వ్యాయామంతోనే వెన్నునొప్పి దూరం
నడుము నొప్పి... ఇప్పుడు సర్వసహజమైన సమస్యగా తయారైంది. పిల్లల నుంచి వృద్ధుల వరకూ.. ముఖ్యంగా ఎంతోమంది స్త్రీలు వెన్నునొప్పితో బాధపడుతున్నారు. 80% మంది ఎప్పుడో అప్పుడు దీని బారిన పడేవారే. కొన్ని జాగ్రత్తలతో దీనిని తప్పించుకోవటం గానీ.. తీవ్రతను తగ్గించుకోవటం గానీ చేయొచ్చు.

* నడుం నొప్పి బాగా వేధిస్తున్నప్పుడు రెండు, మూడు రోజులు విశ్రాంతిగా పడుకోవటం అవసరం. కూర్చున్నప్పుడు కూడా వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్‌ల మీద ఒత్తిడి పడి నొప్పి నుంచి పూర్తి ఉపశమనం ఉండదు. కాబట్టి పడుకొని విశ్రాంతి తీసుకోవటం అవసరం. అయితే మరీ ఎక్కువ రోజులు విశ్రాంతిగా పడుకుంటుంటే నడుం కండరాలు బలహీనపడే అవకాశమూ ఉంటుంది.
* నొప్పిగా ఉన్న నడుము భాగం మీద వేడినీటి కాపడం, ఐస్‌ బ్యాగ్‌ పెట్టడం, అవసరమైతే ఫిజియోథెరపిస్టుల వద్ద అల్ట్రాసౌండ్‌ చికిత్స వంటివి తీసుకుంటే నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.

మధుమేహుల్ని వేధించే ఇబ్బందుల చిట్టా చేంతాడంత పెద్దది. ఆ వరసలో నడుము నొప్పీ ఉంటుందని చాలామందికి తెలియదు. వీరిలో ఇది.. ప్రత్యేకించి కూర్చున్నప్పుడు తగ్గుతూ, నడిచేటప్పుడు విజృంభిస్తుంటుంది. నడవటం మొదలుపెట్టగానే.. నొప్పి తీవ్రత పెరుగుతుంది. నడక ఆపితే, ఒక్కసారిగా తగ్గి, క్రమేపీ మాయమవుతుంది. అదే దీని ప్రత్యేకత.

మధుమేహులు ఈ తరహా నడుము నొప్పి విషయంలో పొరపాటు పడుతూ, లంబార్‌ స్పాండిలోసిస్‌, సయాటికా నొప్పి వంటివాటిని అనుమానిస్తారు. చాలా రోజులపాటు అలాగే తోసేసుకు తిరిగి, ఎట్టకేలకు ఎముకల వైద్యుల్ని సంప్రదిస్తారు. ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ తదితర పరీక్షలన్నింటినీ వరసపెట్టి చేయించి, చివరికి క్యాల్షియం, నొప్పి నివారిణి మాత్రలు, వ్యాయామ సూచనలతో ఇంటిముఖం పడతారు. వీటన్నింటినీ పాటించినా సరైన ఉపశమనం కనిపించదు. ప్రతి నెలా డాక్టర్ల చుట్టూ తిరగటం, మందుల్ని మార్చటం, నొప్పితో బాధపడటం.. ఇదంతా కొనసాగుతూనే ఉంటుంది.
ఉద్యోగంలోని అసంతృప్తి అనారోగ్యాన్ని పెంచిపోషిస్తుందంటున్నాయి అధ్యయనాలు. వెన్నునొప్పికీ ఉద్యోగంలో ఎదుర్కునే అసంతృప్తులకు సంబంధం ఉందంటున్నాయి క్వీన్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయం పరిశోధనలు. తక్కువ ఒత్తిడిని ఎదుర్కుంటున్న తోటి ఉద్యోగస్తులతో పోల్చుకుంటే వృత్తి జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కుంటున్నవారిలో వెన్నునొప్పి తగ్గడానికి చాలాకాలం పడుతుందని ఈ పరిశోధనల్లో తేలింది.

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details