కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది.

హైదరాబాద్‌ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గెలుపొందిన స్థానాల(63) కంటే కూడా ఎక్కువ స్థానాలు(ప్రస్తుతం 85) కైవసం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌ రావు తెలంగాణలో మరోసారి  ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కారు జోరుగా దూసుకుపోతోంది. ఇప్పటికే 85 స్థానాలను కైవసం చేసు​కున్న గులాబీ పార్టీ మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా టీడీపీతో జట్టుకట్టిన కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఎన్నడూలేని విధంగా పార్టీ సీనియర్‌ నేతలు ఓటమి పాలవడంతో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. సొంత నియోజకవర్గాల్లో ప్రచారానికే పరిమితమైనప్పటికీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఇద్దరు…

Read More

ఎంఐఎం గెలుపొందిన స్థానాలు..

మలక్‌పేట: అహ్మద్‌ బలాల, నాంపల్లి: జాఫర్‌ హుస్సేన్‌ మెరాజ్‌, చార్మినార్‌: ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, చాంద్రాయణగుట్ట: అక్బరుద్దీన్‌ ఓవైసీ, యాకుత్‌ పురా: అహ్మద్‌ పాషా ఖాద్రి, బహదుర్‌పుర : మహ్మద్‌ మౌజంఖాన్‌,  కార్వాన్‌: కౌసర్‌ మొహినుద్దీన్‌  స్థానాల్లో విజయం సాధించగా.. రాజేంద్రనగర్‌లో గట్టిపోటినిచ్చి ఓటమి పాలైంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలకంటి ప్రకాశ్‌గౌడ్‌ చేతిలో మీర్జా రహమత్‌ బైగ్‌ పరాజయం పాలయ్యారు.

Read More

‘ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌’ పేరుతో మహిళా బృందాలు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు

భరోసా, షీ–టీమ్స్‌ ఏర్పాటుతో ఇప్పటికే మహిళల భద్రతలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్న సిటీ పోలీసు విభాగం మరో అడుగు ముందుకు వేసింది. గస్తీలో మహిళా సిబ్బందికి ప్రాధాన్యం కల్పిస్తూ ‘ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌’(వావ్‌) పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. దేశంలోనే తొలిసారిగా కంబాట్‌ సిస్టమ్‌లో శిక్షణ తీసుకుని రంగంలోకి దిగుతున్న ఈ టీమ్స్‌ను నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సోమవారం ఇక్కడ గోషామహల్‌ పోలీసుస్టేడియంలో ఆవిష్కరించారు. తొలిదశలో డివిజన్‌కు ఒకటి చొప్పున కేటాయించారు. త్వరలో ప్రతిఠాణాకు ఒక బృందం ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ టీమ్స్‌ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ డెమో ఇచ్చాయి.  సుశిక్షితులైన ఈ 43 మందితో 20 వావ్‌…

Read More

తెలంగాణ తీర్పు నేడే కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: విజేతలెవరు? పరాజితులెవరు? రాబోయే ఐదేండ్లు రాష్ర్టాన్ని పాలించేదెవరు? ఈ నెల ఏడున ఓటరు మహాశయుడు ఈవీఎంలలో నిక్షిప్తంచేసిన తీర్పేంటి? అది సృష్టించబోయే సంచలనాలేంటి? తెలంగాణ ఆత్మగౌరవానికి, వలసాధిపత్య శక్తులకు మధ్య సాగిన ఓట్ల యుద్ధంలో గెలిచిందెవరు? మరికొద్ది గంటల్లో తేలిపోనుంది! గత మూడ్రోజులుగా తెలంగాణతోపాటు.. యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలు రానేవచ్చాయి! గడియారంలో ముల్లు ఉదయం ఎనిమిది గంటలను సూచించగానే రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు సంబంధించిన 43 కేంద్రాల్లో మొదలయ్యే ఓట్ల లెక్కింపు.. ఆ తదుపరి కొద్దిగంటలకే 1,821 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని సూచన ప్రాయంగానే అయినా.. స్పష్టంగా ప్రకటించనుంది! ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రక్రియను పూర్తిచేసిన ఎన్నికల…

Read More

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్‌

సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెలంగాణతో పాటు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు అధికారులు ప్రారంభించారు. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 8,500 మందికిపైగా అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో స్వతంత్రులతో కలిపి మొత్తం 1,821 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.81 కోట్ల మంది ఓటర్లలో 73.2 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అత్యధికంగా హైదరాబాద్‌ నగరంలో 13…

Read More

తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌: టీఆర్‌ఎస్‌కు స్వల్ప మొగ్గు

తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌: టీఆర్‌ఎస్‌కు స్వల్ప మొగ్గు

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్గిట్‌ పోల్‌ ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించబోతున్నదని ఎగ్జిట్స్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు 66 స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు 37 స్థానాలు, బీజేపీకి ఏడు స్థానాలు వస్తాయని టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసింది. ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించనుందని.. 79 నుంచి 91 స్థానాలు సాధించి.. కారు దూసుకుపోనుందని అంచనా వేసింది. ఈ సర్వేలో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు కేవలం 21 నుంచి 33 స్థానాలు, బీజేపీకి ఒకటి నుంచి మూడు స్థానాలు వస్తాయని పేర్కొంది….

Read More

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కే పట్టం.!

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కే పట్టం.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్గిట్‌ పోల్‌ ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించబోతున్నదని ఎగ్జిట్స్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు 66 స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు 37 స్థానాలు, బీజేపీకి ఏడు స్థానాలు వస్తాయని టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసింది.

Read More

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 11న తెలంగాణతో సహా ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగితా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. ఐదు గంటల లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకుని క్యూలైన్లో నిలుచున్న వారికి ఓటు వేసే అవకాశం క‌ల్పించారు. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా 69శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో సాయంత్రం 4 గంటల వరకు 67 శాతం న‌మోదైన‌ట్లు సమాచారం.

Read More

బస్సులు, రైళ్లు, ట్రామ్స్.. అన్నీ ఫ్రీ

బస్సులు, రైళ్లు, ట్రామ్స్.. అన్నీ ఫ్రీ

లగ్జెమ్‌బర్గ్ సిటీ: బస్సెక్కినా, రైలెక్కినా, మెట్రో రైలెక్కినా.. మన దగ్గర టికెట్ తీసుకోవాల్సిందే. కానీ ఆ దేశంలో మాత్రం ఇక నుంచి అన్నీ ఫ్రీ. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించి.. ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించే ఉద్దేశంతో లగ్జెంబర్గ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆ దేశంలో అన్ని రకాల రవాణా ఉచితమే. ప్రపంచంలో ఈ నిర్ణయం తీసుకున్న తొలి దేశం లగ్జెంబర్గే కావడం విశేషం. త్వరలోనే అధికారం చేపట్టనున్న అక్కడి సంకీర్ణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే వేసవి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఇప్పుడు కూడా లగ్జెంబర్గ్‌లో రవాణా చార్జీలు చాలా తక్కువే. రెండు గంటల ప్రయాణానికి రెండు డాలర్లు…

Read More

Telangana Elections Update

Prime Minister Narendra Modi urged people to come out and vote in large numbers as voting for 119 constituencies in India’s youngest state, Telangana, started at 7 am.8:50 AM, 07 DECDeputy CM Kadiyan Srihari Casts his Vote 8:36 AM, 07 DECBJP Telangana President G Kishan Reddy casts his vote at polling booth no.7 in Kachiguda, Hyderabad.8:19 AM, 07 DECActor Allu Arjun stands in a queue to cast his vote at booth number 152 in Jubilee…

Read More
1 2 3 5