కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్‌

కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత హయాంలో తెలంగాణలోని పది జిల్లాలను.. 31 జిల్లాలుగా పునర్విభజించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు జిల్లాలు ఏర్పాటుచేస్తే.. తెలంగాణలోని జిల్లాల సంఖ్య 33కు చేరుతుంది.ప్రగతి భవన్‌లో కేసీఆర్ ఆదివారం పంచాయతీరాజ్ అంశాలతోపాటు, ఎన్నికల హామీలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి,…

Read More

తెలంగాణలో కొత్తగా 6 మండలాలు

తెలంగాణలో కొత్తగా 6 మండలాలు

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా ఆరు మండలాలను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ప్రగతిభవన్‌లో పంచాయతీరాజ్ అంశాలతో పాటు, ఎన్నికల హామీలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్ రావు, రాజేశ్వర్ తివారి, రామకృష్ణారావు, వికాస్ రాజ్, స్మితా సభర్వాల్, నీతూ ప్రసాద్, రఘునందన్ రావు, పౌసమి బసు తదితరులు హాజరయ్యారు. కొత్తగా ఏర్పడిన మండలాలివే.. నల్గొండ జిల్లాలో గట్టుప్పల్‌, భూపాలపల్లి జిల్లాలో మల్లంపల్లి, బాన్సువాడలోని చందూరు, మోస్ర, మహబూబాద్‌లో…

Read More

మా ప్రేమ అలా మొదలైంది!

ఇంటర్నెట్‌డెస్క్‌: రాగం.. తానం.. పల్లవిలాంటి మూడు ముళ్లు వేసి.. సప్త స్వరాలతో ఏడడుగులు వేసి.. సంగీత ప్రయాణాన్ని సంసార ప్రయాణంగా.. సంసార ప్రయాణాన్ని సప్త స్వరాల సమ్మేళనంగా చేసుకుని సాగిపోతున్న జంట మల్లికార్జున్‌, గోపికా పూర్ణిమ. అలీ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న ఈటీవీలో ప్రసారమయ్యే ‘అలీతో సరదాగా’కు విచ్చేసిన వారు ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. పాటలు పాడుతున్నారు.. డ్యాన్స్‌ చేస్తున్నారు. స్టెప్‌లు ఇక్కడే వేస్తున్నారా? ఇంట్లో కూడా వేస్తారా?మల్లికార్జున్‌: ఇంట్లో వేయను. మనకు ఇక్కడే స్టెప్స్‌ వేసే ధైర్యం వస్తుంది. ఇంట్లో చిందులు వేసే సమయం ఇప్పటివరకూ రాలేదు. ఎందుకంటే ఆవిడ డ్యాన్స్‌ ఆడిస్తుంటుంది అదే వేరే విషయం(నవ్వులు) మల్లి.. ఇంట్లో మిమ్మల్ని ఏ పేరుతో పిలుస్తాడు?గోపిక…

Read More

కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది.

హైదరాబాద్‌ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గెలుపొందిన స్థానాల(63) కంటే కూడా ఎక్కువ స్థానాలు(ప్రస్తుతం 85) కైవసం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌ రావు తెలంగాణలో మరోసారి  ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కారు జోరుగా దూసుకుపోతోంది. ఇప్పటికే 85 స్థానాలను కైవసం చేసు​కున్న గులాబీ పార్టీ మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా టీడీపీతో జట్టుకట్టిన కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఎన్నడూలేని విధంగా పార్టీ సీనియర్‌ నేతలు ఓటమి పాలవడంతో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. సొంత నియోజకవర్గాల్లో ప్రచారానికే పరిమితమైనప్పటికీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఇద్దరు…

Read More

ఎంఐఎం గెలుపొందిన స్థానాలు..

మలక్‌పేట: అహ్మద్‌ బలాల, నాంపల్లి: జాఫర్‌ హుస్సేన్‌ మెరాజ్‌, చార్మినార్‌: ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, చాంద్రాయణగుట్ట: అక్బరుద్దీన్‌ ఓవైసీ, యాకుత్‌ పురా: అహ్మద్‌ పాషా ఖాద్రి, బహదుర్‌పుర : మహ్మద్‌ మౌజంఖాన్‌,  కార్వాన్‌: కౌసర్‌ మొహినుద్దీన్‌  స్థానాల్లో విజయం సాధించగా.. రాజేంద్రనగర్‌లో గట్టిపోటినిచ్చి ఓటమి పాలైంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలకంటి ప్రకాశ్‌గౌడ్‌ చేతిలో మీర్జా రహమత్‌ బైగ్‌ పరాజయం పాలయ్యారు.

Read More

‘ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌’ పేరుతో మహిళా బృందాలు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు

భరోసా, షీ–టీమ్స్‌ ఏర్పాటుతో ఇప్పటికే మహిళల భద్రతలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్న సిటీ పోలీసు విభాగం మరో అడుగు ముందుకు వేసింది. గస్తీలో మహిళా సిబ్బందికి ప్రాధాన్యం కల్పిస్తూ ‘ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌’(వావ్‌) పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. దేశంలోనే తొలిసారిగా కంబాట్‌ సిస్టమ్‌లో శిక్షణ తీసుకుని రంగంలోకి దిగుతున్న ఈ టీమ్స్‌ను నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సోమవారం ఇక్కడ గోషామహల్‌ పోలీసుస్టేడియంలో ఆవిష్కరించారు. తొలిదశలో డివిజన్‌కు ఒకటి చొప్పున కేటాయించారు. త్వరలో ప్రతిఠాణాకు ఒక బృందం ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ టీమ్స్‌ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ డెమో ఇచ్చాయి.  సుశిక్షితులైన ఈ 43 మందితో 20 వావ్‌…

Read More

తెలంగాణ తీర్పు నేడే కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: విజేతలెవరు? పరాజితులెవరు? రాబోయే ఐదేండ్లు రాష్ర్టాన్ని పాలించేదెవరు? ఈ నెల ఏడున ఓటరు మహాశయుడు ఈవీఎంలలో నిక్షిప్తంచేసిన తీర్పేంటి? అది సృష్టించబోయే సంచలనాలేంటి? తెలంగాణ ఆత్మగౌరవానికి, వలసాధిపత్య శక్తులకు మధ్య సాగిన ఓట్ల యుద్ధంలో గెలిచిందెవరు? మరికొద్ది గంటల్లో తేలిపోనుంది! గత మూడ్రోజులుగా తెలంగాణతోపాటు.. యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలు రానేవచ్చాయి! గడియారంలో ముల్లు ఉదయం ఎనిమిది గంటలను సూచించగానే రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు సంబంధించిన 43 కేంద్రాల్లో మొదలయ్యే ఓట్ల లెక్కింపు.. ఆ తదుపరి కొద్దిగంటలకే 1,821 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని సూచన ప్రాయంగానే అయినా.. స్పష్టంగా ప్రకటించనుంది! ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రక్రియను పూర్తిచేసిన ఎన్నికల…

Read More

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్‌

సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెలంగాణతో పాటు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు అధికారులు ప్రారంభించారు. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 8,500 మందికిపైగా అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో స్వతంత్రులతో కలిపి మొత్తం 1,821 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.81 కోట్ల మంది ఓటర్లలో 73.2 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అత్యధికంగా హైదరాబాద్‌ నగరంలో 13…

Read More

తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌: టీఆర్‌ఎస్‌కు స్వల్ప మొగ్గు

తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌: టీఆర్‌ఎస్‌కు స్వల్ప మొగ్గు

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్గిట్‌ పోల్‌ ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించబోతున్నదని ఎగ్జిట్స్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు 66 స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు 37 స్థానాలు, బీజేపీకి ఏడు స్థానాలు వస్తాయని టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసింది. ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించనుందని.. 79 నుంచి 91 స్థానాలు సాధించి.. కారు దూసుకుపోనుందని అంచనా వేసింది. ఈ సర్వేలో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు కేవలం 21 నుంచి 33 స్థానాలు, బీజేపీకి ఒకటి నుంచి మూడు స్థానాలు వస్తాయని పేర్కొంది….

Read More

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కే పట్టం.!

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కే పట్టం.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్గిట్‌ పోల్‌ ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించబోతున్నదని ఎగ్జిట్స్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు 66 స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు 37 స్థానాలు, బీజేపీకి ఏడు స్థానాలు వస్తాయని టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసింది.

Read More
1 2 3 4 5 17