User Rating: / 5
PoorBest 

స్ప్రింగ్ సీజన్‌లో చర్మ సంరక్షణకు మాయిశ్చరైజర్లతోపాటుగా ఎమోలియంట్ బేస్డ్ సబ్బులు, లోషన్లు, క్రీములు ఉపయోగపడతాయి. ఠి గోరువెచ్చని నీటితో, తక్కువసేపు చేయండి. అధిక సమయం నీటిలో జలకాలాడడం మంచిది కాదు. దీనివల్ల చర్మంపై సహజసిద్ధంగా ఉండే నూనెలు నీటిలో కొట్టుకుపోయి చర్మం పొడిబారుతుంది. బాత్‌టబ్‌లో స్నానం చేసే అలవాటు ఉన్న వారు ఆ నీటిలో మాయిశ్చరైజర్లు కలుపుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ ఆ నీటిలో ఎక్కువ సేపు ఉండకూడదు. ఠి చల్లని గాలిలో తిరగడం మంచిది కాదు. దీనివల్ల చర్మంపై తెరుచుకుని ఉండే స్పోర్స్ మూసుకుపోతాయి.
ఠి చర్మాన్ని శుభ్రపరచుకున్న తరువాత ఎక్కువసార్లు టోనర్‌లను ఉపయోగించకండి. ఆల్కహాల్ స్థాయి తక్కువగా ఉన్న టోనర్‌లను మాత్రమే ఉపయోగించండి.
ఠి వారానికి ఒకసారి ఫేషియల్ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మానికి సహజసిద్ధంగా ఉండే పిహెచ్ బ్యాలెన్స్ మారకుండా ఉంటుంది. చర్మం చల్లగా, తాజాగా ఉండేందుకు మిస్టర్‌ను వాడండి.
ఠి చలి క్రమక్రమంగా తగ్గిపోతూ, వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతూ ఉన్నప్పుడు డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించుకోవాలి. ముఖ్యంగా పెదవులు ఎండిపోతూ ఉన్నప్పుడు.. లిప్‌స్టిక్ వేసుకునే ముందర పెదవులపై ఉన్న డెడ్ స్కిన్‌ను తొలగించడం మంచిది. అలాగే పెదవులు కొరుక్కోకూడదు. ఇక మాయిశ్చరైజింగ్ విషయానికొస్తే.. ఇది ఈ కాలంలో ఎంత తక్కువగా చేస్తే అంత మంచిది.
తేనె, అవకాడో, మస్టర్డ్‌లను సమంగా కలిపి ఆ మిశ్రమంతో వారానికి ఒకసారి ఫేషియల్ మాస్క్ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ తేనె, కోడిగుడ్డు తెల్ల సొన, మరో టేబుల్ స్పూన్ ఝ్చడౌnn్చజీట్ఛ లను కలిపి కూడా ఈ ఫేషియల్ మాస్క్ చేసుకోవచ్చు.
ఠి కళ్ల కింది భాగంలో ఐ-క్రీమ్ రాసి, మెల్లగా మర్దన చేయాలి.
ఠి పెదవులకు లిప్‌బామ్‌గాని, పెట్రోలియం జెల్లీగాని, విటమిన్-ఇ స్టిక్ ఉపయోగించవచ్చు.
ఠి రాత్రిళ్లు చలి ఎక్కువగా ఉంటే గనుక ఒళ్లంతా నైట్ క్రీమ్ రాసుకోండి.

hair styles,hair care tipsఆడపిల్లకు వాలుజెడ ఎంతో అందాన్నిస్తుందంటారు. చాలామంది చర్మానికి, ముఖానికి ఇచ్చే ప్రాముఖ్యతను జుట్టందానికి ఇవ్వరు. కొందరు తరచుగా షాంపూలను మారుస్తుంటారు. వూర్కెట్లో దొరికే హెయిర్‌ ఆయిల్స్‌ను వాడుతుంటారు. ఎలా చేసినా వారి జుట్టు చుండ్రుతోనో..మరేదో సమస్యతోనో ఊడిపోతుంటుంది. ఆడవారు ఎం త అందంగా ఉన్నా...జుట్టు అందంతో వారికి మరింత అందం పెరుగుతుంది. కొన్ని రకాల జాగ్రత్తలతో జుట్టును ఒత్తుగా నిగనిగలాడేలా చేసుకోవచ్చు.


  • బూడిద గుమ్మడికాయ తొక్క, గింజలు కొబ్బరినూనెలో మరిగించి ఆ మిశ్రమాన్ని తలవెంట్రుకలకు రాస్తుంటే అవి సహజసిద్ధమైన మెరుపుతో తన పూర్వాకృతిని పొందుతాయి. జుట్టు మెత్తగా మారి, వెంట్రుకలు పొడవుగా అవుతాయి.

  • 250 గ్రాముల మజ్జిగ, పది గ్రాముల బెల్లం కలిపి మిశ్రమంగా చేసుకుని తలకు పట్టించుకుని స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది.

Lipstick and Lipstick Advice and Tips అధర సౌందర్యం...
'కాస్మెటిక్స్‌ ఎన్ని వాడినా అధరాలకు అందం రావట్లేదు. నిర్జీవంగా కన్పిస్తున్నాయి' అనుకునే వారు ఈ కింది చిట్కాలపై ఓ కన్నేయండి.
* స్నేహితులు వేసుకున్న లిప్‌స్టిక్‌ రంగు బాగుందనో, మంచి బ్రాండ్‌ అని మీరు అలాంటి దానినే ఎంచుకుంటే అది మీ చర్మ తత్వానికి సరిపడక పోవచ్చు. తక్కువ నాణ్యత కలిగిన లిప్‌స్టిక్‌లు, పరిమళభరితమైన వివిధ రకాల లిప్‌గ్లాసులు వాడటం వల్ల ఎలర్జీకి దారి తీయడం, పెదాలు నల్లగా మారటం జరుగుతుంది. ఒక్కోసారి ఇది క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది.
* ఆకర్షణీయమైన రంగు గల టూత్‌పేస్ట్‌లు సైతం ఎలర్జీకి కారణమౌతాయి. సాధ్యమైనంత వరకు తెలుపు టూత్‌పేస్ట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.
* పెదాలపై చర్మం చాలా సున్నితంగా, మృదువుగా ఉంటుంది. కాబట్టి గాఢత ఎక్కువగా ఉన్న సబ్బులు నిత్యం వాడితే తేమ కోల్పోతాయి. ఇతరులు ఉపయోగించిన గ్లాసులు, కప్పులు తిరిగి వాడటం వల్ల ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది.

కోమలం.. కాంతిమంతం
పొడి చర్మం గలవారు ముఖం మీదే కాదు చేతుల మీదా దృష్టిపెట్టాలి. అందుకు ఈ చిట్కాలు పాటించి చూడండి.

* సబ్బు తాలూకు రసాయనాలు చేతుల మీద ప్రభావం చూపుతాయి. అందుకే వస్త్రాలు, గిన్నెలు శుభ్రపరిచిన వెంటనే చేతులకు మాయిశ్చరైజర్‌ రాయాలి.
* వేడి నీరు తైలగ్రంథులపై ప్రభావం చూపుతాయి. చల్లటి నీరు సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. అందుకే చలికాలంనూ చల్లని నీటికే ప్రాధాన్యం ఇవ్వాలి.
* తేమ ఉన్నప్పుడే మాయిశ్చరైజర్‌ చర్మంలోకి ఇంకిపోతుంది. అందుకే సాన్నం చేయగానే చేతులకు రాసుకోవాలి.
* నిద్రకు ఉపక్రమించే ముందు పెట్రోలియం జెల్లితో చేతులను మృదువుగా మర్దన చేసుకోవాలి. బయటకు వెళుతున్నప్పుడు తప్పనిసరిగా చేతులకు గ్లౌెజులు ధరించాలి. ఇవి ఎండనుంచి చేతులకు రక్షణనిస్తాయి.
* శరీరానికి సరిపడా మినరల్స్‌, విటమిన్స్‌ అందితే చర్మం మృదువుగా ఉంటుంది. విటమిన్‌ సి, ఈ లు చర్మం మీద మరింత ప్రభావం చూపుతాయి.
* తాజాపండ్లు, ఆకుకూరలు, పాల పదార్థాలు అధికంగా తీసుకోవాలి.
* నెలలో ఆరుసార్లు చేపలు తీసుకోవాలి. వీటిలోని ఎసెన్షియల్‌ ఫ్యాటీ ఆమ్లాలు చర్మ సౌందర్యానికి ఉపకరిస్తాయి. అ ఫ్యాటీ ఆమ్లాలు గుండెకూ మేలు చేస్తాయి.

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details