నాగార్జునసాగర్‌ను సందర్శించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

నాగార్జునసాగర్‌ను సందర్శించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ దంపతులు ఆదివారం నాగార్జునసాగర్‌ను సందర్శించారు. టూరిజంశాఖ ఏర్పాటు చేసిన లాంచీలో నాగార్జునకొండకు వెళ్లిన వారు.. ఆర్కియాలజీ మ్యూజియంలో పొందుపరిచిన బుద్ధుడి శిల్పాలు, అలనాటి కట్టడాలను తిలకించారు. హిల్‌కాలనీలోని బుద్ధవనాన్ని, నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం, జల విద్యుత్‌కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుద్ధవనం ఏర్పాటుతో నాగార్జునసాగర్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. ఆయన వెంట నల్లగొండ జిల్లా న్యాయమూర్తులు జస్టిస్ తిరుమలరావు, జస్టిస్ హరినాథ్‌శర్మ, ఆర్డీవో జగన్నాథరావు, డీఎస్పీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 

Read More

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్న కేటీఆర్

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్న కేటీఆర్

హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఉదయం 11.56 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాట్లను టీఆర్‌ఎస్ నేతలు తలసాని, దానం నాగేందర్, ఇతర నాయకులు పరిశీలించారు. ఉదయం 10.15 గంటలకు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి తెలంగాణ భవన్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు కేటీఆర్ పూలమాల వేసి ప్రసంగిస్తారన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తన ఈ ర్యాలీకి తరలిరానున్నట్టు తలసాని తెలిపారు.

Read More

ఏప్రిల్‌ నుంచి కొత్త పింఛన్లు

ఏప్రిల్‌ నుంచి కొత్త పింఛన్లు

హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించి ఫుల్‌ జోష్‌లో ఉన్న సీఎం కేసీఆర్‌ ఆ వెంటనే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి 57 ఏళ్ల వయస్సు నిండిన పేదలకు వృద్ధాప్య పింఛన్ల పం పిణీ ప్రారంభించాలని ఆదేశించారు. ఎన్నికల హామీ మేరకు ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు సూచిం చారు. ప్రగతిభవన్‌లో ఆదివారం ఆయన పంచా యతీరాజ్‌ అంశాలతో పాటు ఎన్నికల హామీలపై సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసు కున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, అందుకే పల్లెలపై ఎక్కువ దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామ…

Read More

కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్‌

కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత హయాంలో తెలంగాణలోని పది జిల్లాలను.. 31 జిల్లాలుగా పునర్విభజించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు జిల్లాలు ఏర్పాటుచేస్తే.. తెలంగాణలోని జిల్లాల సంఖ్య 33కు చేరుతుంది.ప్రగతి భవన్‌లో కేసీఆర్ ఆదివారం పంచాయతీరాజ్ అంశాలతోపాటు, ఎన్నికల హామీలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి,…

Read More

తెలంగాణలో కొత్తగా 6 మండలాలు

తెలంగాణలో కొత్తగా 6 మండలాలు

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా ఆరు మండలాలను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ప్రగతిభవన్‌లో పంచాయతీరాజ్ అంశాలతో పాటు, ఎన్నికల హామీలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్ రావు, రాజేశ్వర్ తివారి, రామకృష్ణారావు, వికాస్ రాజ్, స్మితా సభర్వాల్, నీతూ ప్రసాద్, రఘునందన్ రావు, పౌసమి బసు తదితరులు హాజరయ్యారు. కొత్తగా ఏర్పడిన మండలాలివే.. నల్గొండ జిల్లాలో గట్టుప్పల్‌, భూపాలపల్లి జిల్లాలో మల్లంపల్లి, బాన్సువాడలోని చందూరు, మోస్ర, మహబూబాద్‌లో…

Read More

కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది.

హైదరాబాద్‌ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గెలుపొందిన స్థానాల(63) కంటే కూడా ఎక్కువ స్థానాలు(ప్రస్తుతం 85) కైవసం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌ రావు తెలంగాణలో మరోసారి  ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కారు జోరుగా దూసుకుపోతోంది. ఇప్పటికే 85 స్థానాలను కైవసం చేసు​కున్న గులాబీ పార్టీ మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా టీడీపీతో జట్టుకట్టిన కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఎన్నడూలేని విధంగా పార్టీ సీనియర్‌ నేతలు ఓటమి పాలవడంతో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. సొంత నియోజకవర్గాల్లో ప్రచారానికే పరిమితమైనప్పటికీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఇద్దరు…

Read More

ఎంఐఎం గెలుపొందిన స్థానాలు..

మలక్‌పేట: అహ్మద్‌ బలాల, నాంపల్లి: జాఫర్‌ హుస్సేన్‌ మెరాజ్‌, చార్మినార్‌: ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, చాంద్రాయణగుట్ట: అక్బరుద్దీన్‌ ఓవైసీ, యాకుత్‌ పురా: అహ్మద్‌ పాషా ఖాద్రి, బహదుర్‌పుర : మహ్మద్‌ మౌజంఖాన్‌,  కార్వాన్‌: కౌసర్‌ మొహినుద్దీన్‌  స్థానాల్లో విజయం సాధించగా.. రాజేంద్రనగర్‌లో గట్టిపోటినిచ్చి ఓటమి పాలైంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలకంటి ప్రకాశ్‌గౌడ్‌ చేతిలో మీర్జా రహమత్‌ బైగ్‌ పరాజయం పాలయ్యారు.

Read More

‘ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌’ పేరుతో మహిళా బృందాలు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు

భరోసా, షీ–టీమ్స్‌ ఏర్పాటుతో ఇప్పటికే మహిళల భద్రతలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్న సిటీ పోలీసు విభాగం మరో అడుగు ముందుకు వేసింది. గస్తీలో మహిళా సిబ్బందికి ప్రాధాన్యం కల్పిస్తూ ‘ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌’(వావ్‌) పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. దేశంలోనే తొలిసారిగా కంబాట్‌ సిస్టమ్‌లో శిక్షణ తీసుకుని రంగంలోకి దిగుతున్న ఈ టీమ్స్‌ను నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సోమవారం ఇక్కడ గోషామహల్‌ పోలీసుస్టేడియంలో ఆవిష్కరించారు. తొలిదశలో డివిజన్‌కు ఒకటి చొప్పున కేటాయించారు. త్వరలో ప్రతిఠాణాకు ఒక బృందం ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ టీమ్స్‌ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ డెమో ఇచ్చాయి.  సుశిక్షితులైన ఈ 43 మందితో 20 వావ్‌…

Read More

తెలంగాణ తీర్పు నేడే కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: విజేతలెవరు? పరాజితులెవరు? రాబోయే ఐదేండ్లు రాష్ర్టాన్ని పాలించేదెవరు? ఈ నెల ఏడున ఓటరు మహాశయుడు ఈవీఎంలలో నిక్షిప్తంచేసిన తీర్పేంటి? అది సృష్టించబోయే సంచలనాలేంటి? తెలంగాణ ఆత్మగౌరవానికి, వలసాధిపత్య శక్తులకు మధ్య సాగిన ఓట్ల యుద్ధంలో గెలిచిందెవరు? మరికొద్ది గంటల్లో తేలిపోనుంది! గత మూడ్రోజులుగా తెలంగాణతోపాటు.. యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలు రానేవచ్చాయి! గడియారంలో ముల్లు ఉదయం ఎనిమిది గంటలను సూచించగానే రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు సంబంధించిన 43 కేంద్రాల్లో మొదలయ్యే ఓట్ల లెక్కింపు.. ఆ తదుపరి కొద్దిగంటలకే 1,821 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని సూచన ప్రాయంగానే అయినా.. స్పష్టంగా ప్రకటించనుంది! ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రక్రియను పూర్తిచేసిన ఎన్నికల…

Read More

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్‌

సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెలంగాణతో పాటు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు అధికారులు ప్రారంభించారు. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 8,500 మందికిపైగా అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో స్వతంత్రులతో కలిపి మొత్తం 1,821 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.81 కోట్ల మంది ఓటర్లలో 73.2 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అత్యధికంగా హైదరాబాద్‌ నగరంలో 13…