ఓటు హక్కు వినియోగించుకున్న హరీశ్‌రావు

తెలంగాణలోని 119 శాసనసభా నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వైపు అడుగులు వేశారు. మంత్రి హరీశ్‌రావు సిద్ధిపేటలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కుటుంబంతో కలిసి సొంత గ్రామం చింతమడకలో ఉదయం 11గంటల నుంచి 12గంటల మధ్యలో ఓటు వేస్తారని తెలిపారు.

Read More

దాల్చిన చెక్క యొక్క ఉపయోగాలు

దాల్చిన చెక్క యొక్క ఉపయోగాలు

దాల్చిన చెక్క : దాల్చిన చెక్కను వంటలలో మాత్రమె కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి. దాల్చిన చెక్క..మసాల దినుసుల్లో ఇదొక రకం. దీనిని ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు దాల్చిన చెక్క పొడి తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని పరిశోధనలు చెబుతున్నాయంట. మసాలా దినుసులు లేని వంటగదిని ఊహించుకోగలమా?. అందులోనూ దాల్చిన చెక్కను ఉపయోగించని వాళ్లుంటారా?. దక్షణి భారత దేశంలో దీనికి ఆదరణ మరీ ఎక్కువ. అలాంటి దాల్చిన చెక్కను వంటల్లో వాడటం నిషేధమని మీకు తెలుసా? దీన్ని కానుకగా ఇచ్చిపుచ్చుకునేవారని ఎప్పుడైనా విన్నారా? కేరళలో పండించే సుగంధ…

Read More

కంటి వెలుగు రికార్డుస్థాయిలో కోటిమంది కళ్లల్లో వెలుగు నింపింది.

హైదరాబాద్‌: ‘కంటి వెలుగు’కార్యక్రమం రికార్డు సృష్టించింది. రికార్డుస్థాయిలో కోటిమంది కళ్లల్లో వెలుగు నింపింది. ఒకవైపు ఎన్నికల ప్రచారం ఊపు మీదున్నా ‘కంటి వెలుగు’కార్యక్రమానికి ఏమాత్రం విఘాతం కలగలేదు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. ఆగస్టు 15న ప్రారంభమైన కంటి వెలుగు కింద బుధవారం నాటికి కోటి మందికి కంటి పరీక్షలు చేయడం దేశంలోనే ఒక రికార్డు అని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అభివర్ణిస్తున్నారు. ఈ మేరకు ఆ శాఖ బుధవారం ప్రభుత్వానికి నివేదిక పంపింది. దాని ప్రకారం… కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో 45.15 లక్షల మంది పురుషులు, 54.85 లక్షల మంది…

Read More

మళ్లీ కేసీఆరే సీఎం .. ప్రభుత్వంలో చేరబోం!

హైదరాబాద్‌: ‘‘టీఆర్‌ఎస్‌ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.. కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి అవుతారు… మేం మాత్రం ప్రభుత్వంలో చేరబోం’’అని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు. మజ్లిస్‌ పార్టీ 8 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ స్థానాలు మినహా మిగతా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ‘మీట్‌ ది ప్రెస్‌’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ సారథ్యంలోని కూటమి.. ప్రజాకూటమి కాదు, అది ఈస్టిండియా కంపెనీ– 2018’అని విమర్శించారు. పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు భవిష్యత్‌ తెలంగాణ రాజకీయాలను ఎలా నియంత్రించగలరని ప్రశ్నించారు. ఎన్నికల్లో కూటమికి ఓటమి ఖాయమని,…

Read More

ఇక ప్రచారంఆపండి: సీఈఓ

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార గడువు ముగిసిందని, బుధవారం సాయంత్రం నుంచి బహిరంగ సభలు నిర్వహించడం నిషిద్ధమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌ తెలిపారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4.30 గంటల నుంచి, మిగిలిన చోట్లలో సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటలు నిషేధం అమల్లో ఉంటుందన్నారు. ఈ నిషేధిత సమయంలో బహిరంగ సభల నిర్వహణ, ఎన్నికల ఊరేగింపులు తీయడం, సినిమాలు, టీవీలు లేదా ఇతర పరికరాల ద్వారా ఎన్నికల సందేశాలను ప్రసారం చేయటం, అలాగే ఎలక్ట్రానిక్‌ ప్రచార సాధనాల్లో ఒపీనియన్‌ సర్వేలు, ఇతరత్రా ఎన్నికల సంబంధిత కార్యక్రమాలను ప్రసారం చేయటం కూడా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని…

Read More

జూపూడి ఇంటి వద్ద డబ్బు సంచులు

ఎన్నికల వేళ ఏపీ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాక ర్‌రావు నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. బుధవారం రాత్రి 9:30 గంటలకు ఓ ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు కూకట్‌పల్లి బాలాజీనగర్‌లోని జూపూడి నివాసానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న టీఆర్‌ ఎస్‌ శ్రేణులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హుటాహుటిన జూపూడి నివాసానికి రావడంతో ఆ ముగ్గురు 3 బ్యాగులతో జూపూడి నివాసం వెనుక గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వెంబడించి ఒకరిని పట్టుకోగా, ఇద్దరు పారిపోయారు. దొరికిన వ్యక్తిని, అతడి వద్ద ఉన్న రూ.17.50 లక్షలను పోలీసులకు అప్పగించారు. అనంతరం అతడిని పోలీసులు…

Read More

టీడీపీ నేతలు డబ్బులు పంచుతూ పట్టుబడ్డారు

హైదరాబాద్ : నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో తెలుగు దేశం పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. డబ్బు ఆశ చూపి ఓటర్లను కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. బాలానగర్ విమల్ సినిమా హాల్ లో టీడీపీ నేతలు డబ్బులు పంచుతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. టీడీపీ నాయకుల నుంచి రూ. 7 లక్షలను ఫ్లయింగ్ స్కాడ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

Read More

7న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఈ నెల 7న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు 7న సెలవు ప్రకటిస్తున్నట్లు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే 7న సెలవు ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. శాసనసభ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది.

Read More

ఎక్కడ తిరిగినా రాత్రికి సిద్ధిపేట చేరుకోకుంటే నిద్రపట్టదు!

సిద్దిపేట నియోజకవర్గ ప్రజల ఆదరణ మరువలేనిదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్ధిపేటలో మంత్రి హరీశ్‌రావు రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల్లో గెలుపోటముల గురించి ఆలోచించడం లేదన్నారు. సిద్ధిపేట పేరు దేశం మొత్తం మార్మోగుతోంది. ఎక్కడ తిరిగినా రాత్రికి సిద్ధిపేట చేరుకోకుంటే నిద్రపట్టదని భావోద్వేగానికి లోనయ్యారు. ఆంధ్ర నాయకులు తెలంగాణలో కుట్రలు చేస్తున్నారు. నాలుగేండ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి మీ అందరికీ తెలుసు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మీ, కేసీఆర్‌కిట్, గురుకులాలు ఏర్పాటు చేశాం. సిద్ధిపేటలో కార్పొరేట్‌స్థాయి ఆస్పత్రిని నిర్మించుకున్నాం. సిద్ధిపేట మార్కెట్‌యార్డు, రైతు బజార్, ఔటర్ రింగురోడ్డు, కోమటిచెరువు చూస్తే అభివృద్ధి అంటే ఏంటో…

Read More

తప్పుడు సర్వేలను నమ్మొద్దు.. కేటీఆర్ ట్వీట్

కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు విడుదల చేస్తున్న తప్పుడు సర్వేలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. గోబెల్స్ కే పెద్దన్న లాంటి చంద్రబాబు ఇటు తన అనుకూల మీడియా సంస్థలతో పాటు అటు సోషల్ మీడియాలో ఇంకా చాలా దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. వాళ్లు చేసే తప్పుడు ప్రచారంతో గందరగోళపడవద్దు అని తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణను కాపాడుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.   గోబెల్స్ కే పెద్దన్న లాంటి చంద్రబాబు ఇటు తన అనుకూల మీడియా సంస్థలతో పాటు అటు సోషల్ మీడియాలో ఇంకా చాలా దుష్ప్రచారం చేసే అవకాశం…

Read More
1 2 3 4 15