తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్‌

సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెలంగాణతో పాటు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు అధికారులు ప్రారంభించారు. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 8,500 మందికిపైగా అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో స్వతంత్రులతో కలిపి మొత్తం 1,821 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.81 కోట్ల మంది ఓటర్లలో 73.2 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అత్యధికంగా హైదరాబాద్‌ నగరంలో 13…

Read More

తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌: టీఆర్‌ఎస్‌కు స్వల్ప మొగ్గు

తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌: టీఆర్‌ఎస్‌కు స్వల్ప మొగ్గు

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్గిట్‌ పోల్‌ ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించబోతున్నదని ఎగ్జిట్స్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు 66 స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు 37 స్థానాలు, బీజేపీకి ఏడు స్థానాలు వస్తాయని టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసింది. ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించనుందని.. 79 నుంచి 91 స్థానాలు సాధించి.. కారు దూసుకుపోనుందని అంచనా వేసింది. ఈ సర్వేలో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు కేవలం 21 నుంచి 33 స్థానాలు, బీజేపీకి ఒకటి నుంచి మూడు స్థానాలు వస్తాయని పేర్కొంది….

Read More

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కే పట్టం.!

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కే పట్టం.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్గిట్‌ పోల్‌ ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించబోతున్నదని ఎగ్జిట్స్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు 66 స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు 37 స్థానాలు, బీజేపీకి ఏడు స్థానాలు వస్తాయని టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసింది.

Read More

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 11న తెలంగాణతో సహా ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగితా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. ఐదు గంటల లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకుని క్యూలైన్లో నిలుచున్న వారికి ఓటు వేసే అవకాశం క‌ల్పించారు. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా 69శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో సాయంత్రం 4 గంటల వరకు 67 శాతం న‌మోదైన‌ట్లు సమాచారం.

Read More

బస్సులు, రైళ్లు, ట్రామ్స్.. అన్నీ ఫ్రీ

బస్సులు, రైళ్లు, ట్రామ్స్.. అన్నీ ఫ్రీ

లగ్జెమ్‌బర్గ్ సిటీ: బస్సెక్కినా, రైలెక్కినా, మెట్రో రైలెక్కినా.. మన దగ్గర టికెట్ తీసుకోవాల్సిందే. కానీ ఆ దేశంలో మాత్రం ఇక నుంచి అన్నీ ఫ్రీ. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించి.. ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించే ఉద్దేశంతో లగ్జెంబర్గ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆ దేశంలో అన్ని రకాల రవాణా ఉచితమే. ప్రపంచంలో ఈ నిర్ణయం తీసుకున్న తొలి దేశం లగ్జెంబర్గే కావడం విశేషం. త్వరలోనే అధికారం చేపట్టనున్న అక్కడి సంకీర్ణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే వేసవి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఇప్పుడు కూడా లగ్జెంబర్గ్‌లో రవాణా చార్జీలు చాలా తక్కువే. రెండు గంటల ప్రయాణానికి రెండు డాలర్లు…

Read More

Telangana Elections Update

Prime Minister Narendra Modi urged people to come out and vote in large numbers as voting for 119 constituencies in India’s youngest state, Telangana, started at 7 am.8:50 AM, 07 DECDeputy CM Kadiyan Srihari Casts his Vote 8:36 AM, 07 DECBJP Telangana President G Kishan Reddy casts his vote at polling booth no.7 in Kachiguda, Hyderabad.8:19 AM, 07 DECActor Allu Arjun stands in a queue to cast his vote at booth number 152 in Jubilee…

Read More

ఓటు హక్కు వినియోగించుకున్న హరీశ్‌రావు

తెలంగాణలోని 119 శాసనసభా నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వైపు అడుగులు వేశారు. మంత్రి హరీశ్‌రావు సిద్ధిపేటలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కుటుంబంతో కలిసి సొంత గ్రామం చింతమడకలో ఉదయం 11గంటల నుంచి 12గంటల మధ్యలో ఓటు వేస్తారని తెలిపారు.

Read More

కంటి వెలుగు రికార్డుస్థాయిలో కోటిమంది కళ్లల్లో వెలుగు నింపింది.

హైదరాబాద్‌: ‘కంటి వెలుగు’కార్యక్రమం రికార్డు సృష్టించింది. రికార్డుస్థాయిలో కోటిమంది కళ్లల్లో వెలుగు నింపింది. ఒకవైపు ఎన్నికల ప్రచారం ఊపు మీదున్నా ‘కంటి వెలుగు’కార్యక్రమానికి ఏమాత్రం విఘాతం కలగలేదు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. ఆగస్టు 15న ప్రారంభమైన కంటి వెలుగు కింద బుధవారం నాటికి కోటి మందికి కంటి పరీక్షలు చేయడం దేశంలోనే ఒక రికార్డు అని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అభివర్ణిస్తున్నారు. ఈ మేరకు ఆ శాఖ బుధవారం ప్రభుత్వానికి నివేదిక పంపింది. దాని ప్రకారం… కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో 45.15 లక్షల మంది పురుషులు, 54.85 లక్షల మంది…

Read More

మళ్లీ కేసీఆరే సీఎం .. ప్రభుత్వంలో చేరబోం!

హైదరాబాద్‌: ‘‘టీఆర్‌ఎస్‌ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.. కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి అవుతారు… మేం మాత్రం ప్రభుత్వంలో చేరబోం’’అని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు. మజ్లిస్‌ పార్టీ 8 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ స్థానాలు మినహా మిగతా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ‘మీట్‌ ది ప్రెస్‌’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ సారథ్యంలోని కూటమి.. ప్రజాకూటమి కాదు, అది ఈస్టిండియా కంపెనీ– 2018’అని విమర్శించారు. పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు భవిష్యత్‌ తెలంగాణ రాజకీయాలను ఎలా నియంత్రించగలరని ప్రశ్నించారు. ఎన్నికల్లో కూటమికి ఓటమి ఖాయమని,…

Read More

ఇక ప్రచారంఆపండి: సీఈఓ

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార గడువు ముగిసిందని, బుధవారం సాయంత్రం నుంచి బహిరంగ సభలు నిర్వహించడం నిషిద్ధమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌ తెలిపారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4.30 గంటల నుంచి, మిగిలిన చోట్లలో సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటలు నిషేధం అమల్లో ఉంటుందన్నారు. ఈ నిషేధిత సమయంలో బహిరంగ సభల నిర్వహణ, ఎన్నికల ఊరేగింపులు తీయడం, సినిమాలు, టీవీలు లేదా ఇతర పరికరాల ద్వారా ఎన్నికల సందేశాలను ప్రసారం చేయటం, అలాగే ఎలక్ట్రానిక్‌ ప్రచార సాధనాల్లో ఒపీనియన్‌ సర్వేలు, ఇతరత్రా ఎన్నికల సంబంధిత కార్యక్రమాలను ప్రసారం చేయటం కూడా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని…

Read More
1 2 3 4 5 7