Telugu

భోగి పండ్లను పిల్లల నెత్తిన ఎందుకు పోస్తారు?

Telugu
తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజును 'భోగి'గా పిలుస్తారు. రెండో రోజును 'మకర సంక్రాంతి'గా, మూడో రోజును 'కనుమ'గా పిలుస్తారు. నాలుగో రోజును 'ముక్కనుమ' అంటారు. సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయడం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. భోగి రోజు చేసే బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్లు పోస్తారు. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు

సంక్రాంతి రోజున స్నానం చేయకుండా వుండకండి..

Telugu
పుష్యమాసం, శుక్లపక్షంలో వచ్చే సంక్రాంతి నాడు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. సూర్యుడు ధనుర్ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజు సంక్రాంతి. ఈ రోజును అత్యంత శుభదినంగా భావిస్తాం. శాస్త్రాల్లో సంక్రాంతి రోజున పుణ్యతీర్థాల్లో స్నానమాచరించడం ద్వారా పుణ్య ఫలితాలను పొందవచ్చు. సంక్రాంతి రోజున గంగ, గోదావరి, కృష్ణ, కావేరీ నదుల్లో స్నానమాచరించే వారికి బ్రహ్మలోక ప్రాప్తి చేకూరుతుంది. నదీస్నానం చేయలేని వారు ఇంట్లోనే శుచిగా స్నానమాచరించవచ్చు. వీలైనంతవరకు మకర సంక్రాంతి నాడు చల్లని నీటితోనే స్నానం చేయాలి. సంక్రాంతి రోజున స్నానం చేయని వారు నిరుపేదలుగా, అనారోగ్యాలతో బాధపడతారని శాస్త్రాలు చెప్తున్నాయి. మకర సంక్రాంతి నాడు ఎవరైతే తీర్థస్నానం చేసి.. పిండ ప్రదానం చేసి బ్రాహ్మణులకు దానం ఇస్తే.. స్వర్గ వాసులు దానిని స్వీకరించి ఆశీర్వదిస్తారు. భోగి, సంక్రాంతి రోజున ఇంట్లోని స్వామి వారి ప్రతిమలకు పవిత్ర

makara ankranthi 2018

Telugu
ఈ తేదీల్లోనే.. సంక్రాంతి ఎందుకు? సంక్రాంతి పండుగ పిల్లలకు ఇష్టమైన పండుగ... భారతదేశమంతా జరిగే వేడుక... రివ్వున ఎగిరే గాలిపటాలు... కమ్మకమ్మని పిండి వంటలు... అందమైన ముగ్గులు... డూడూ బసవన్నలు... అన్నీ కలిస్తే... అదే సంక్రాంతి పండుగ. ఇదంటే శాన్వికి ఎంతో ఇష్టమట. అయితే సంక్రాంతి ఎందుకు చేస్తారు? ఇది మాత్రం ఒకే తేదీన ఎందుకు వస్తుందంటూ బోలెడు సందేహాలున్నాయట. అవన్నీ వాళ్లమ్మని అడుగుతానంటూ పరుగులు తీసింది. మరి వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటో? మనమూ తెలుసుకుందామా! శాన్వి : అమ్మా! నాకు అన్ని పండుగ సెలవులకన్నా సంక్రాంతి సెలవులంటే చాలా ఇష్టం... అమ్మ: ఎందుకు? శాన్వి : చక్కగా ఇంటి నిండా ముగ్గులు పెట్టేస్తావూ... మాకు నచ్చిన కమ్మని వంటలన్నీ వండేస్తావూ. ఇంకా తాతయ్య దగ్గరుండి గాలిపటం చేసిచ్చి పొద్దున్నుంచి మాతోపాటే సరదాగా గడుపుతారు. బసవన్నల్ని చక్కగా అలంకరించి తీసుకొస్తారు. పట్టణాల్లో చదువుకుంటున్న

నువ్వు జ్ఞాపకం కాదు… నువ్వే నా జీవితం

Love Stories, Telugu
నా ఫ్రెండ్స్‌లో ఓ అమ్మాయి ఒకరోజు తన ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ లో పెట్టిన పిక్చర్‌ నాలో అలజడి సృష్టించింది. ఆ ఫోటోలో ముగ్గురు అమ్మాయిలున్నారు. అందులో వున్నా ఒక అమ్మాయి కళ్లలో ఏదో మాయ. నన్ను చూపు తిప్పుకోనివ్వ లేదు. ఎన్ని సార్లు ఆ ఫొటో చూశానో... ఎన్ని సార్లు షేర్‌ చేశానో నాకే తెలియదు. ఇంతలో నా ఫ్రెండ్‌ ఫోన్‌ చేసింది. ఏరా అన్ని సార్లు షేర్‌ చేస్తున్నావ్‌.. ఏంటి సంగతి అంది? తన గురించి అడిగాను. తనూ నా డిప్లొమో ఫ్రెండ్‌ అని చెప్పింది. ఫోన్‌ నంబరు అడగాలనుకున్నాను. రాత్రి నిద్ర పట్టలేదు. ఫోన్‌ చేసి తన నంబర్‌ తీసుకోవాలనిపిస్తోంది. మెసేజ్‌ చేశాను. తన రూపం కనురెప్పలకు అడ్డం పడుతోంది. అవి మూతపడటం లేదు. తెల్లారి ఫోన్‌ చూసుకుంటే తన నంబర్‌ మెసేజ్‌ వచ్చింది. నా ఫ్రెండ్‌కి ఫోన్‌ చేశాను. ‘ఒరే... నువ్వు మంచివాడివని... ఇంతకుముందెప్పుడు ఏ అమ్మాయి గురించి అడగలేదని...నీకు ఈ నంబర్‌ పంపాను. మిస్‌ బిహేవ్‌ చేయకు...