Balakrishna movie legend successful meet one killed in accident

Balakrishna movie legend successful meet one killed in accident

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ పాల్గొంటున్న లెజెండ్ చిత్రం విజయోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కడప జిల్లాలో ప్రొద్దుటూరులో ఆదివారం పోలీసు ఎస్కార్ట్ వాహనం అభిమానులను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా ప్రొద్దుటూరులో విజయవంతంగా ఆడుతోంది. ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమానికి బాలకృష్ణ వస్తారని ప్రచారం జరగడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బందోబస్తు కోసం వచ్చిన పోలీసుల వాహనం అభిమానులను ఢీకొంది.

Read More