోస్టు. ప్రతి జిల్లాలోనూ 95 శాతం పోస్టులు స్థానికులకే. మిగిలినవి ఓపెన్‌ కోటాలో ఉంటాయి. ఈ పోస్టుల భర్తీకి గురువారమే నోటిఫికేషన్‌ జారీ…

Read More

Nandamuri HariKrishna Died in Road Accident at Anneparthy

Nandamuri HariKrishna Died in Road Accident at Anneparthy

నల్గొండ:ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెెందారు. నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు ఎపి28బిడబ్ల్యు 2323 కారులో మరో ఇద్దరితో కలసి బయలుదేరిన హరికృష్ణ ప్రమాద సమయంలో తానే స్వయంగా నడుపుతున్నట్లు తెలిసింది. తెల్లవారుఝామున 4.30కి బయలుదేరిన కారు నార్కెట్ పల్లి-అద్దంకి రహదారిపై నల్గొండ జిల్లా అన్నేపర్తికి చేరుకోగానే ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ప్రమాద సమయంలో కారు వేగంతో ప్రయాణిస్తోందని తెలిసింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ తలకు,ఛాతీ భాగానికి బలమైన గాయాలు అయినట్లు తెలిసింది. దీంతో శ్వాస తీసుకోవడానికి ఆయన ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో హరి కృష్ణ…

Read More

Bigg Boss Telugu 2 Live: Nani introduces the surprise of Bigg Boss 2

Bigg Boss Telugu 2 Live: Nani introduces the surprise of Bigg Boss 2

“Natural Star” Nani makes a grand pompous entry with his Middle Class Abbayi song (from MCA) intro. He performs to a medley of his songs (Bhale Bhale Magadivoy, Side Side Please). He is welcomed by the crowd in the house. Lauding Jr NTR’s hosting in Bigg Boss season 1, Nani commemorates the highlights of the season one. He pays respect to Jr NTR for blurring the divide between TV and cinema. He takes us on…

Read More

Bigboss2 Telugu Show Started

Bigboss2 Telugu Show Started

Bigg Boss Telugu Season 2 Contestants Names 2018. తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్‌ 2 ప్రారంభమైంది. మొదటి సీజన్‌ బంపర్‌ హిట్‌ కావటంతో బిగ్‌ బాస్‌ రియాల్టీ షో రెండో సీజన్‌పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. నాని వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌ విషయంలో ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆదివారం రాత్రి ప్రారంభం అయిన ఈ షోలో బిగ్‌బాస్‌ 2 సెట్‌ గురించి తొలుత నాని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్‌ను ఒక్కొక్కరిని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. వరుసగా ఇప్పటివరకు షోలో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్‌ వివరాలివి.. తొలి కంటెస్టెంట్‌గా టాలీవుడ్‌…

Read More
1 2 3 12