newborn baby care,new born infants,pregnancy new born,diaper rash new born,bathing new born,newborn screening,new born babies cry, new born sleep
కడుపు నొప్పి తగ్గేదెలా?
సుజనకి పది నెలల వయస్సున్న పాప వుంది. పగలంతా బాగానే ఆడుకున్నా సాయంత్రం వేళకి మాత్రం పాప గుక్క పట్టి ఏడుస్తుంది. రాత్రీళ్ళు సరిగ్గా నిద్రపోదు. ఈ ఏడుపుకు కారణమేంటో తెలియక సుజన ఆందోళన చెందుతూ వుంటుంది. పెద్దవారిని అడిగితే పిల్లలు కదా! అజీర్తి మూలంగా అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుంటుంది. ఇది మామూలే! పెద్దగా కంగారు పడాల్సిందేమీ లేదు అని చెప్పారు. కానీ పాప పరిస్థితీని చూసిన సుజన దంపతులకు ఆందోళన ఎక్కువై డాక్టర్‌ని సంప్రదించారు. పిల్లలు ఏడుపునకు కారణాలు డాక్టర్ వివరించడంతో సుజన హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది.
కడుపు నొప్పి అని తెల్సుకునేదెలా?
సాధారణంగా పిల్లల్లో కడుపు నొప్పి మూడు నాలుగు నెలల వయసు నుంచే మెదలవుతుంది. ఈ వయసు పిల్లలు కడుపునొప్పి వస్తుందని చెప్పలేరు, దాన్ని పెద్దలే తెల్సుకోవాలి. గుక్కతిప్పుకోకుండా ఏడుస్తారు. ఇలా ఏడవడంతో ముఖం, అరచేతులు, అరికాళ్ళు బాగా ఎర్రబడతాయి పడుకోబెట్టిన కొద్ది సేపట్లోనే లేచి మళ్లీ ఏడుపు అందుకుంటారు.
ఏడుపుకు కారణాలెన్నో
సాధారణంగా మూడు నెలల వయసు నుంచే పిల్లలు తల్లిని, తమ చుట్టూ ఉన్న వారిని పదే పదే చూస్తూ గుర్తు పట్టడానికి ప్రయ త్నిస్తుంటారు. కాళ్ళూ, చేతులు అదే పనిగా ఆడిస్తూ వుంటారు. ఊ కొట్టి కబుర్లు చెప్పే వారు లేకున్నా ఏడుస్తుంటారు. అదే విధంగా చిన్న అసౌకర్యం కలిగినా గుక్కపట్టి ఏడ్చి పెద్దలకు ఊపిరి ఆడకుండా చేస్తుం టారు. శారీరకంగా ఇతర సమస్య లేమైనా ఉన్నాయేమో గమనించి తగు చికిత్స ఇప్పించండి. పాల కోసం ఏడుస్తున్నారేమో తెలుసుకొని పాలుపట్టండి. నాప్కిన్ ఎప్పటికప్పుడు మార్చుతున్నారో లేదో చెక్ చేయండి.
ఏదైనా వంటికి గుచ్చుకుని బిడ్డ అసౌకర్యానికి గురవుతున్నదేమో పరిశీలించండి. పాలు తాగిన తర్వాత పిల్లవాడిని భుజం మీదుగా ఎత్తుకుంటే త్రేన్పు వస్తుంది. త్రేన్పు రాకపోయినా పిల్లవాడికి కడుపులో అసౌకర్యంగా ఉండి ఏడుస్తూంటాడు. పిల్లవాడి భుజాల కిందుగా చేతులు వేసి పట్టుకొని చిన్నగా నడిపించండి దీంతో దేహమంతా కదిలి వ్యాయామం అవుతుంది. అజీర్తి లక్షణాలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి.సంగీతపరమైన పాటలు వినిపించండి. లేదంటే మీరే ఓచక్కని పాట పాడండి. అబ్బాయి ఏడుపు హంఫట్ అయిపోతుంది. వెచ్చని నీటితో స్నానం చేయించండి. ఆరు బయట తిప్పుతూ పరిసరాలను పరిచయం చేయండి, ఏడుపు ఆపేస్తారు.మల, మూత్రాదులు సాఫీగా అవుతున్నాయా లేదా గమనించండి. ఇంట్లో ఎవరివైనా కడుపు నొప్పి మందులు వుంటే వాటిని వేసే ప్రయత్నం చేయకండి. ఇలాంటి సొంత వైద్యాలు పిల్లల ప్రాణాలకు ముప్పు తెస్తాయి.
సాయంకాలమే ఎందుకు ఏడుస్తారు?
సాధారణంగా చం టి పిల్లలు సాయం కాలం ఎక్కువగా ఏడుస్తుంటారు, పగలంతా బాగా నే ఉంటారు. సాయంకాలం కాగానే వీరికి ఏమవుతుంది? అని చాలా మంది ఆదుర్ధా పడుతుంటారు. దీనికి కారణంఉంది, పాలు తాగించేప్పుడు ఊపిరి పీల్చుకోవడం ద్వారా పాల తో బాటు గాలి కూడా కడుపులోకి చేరుతుంది. అయితే పాలు, గాలి కన్నా బరువుగా వుండంతో కడుపులో కింది భాగానికి చేరుతాయి.
గాలి పైన వుంటుంది. పాలు తాగించిన తర్వాత బిడ్డను భుజం మీతుగా వేసుకొని త్రేన్పు వేస్తే గాలి బైటకి పోయి పిల్లవాడికి అసౌకర్యంగా అనిపించదు.అలా కాకుండా పాలు తాగిన వెంటనే పడుకోబెడితే పాలు, గాలి కలిసిపోయి పాలు విరిగిపోయి వాంతికి వస్తుంది. దీంతో పిల్లవాడు ఉక్కిరిబిక్కిరి అయి ఏడుస్తాడు. ఈ నొప్పి 99శాతం వరకు సాయంత్రాలే ఎక్కువగా ఉంటుంది. రాత్రంతా నిద్రపోకుండా అదే పనిగా ఏడిస్తే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించండి.
సాయంకాలం నిద్ర వద్దు
సాయంకాలాలు పిల్లల్ని నిద్రపోనివ్వకుండా ఆడిస్తూ వుండండి. మీ పిల్లల వయసున్న ఇరుగు పొరుగు పిల్లలతో కలిసి ఆడుకునేలా చేయండి. పెద్ద పిల్లలయితే వారి స్నేహితులతోఆడుకోమని ప్రోత్సహించండి. దీని వలన శారీరక వ్యాయమం అవుతుంది.మానసికంగా ఆరోగ్యంగా వుంటారు. ఆటలాడి అలిసిపోవడం వలన త్వరగా నిద్రపోతారు. ఇది ఎదిగే పిల్లలందరికీ వర్తిస్తుంది.
కాస్త పెద్ద పిల్లలయితే భయంకరమైన దృశ్యాలు చూసినా, విన్నా నిద్రలో కలవరించి లేచి ఏడుస్తుంటారు. ఇలాంటప్పుడు దెయ్యం,భూతం వస్తుంది పడుకో అని చాలా మంది పెద్దవాళ్ళు ఈ రకమైన భయాల్ని పిల్లలు నిద్రపోవ డానికి ఉపయోగిస్తుంటారు. అప్పటికి నిద్రపోతారేమో కాని, ఏ చిన్న అలికిడి అయినా దెయ్యం వస్తుందేమోనని భయంతో బిగుసుకుపోయి ఏడుస్తారు. కనుక పిల్లలకి భయం కలిగించే విషయాలను పదే పదే చెప్పి నిద్రపుచ్చడం మంచిది కాదు. దానికన్నా ఏదైనా శాస్ర్తీయ సంగీతమో...లైట్ మ్యూజిక్కో పిల్లలకు వినిపిస్తూ...నిద్రపుచ్చాలి...కొంచెం పెద్దవాళ్లయితే నీతి కథలను చెప్పి పడుకోబెట్టడానికి ప్రయత్నించాలి.
| Next >తల్లి పాలే బిడ్డకు శ్రేష్ఠం! |
|---|
Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details
Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details
Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details