User Rating: / 0
PoorBest 
బిడ్డల్ని కనబోయే తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని అందరికీ తెలుసు. దానికి పోషకాహారం అవసరమని తెలుసు. దానికి పోషకాహారం అవసరమనీ తెలుసు. కాబోయే తల్లి చేత ఐరన్‌ మాత్రలు మింగించేది అందుకే. పెద్దయ్యాక రాబోయే స్థూలకాయం, డయాబెటీస్‌ ( టైప్‌ -2 రకం ) వంటి జబ్బులకు కూడా తల్లి పొట్టలో ఉన్నప్పుడు అందని పోషకాహారమే కారణమని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి.

మన భారతీయుల్లో ఈ రెండూ చాలా ఎక్కువ. నలభైలు దాటీ దాటక ముందే అనేక మంది దీని బారిన పడుతున్నారు. ఇప్పుడిప్పుడే ఇంకా చిన్న వయసులో ఉన్న వారికి చక్కెరవ్యాధి వచ్చే ధోరణి మొదలైంది. ఇప్పటివరకు స్థూలకాయం, చక్కెర వ్యాధులకు శారీరక వ్యాయామం లేకపోవడం, తిండి అలవాట్లు, ఒత్తిడి కారణమని వైద్యులు అభిప్రాయపడుతూ వస్తున్నారు.

పూణెలోని కింగ్‌ఎడ్వర్డ్‌ మెమోరియల్‌ హాస్పటల్‌ డయాబెటీస్‌ యూనిట్‌ డయాబెటీస్‌ పేషంట్ల సంఖ్య పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తూ అధ్యయనాలు చేసినప్పుడు ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్న కారణాల కంటే ముఖ్యమైనవి కూడా ఉన్నాయని గుర్తించింది. బ్రిటన్‌లో ఉన్న చక్కెర వ్యాధిగ్రస్థుడితో పోల్చి చూస్తే మన వాళ్ళలో చక్కెరవ్యాధి బారిన పడినవారు తక్కువ బరువుతోనే ఉన్నారు. కానీ శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ ఉంది. కండపుిష్టి లేకపోవడమే దీనికి కారణం.

మన వాళ్ళకి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే లణం ఎక్కువ. కాలేయం కొవ్వులో మునిగితేలుతుంది. ఈ కొవ్వు జీవక్రియలు జరిగే తీరుమీద ప్రభావం చూపిస్తుంది. ఇన్సులిన్‌ని శరీరకణజాలం మీద సరిగా పనిచేయనీయకుండా చేస్తుంది.దీనివల్లే భారతీయులు డయాబెటీస్‌,దానికి సంబంధిం చిన ఇతర డిసార్డర్స్‌కి గుర య్యేది. తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో ఇలా కొవ్వు పేరుకుపోయే క్షణం ఎక్కువగా ఉండి పెద్ద య్యాక డయాబెటీస్‌కి,గుండె జబ్బులకు గురవుతారని ప్రొఫె సర్‌ డేవిడ్‌ బర్కర్‌ ప్రతిపాది స్తున్నారు.

పిండదశలో ఉండగానే...

పొట్టలో పిండంగా ఉన్నప్పుడే తగిన ఆహారం అందకపోవడం వల్ల బయటి ప్రపంచాన్ని కరువుతో కూడు కున్న దానిగా చూేసే లక్షణం బిడ్డ శరీరానికి వస్తుందని,కాబట్టి దొరికినప్పుడు వీలైనంత ఆహారా న్ని గ్రహించి దాన్ని కొవ్వు రూపం లో నిల్వచేసుకోవడానికి అల వాటుపడుతుందని అయన ఆంటున్నారు. ఆ వ్యక్తులు మధ్య తరగతి లేక సంపన్నస్థితిలో ఉన్న ప్పుడు శరీరం తీవ్రంగా స్పంది స్తుంది. ఇది హార్మోన్ల వ్యవస్థ, జీవక్రియ వ్యవస్థల పనితీరుని మందగింపచేసి మనిషిని టైప్‌ -2 డయాబిటిస్‌ వైపుకు నెడుతుంది.... ఇదీ డేవిడ్‌ బార్కర్‌ వివరణ.

మనదేశంలోనే ఎక్కువ

ఇది మన భారతదేశ ప్రజలకు వర్తించే అవకాశం ఎక్కువ. ఎందుకంటే మన పిల్లలు పుట్టినప్పుడు ఉండే బరువు అనేక దేశాల పిల్లల బరువుతో పోలిస్తే తక్కువ ఉంటుంది, మన పెద్ద వాళ్ళలోనే కాకుండా పుడుతున్న పిల్లల్లో కూడా కండపుష్ఠి తక్కువ. కొవ్వు ఎక్కుగా ఉంటున్నవారు ఎక్కువగానే ఉన్నారు. అంటే తల్లి పొట్టలో ఉన్నప్పటి నుంచి శరీరం కొవ్వును నిల్వ చేసుకునే ప్రక్రియ ప్రారంభమవుతోందన్న మాట.

మన శిశువుల శరీర కొలతల్ని చూస్తే వాళ్ళ శరీరం ఇన్సులిన్‌ నిరోధకంగా తయార య్యే అవకాశం ఎక్కువ ఉందనిపిస్తుంది. పుణె. ఢిల్లీ లలో చేసిన ఆధ్యయనాల్లో పుట్టినప్పుడు బరువు తక్కువ ఉండి బాల్యంలో పెరుగుదల వేగంగా ఉన్న పిల్లలు పెద్దయ్యాక టైప్‌ -2 డయాబెటీస్‌కి గురయ్యే అవకాశాలు ఎక్కువ అని తెలుస్తోంది. బలహీనంగా పుట్టిన పిల్లల బరువును పెంచడానికి తల్లి దండ్రులు, డాక్టర్లు ఇప్పుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వీటి ఫలితాలు ఎలా ఉంటాయో మరి...

గర్బిణులుగా ఉన్నవారిలో కొన్ని బీ విటమిన్లు తగ్గినా కండ తక్కువ కొవ్వు ఎక్కువ ఉండే పిల్లలు పుట్టవచ్చని పుణెలో చేసిన ఇటీవల పరిశోధనలు తెలుపుతున్నాయి. భావితరాల ఆరోగ్యం కోసం ఆడపిల్లలు ఎలాంటి తిండి తినాలో తెలిపే సూచనలను త్వరలోనే చేయనున్నామని పరిశోధనలు చేసిన డాక్టర్‌ తెలియజేస్తున్నారు. తల్లుల ఆరోగ్యం మీదనే భావితరాల ఆరోగ్యం ఆధారపడి ఉంది. ముఖ్యంగా టైప్‌ -2 డయాబెటిస్‌ నుంచి భావితరాల్ని విముక్తం చేయాలంటే ఇప్పటి యువతులకు ఆరోగ్యకరమైన ఆహారం ఆందాలి.మధ్య తరగతి..... ఆ పై తరగతికి ఈ విషయాలు తెలియజేసే బాధ్యత, దిగువ తరగతుల యువతులకు పోషకాహారం అందే మార్గాలు అన్వేషించే బాధ్యత విధానాలు రూపొందించే వారి మీదే ఉంది. ఈ పరిశోధనలు వారి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాల్సిందే.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details