User Rating: / 1
PoorBest 

పసిమి నవ్వులతో పసిపాపలు మురిపాలు పోవాలంటే, 'లోపాలు' లేని చనుపాలు తాగడం ఎంతో అవసరం. కానీ, గ్లోబలైజేషన్‌ బలిపీఠంపైన ఆధునీకత మూర్తీభవించిన తల్లులు తమ పిల్లలకు చను పాలివ్వడానికి ఎన్నో సంకటాలను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఎందరో పిల్లలు అనేకానేక వ్యాధుల బారిన పడుతున్నట్టు వైద్య ప్రపంచం గుర్తిస్తోంది. ఇలాంటి పరిసితులను కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే గుర్తించిన ఆయుర్వేద వైద్యులు, కన్న తల్లులు తమ పిల్లలకు పాలివ్వలేనప్పుడు 'పాలివ్వదగిన, పాలివ్వగలిగిన' ఇతర స్త్రీలను "ధాత్రి'' లేదా "ఉపమాత'' పేరుతో పరిగణనలోకి తీసుకునేవారు.

ఇదే సంప్రదాయం, గత రెండు వందల సంవత్సరాలుగా అభివృది పథంలోకి దూసుకు వెళ్తున్న ఆధునిక వైద్యుంలోనూ 'వైట్‌నర్స్‌' పేరుతో కొనసాగుతోంది.దీనికి పరాకాష్టగా 'రక్త దానంతో వెలసిన బ్లడ్‌ బ్యాంకుల' వలె 'స్తన్య దానంతో బ్రెస్ట్‌ మిల్క్‌' బ్యాంకులు కూడా అనేక అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవహారంలోకి వచ్చేశాయి.స్త్రీలకు పెద్ద చదువులు, సొంతకాళ్లపై నిలిపే ఉద్యోగ భద్రత, నవ నాగరికత అన్నీ కలిపి "స్తన్య నిధి'' కి బాటలు వేశాయి.

అభినందనీయం
ఇంతటి మానవీయ చారిత్రక సత్యాన్ని, అవసరాన్ని ఇప్పటికైనా గుర్తించి, చనుపాలకున్న విలువల్ని అధ్యయనం చేసిన వైద్యలు, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు చనుపాల ప్రాముఖ్యతను ప్రతీ సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి ఏడు వరకు 'ప్రపంచ తల్లిపాల వారోత్సవాల' పేరుతో ప్రచారం చేస్తుండడం ఎంతో శ్లాఘనీయం.

నిర్లక్ష్యం కూడదు
అయితే, ఈ ఉత్సవాలను కేవలం చనుపాల ప్రాశస్త్యాన్ని ప్రస్తుతించడంతోటే సరిపుచ్చకుండా 'చనుపాల దోషాలు, పాలిండ్ల లోపాలు, పాలివ్వడంలోని లోపాల'పై కూడా ప్రతీ తల్లీ తెలుసుకునేటట్లు చేయాలి. పాలిచ్చే విషయంలో ఏ తల్లీ సంబంధిత వైద్య నిపుణుల్ని సంప్రదించడంలో నిర్లక్ష్యం చేయకూడదు. సంప్రదింపుల సమయంలో వైద్యుడు కూడా చనుపాల లోపాల కారణాలు, చికిత్సా విధి విధానాలను తె లియజేయాలి. ప్రసూతి వైద్య శాలల్లో 'బ్రెస్ట్‌ ఫీడింగ్‌ కౌన్సెల్‌'ను స్థాపించి, కేవలం తల్లి పాల వారోత్సముల పేరుతోనే కాక ప్రతీ రోజూ అటువంటి కార్యక్రమాలను కొనసాగించాలి. 'అప్పుడే తల్లిపాల వారోత్సవాల' అంతిమ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. ఆరోగ్యవంతమైన భావితరాన్ని అందించగలుగుతాము.


పసిపిల్లల జన్మహక్కు
"మాతురేవ పిబేత్త్సన్యం తత్పరం దేహ వృద్ధయే'' - అష్టాంగ హృదయ సంహిత, ఉత్తర స్థానం 'చనుపాలు శిశువు దైహికంగా ఎదగడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి' అంతేకాకుండా, తదనంతర వయసులోనూ ఎదగడానికి బీజం వేస్తాయని పై సంహితా వాక్యం అర్థం. ఇది ఎప్పుడో క్రీస్తుకు పూర్వం నాటి మాట. మరిప్పుడు శిశువులకు, తల్లిపాలకు మించిన ఆహారం మరోటి లేదని అందరూ మరోసారి గుర్తించి మాట్లాడుకుంటున్న వాస్తవం. ప్రత్యేకించి బిడ్డకు 'అన్న ప్రాశన' చేసే ఆరు మాసాల లోపైనా ఈ స్తూత్రం తప్పక వర్తిస్తుంది.

ఎందుకంటే ఈ వయసులోపు ఏ ఇతర అన్న పానీయాలను ఆహారంగా ఇచ్చినా, పసిబిడ్డలు జీర్ణించుకోలేరు. పైగా వాంతులో, విరేచనాలో చేసుకోవడాన్ని గమనించే ఉంటారు. చివరికి ఆధునిక శాస్త్ర ఛాయలో పరిశోధనాత్మకంగా తయారయ్యే 'ఫార్ములా పాలు' కూడా తల్లి పాల మీద దిగదుడుపే. తల్లి పాలు తేలిగ్గా జీర్ణమవుతూ బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అలాగే, బ్యాక్టీరియల్‌, ఫంగల్‌, వైరల్‌ వ్యాధుల్ని నిరోధించడంలో కూడా చనుపాలు ప్రత్యేక భూమికను పోషిస్తాయి.

బ్రాండెడ్‌ పాలు
తల్లిపాలకు బదులు ఇతర అందుబాటులోని జంతువుల పాలు(ఆవు, మేక, గేదె, ఒంటె మొదలుగునవి) లేదా కృత్రిమ పాల పొడితో కాచి తయారు చేసిన పాలు, పిల్లల ఆకలి తీర ్చడానికి ఆపద్ధర్మంగా వినియోగించినా, నయా పైసా ఖర్చు లేకుండా సమతుల ఆహార పోషకాలను అందించేవి మాత్రం తల్లిపాలనే చెప్పాలి. బ్రాండెడ్‌ ఫార్ములా పాలంటే ఖరీదు పాలే! ఒక్కోసారి అవే ఖరీదైన పాలు పిల్లలకు ఖరీదైన జబ్బులను కూడా అంటకడతాయి. ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌(అతిసారం, గ్రహణీ లక్షణాలు), జువైనల్‌ డయాబిటిస్‌ (మధుమేహం), ఒబెసిటీ ( ఊబకాయం) వంటి దీర్ఘకాలిక వ్యాధులు కొన్ని పై పరిస్థితికి ఉదాహరణలు మాత్రమే.

ఔషధాల్లోనూ..
ఆరోగ్యమైనవీ, బలమైనవీ తల్లి పాలు మాత్రమే. శిశువుకు సానుకూలమై, తేలిగ్గా జీర్ణమవడంతో పాటు ఆకలినీ పుట్టిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. శిశువు చర్మాన్ని సౌందర్యంగా ఉంచడం లోనూ ఈ పాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆయుర్వేద వైద్యులు చనుపాలను 'నస్య కర్మ' అనే ప్రత్యేక పంచకర్మ విధి కోసమూ, కంటి వ్యాధుల్లో 'తర్పణం' లేదా 'ఆశ్చ్యోతనం' అనే మరో ప్రక్రియ కోసం కూడా వాడుతుంటారు.

విచారకరం
ఇంతటి సుగుణాలున్న పాలను తమ తల్లుల పాలిండ్ల నుంచి పొందడమేనేది ప్రతీ శిశువుకు జన్మతో వచ్చిన హక్కు! అయితే కొన్ని కారణాల వల్ల తమ పిల్లలకు పాలివ్వలేని తల్లులు కూడా ఉన్నారు. మరకొందరు తల్లులు కేవలం 'స్తన్య సౌందర్యం' చెడిపోతుందన్న సాకుతో తమ పిల్లలకు స్తన్యాన్ని అందించకపోవడం విచారించదగ్గ విషయం. అలాగే జీతం డబ్బు వేటలో పడి మరికొందరు పాలివ్వడం మానేస్తున్నారనే విషయం కూడా ఈ మధ్య కాలంలో బయటపడింది.

దీనికి తోడు తల్లి పాల సుగుణాలను తలదన్నే రీతిలో ఫార్ములా పాల వ్యాపార ప్రకటనలు కూడా చనుపాలివ్వడం పట్ల నిర్లక్ష్యానికి అంకురార్పణ చేస్తున్నాయి. ఇలాంటి ప్రకటనలకు లోనైన తల్లులు వాటిపట్ల ఆకర్షణకు లోనై బిడ్డకు తల్లిపాలను దూరం చేస్తున్నారు. వైద్యులు కూడా తల్లులకు పాలివ్వడంలో అవగాహన- శిక్షణ సరిగా ఇవ్వడం లేదనే చెప్పవచ్చు.

ఇదంతా ఒక రకంగా 'పసివాళ్లు పాలు తాగడం' అనే జన్మహక్కును కాల రాయడమే! ఇది అమానుషం, గర్హనీయం కూడా. ఈ జాఢ్యం ప్రపంచ వ్యాప్తమై సీసా పాలకు (బాటిల్‌ ఫీడింగ్‌) అలవాటు పడిన ఎందరో పిల్లలు వివిధ రోగాల బారిన పడడమే కాక, మృత్యువాత పడుతున్నారు కూడా. ఒక దశలో ఈ విషయం సామాజిక వేత్తలను కలవరపరిచి, చనుపాల గొప్పతనాన్ని ప్రచారం చేయడానికి 'ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు'(ప్రతీ సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు) గా ఉద్యమించాల్సి వచ్చిందటే పరిస్థితి ఎంత తీవ్రస్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.

ఆయా దే శాల ప్రభుత్వాలు ఫార్ములా పాల ప్యాకింగ్‌లపైన 'తల్లి పాలే శ్రేష్ఠమైనవి' అనే నినాదాన్ని ఆయా భాషల్లో విధిగా ముద్రిచడానికి ఆదేశాలు జారీ చేశాయి కూడా. కులమతాలకు అతీతంగా..666 మనిషితో సహా, పాలిచ్చే జంతువులన్నింటికీ 'పాలివ్వడం' అనేది మౌలిక జీవన ధర్మం! కాబట్టి కులమతాల ప్రమేయం లేకుండా, బీద, ధనిక భేదం రాకుండా ప్రతీ పసిబిడ్డకు అందుబాటులో ఉండాల్సిన ఆహారం తల్లిపాలే! అందుకే ఆయుర్వేదంలో శిశువుకు మొదటి ఆరుమాసాల వయసును 'క్షీరదా' (ఎక్స్‌క్లూజివ్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఏజ్‌) అని ఆ తరువాత రెండు సంవత్సరాల వరకు 'క్షీరాన్నదా' (పార్షియల్‌ బ్రెస్‌ ఫీడింగ్‌ అండ్‌ కాంప్లిమెంటరీ ఫీడింగ్‌ ఏజ్‌) అని, ఆపైన వీనింగ్‌ ఏజ్‌ అనీ వ్యవహరిస్తుంటారు.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details