Recipes

మధుమేహం కారణంగా లైంగిక సామర్థ్యం సన్నగిల్లుతుందా? చాలామందిలో ఉన్న పెద్ద అపోహ ఇది! కేవలం మధుమేహం ఉన్నంత మాత్రానే లైంగిక పటుత్వం తగ్గాల్సిన అవసరమేం లేదు. అలాగని మధుమేహాన్ని సరిగా నియంత్రణలో ఉంచుకోకపోతే మాత్రం.. లైంగిక జీవితంలో భారీ మూల్యం చెల్లించాల్సి రావటం తథ్యం!

మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే.. అది మన శరీరంలో కళ్ల నుంచి కాళ్ల వరకూ.. మెదడు నుంచి మూత్రపిండాల వరకూ.. దాదాపు ప్రతి అవయవాన్నీ ఎంతోకొంత దెబ్బతీస్తుంది! ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలుసు. కాకపోతే అది ప్రత్పుత్తి అవయవాలనూ ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని చాలామంది గుర్తించటం లేదు. అందుకే- సరైన చికిత్స తీసుకోని చాలామంది మధుమేహులు.. ఎంతోకొంత లైంగిక సామర్థ్యం తగ్గిందని చెబుతుంటారు. కొందరు దీని గురించి మాట్లాడటానికి సిగ్గుపడుతూ ఎవరితోనూ చర్చించటం లేదు. మరికొందరేమో 'వయసుతో పాటుగా సామర్థ్యం తగ్గటం సహజమేలే' అని సర్దుకుపోతున్నారు. నిజానికి ఈ రెండూ సరికాదు!

మన దేశంలో మధుమేహుల సగటు వయసు 50 ఏళ్లన్నది వాస్తవమేగానీ ఈ దశకు వచ్చేసరికి కేవలం వయసు కారణంగానే లైంగిక పటుత్వం తగ్గాల్సిన అవసరమేం లేదు. పటుత్వం తగ్గుతున్నట్టు అనుమానంగా ఉందంటే మధుమేహులు.. షుగర్‌ను కచ్చితంగా నియంత్రణలో ఉంచుకుంటున్నారో లేదో చూసుకోవటం అవసరం. కొందరు మధుమేహులు తమకు పటుత్వం తగ్గుతోందని అంగీకరించటానికి ఇష్టపడరు.. పైగా తమ పరిస్థితికి సమర్థనగానా అన్నట్టు.. కావాలని మరీ సెక్స్‌ మీద ఆసక్తి తగ్గించుకుని.. తాత్వికంగా మారుతుంటారు. యుక్తవయస్సులో ఉన్నంత లైంగిక శక్తి, ఆసక్తి 50 ఏళ్లప్పుడు ఉండకపోవచ్చుగానీ.. నిజానికి ఈ వయస్సులో కూడా చక్కటి శృంగార జీవితాన్ని అనుభవించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే బరువులూ బాధ్యతలన్నీ తీరిపోయి.. జీవితంలో స్థిరపడిన ఈ దశలో చాలామంది సున్నితమైన శృంగారంతో ఆహ్లాందంగా గడుపుతుంటారు. పైగా ఈ వయసులో 'సామర్ధ్యాన్ని' నిరూపించుకోవాలన్న లేనిపోని ఒత్తిళ్లూ, ఆందోళనలు కూడా ఉండవు. ఈ వయసులో సౌఖ్యవంతమైన శృంగార జీవితాన్ని గడిపే అవకాశాలే ఎక్కువ. కాబట్టి వయసుతోపాటే సామర్థ్యం తగ్గుతుందన్నది పూర్తి నిజం కాదు. మధుమేహులు ఏదో లోపంగా, వెలితిగా అనిపిస్తే దాని గురించి పట్టించుకోవటమే మంచిది.

ఎప్పుడు పట్టించుకోవాలి?
అప్పుడప్పుడు పటుత్వం తగ్గినట్లనిపించటం.. ఎప్పుడన్నా ఒకసారి సామర్థ్యం సన్నగిల్లుతోందనిపించటం.. ఇవన్నీ మామూలే. ముఖ్యంగా అంత సౌకర్యంగా లేని సమయాల్లో, ఇబ్బందికర వాతావరణంలో ఇలాంటి అనుభవాలూ సహజమే. పైగా ఈ కాలంలో పెరిగిపోతున్న పనిఒత్తిడి, ఆఫీసులో లేనిపోని చికాకులు, పోటీతత్వం.. ఇవన్నీ కూడా శృంగార జీవితాన్ని కొద్దికొద్దిగా కొరుక్కుతింటున్నాయి. కానీ చాలామంది ఈ ముఖ్యమైన కారణలను పట్టించుకోకుండా.. తమ లైంగిక అవయవాల్లో ఏదో లోపం వచ్చిందని భయపడుతుంటారు. ఫలితంగా మానసికంగా కూడా బాగా జంకుతుంటారు. ఇదంతా సరికాదు. సెక్స్‌ విషయంలో భయాలు పెంచుకోవటం కంటే సరైన అవగాహన పెంచుకోవటం ముఖ్యం. మూడు నెలల పాటు అంగ స్తంభనలు సరిగా లేకపోతే అప్పుడువైద్యులను సంప్రదించటం మంచిది. కొందరు స్తంభన సరిగా లేకపోవటాన్ని శీఘ్రస్ఖలనంగా భ్రమపడుతుంటారు. ఈ రెంటి మధ్యా తేడా తెలుసుకోవటం అవసరం. కొందరికి పెద్దవయసులో ప్రోస్టేట్‌ సర్జరీల తర్వాత కూడా ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి అనుమానం ఉంటే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటమే ఉత్తమం.
అనుమానం.. అప్పుడేం చేస్తారు?
సమస్య రక్తనాళాల్లో ఉందని తెలుసు కాబట్టి రక్తనాళాల(వాస్క్యులర్‌) వైద్యుల వద్దకు వెళితే మంచిది. లేదంటే దీనిలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న స్పెషలిస్ట్‌ల వద్దకు వెళ్లటం ఉత్తమం. నాటు వైద్యులను ఆశ్రయించటం మాత్రం ప్రమాదకరం. పురుషాంగానికి రక్తసరఫరా ఎలా ఉందో తెలుసుకునేందుకు పీబీఐ(పీనైల్‌ బ్రాఖియల్‌ ఇండెక్స్‌) అనే డాప్లర్‌ పరీక్ష బాగా ఉపకరిస్తుంది. ఇది 0.6 కంటే తక్కువుంటే పురుషాంగానికి రక్త సరఫరా తగ్గుతున్నట్టే లెక్క. అలాగే రక్తంలో ప్రొలాక్టిన్‌, టెస్టోస్టిరాన్‌, గ్లూకోజు ఎలా ఉందో చూడటం, ప్రోస్టేటు సమస్యలను గుర్తించే 'పీఎస్‌ఏ' వంటి పరీక్షలు చేయిస్తారు. పురుషాంగంలోకి పీజీఈ-1 అనే మందు ఎక్కించి స్తంభనలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా చూస్తారు. ఈ మందు ఎక్కించిన తర్వాత స్తంభన పటుత్వం బాగుంటే రక్తసరఫరా, కండరాల పనితీరు కొంతలోకొంత బాగుందని అర్థం.

ఒకవేళ రక్తసరఫరా బాగా తక్కువగా ఉంటే తిరిగి దాన్ని పెంచేందుకు రకరకాల మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. అందుకు డీఐసీసీ, పీఈపీ వంటి మరికొన్ని పరీక్షలు చేయిస్తారు.
ఏం చెయ్యాలి?
* మధుమేహ నియంత్రణలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు. రక్తంలో షుగర్‌, కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవటం ప్రధానం. చికిత్స కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి.
* రోజూ ఉదయాన్నే కనీసం 5, 6 కిలోమీటర్లు కాస్త వేగంగా నడవండి. ఇది కేవలం లైంగిక సామర్ధ్యాన్ని పెంచటానికే కాదు.. మధుమేహం నియంత్రణలో ఉండటానికీ, చక్కటి ఆరోగ్యానికీ దోహదం చేస్తుంది.
* రోజూ సైక్లింగ్‌, ఈత.. ఈ రెండూ లైంగిక సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తాయి.
* పొత్తికడుపు, కటి ప్రాంత కండరాలను బలోపేతం చేసే కపాల భాతి, సర్వాంగాసనం వంటివి సాధన చెయ్యండి.
* రోజూ తప్పనిసరిగా ఆకుకూరలు, పచ్చి కూరముక్కలు, తీపి తక్కువుండే బొప్పాయి వంటి పండ్లు తీసుకోండి. ఏడెనిమిది బాదం పప్పులు, ఖర్జూర పండ్లవంటివి తీసుకోండి.
* సాధ్యమైనంత వరకూ బీఫ్‌, మటన్‌ వంటి మాంసాహారం బాగా తగ్గించండి.
* ముఖ్యంగా- మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌ వంటివి దరిజేరనివ్వద్దు. భాగస్వామితో ఆహ్లాదంగా గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయించండి. సమయానికి ఆహారం, చక్కటి వ్యాయామం.. క్రమశిక్షణ పాటించటం.. లైంగిక సామర్థ్యం తగ్గకుండా చూసుకోవటానికి ఇవన్నీ దోహదం చేస్తాయి. ఎప్పుడైనా శృంగార భావనలను పెంపొందించే సినిమాలు చూడటమూ మంచిదే.
* పొరపాటున కూడా పొగ తాగొద్దు. గుట్కాలు, దూమపానం.. ఇవన్నీపటుత్వాన్ని తగ్గిస్తాయి.
* బరువు పెరగకుండా చూసుకోండి. మద్యం మోతాదు మించొద్దు!
రక్తసరఫరా ప్రధానం!
మధుమేహులకు సెక్స్‌ సమస్యలు వచ్చే అవకాశం ఎందుకు ఎక్కువ? ఇది తెలియాలంటే ఒక్కసారి లైంగికక్రియా సమయంలో మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటం అవసరం. ముందుగా- శృంగార భావనలు మెదడులో ఆరంభమవుతాయి. అది శృంగార సంకేతాలను జననాంగాలకు పంపించటం మొదలుపెడుతుంది. దీంతో పురుషాంగానికి రక్తం తీసుకువచ్చే రక్తనాళాలన్నీ వెడల్పుగా పెద్దవి కావటం ఆరంభిస్తాయి. ఫలితంగా పురుషాంగానికి వేగంగా రక్తసరఫరా జరుగుతుంది. క్రమేపీ పురుషాంగం స్తంభిస్తుంది. పురుషాంగంలో ఒత్తిడి బాగా పెరగటంతో రక్తం తిరిగి వెనక్కి వెళ్లే మార్గాలన్నీ కూడా తాత్కాలికంగా మూసుకుపోతాయి. రక్తం లోపలే ఉండి.. స్తంభన అలాగే నిలుస్తుంది.. సంభోగానికి సిద్ధమవుతుంది. సంభోగానంతరం తిరిగి మార్గాలన్నీ తెరుచుకుని రక్తం వెనక్కి వెళ్లిపోతుంది, అంగం సాధారణ స్థితికి వచ్చేస్తుంది.

మధుమేహం చాలాకాలం నియంత్రణలో లేకపోతే.. ఈ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది.
మధుమేహుల్లో రక్తనాళాల గోడలకు క్యాల్షియం, కొవ్వు వంటివి పేరుకుపోతుంటాయి. దీనివల్ల రక్తనాళాల్లో మార్గం సన్నబడిపోతుంది. ఫలితంగా ఎక్కువ రక్తం లోపల చేరే అవకాశం ఉండదు. దీంతో పురుషాంగానికి రక్తం సరిగా అందక స్తంభన సామర్థ్యం తగ్గుతుంది. అలాగే మధుమేహం కారణంగా పురుషాంగ సమీపంలోని నాడులూ దెబ్బతిని (న్యూరోపతీ) దాని కారణంగా కూడా శృంగారంలో తృప్తి లేకుండా పోవచ్చు. నిజానికి ఒక్క పురుషాంగానికే కాదు.. మధుమేహుల్లో శరీరంలోని చాలా రక్తనాళాలు ఇలా సన్నగా తయారై రకరకాల ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ఇది కూడా వాటిలో భాగమే. దీనికి తోడు మధుమేహులు చాలా మందికి హైబీపీ ఉంటుంది. దానికి వాడే మందులు కూడా సామర్ధ్యాన్ని కొద్దిగా తగ్గిస్తాయి. అలాగే కొందరు మధుమేహుల్లో థైరాయిడ్‌ సమస్యలూ ఉంటాయి, అవీ శృంగార జీవితాన్ని ప్రభావితం చేసేవే. కాబట్టి మధుమేహులు ముందుగా రక్తంలో గ్లూకోజును కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటం.. ఇతరత్రా సమస్యలేమైనా ఉంటే వాటి గురించీ శ్రద్ధ తీసుకోవటం తప్పనిసరి.

ఇంకా.. ఇంకా..!

పొగ ఎక్కువగా తాగటం, కాఫీలు - మద్యం ఎక్కువగా తాగటం.. ఇవన్నీ మధుమేహుల్లో శృంగార సమస్యలు తెచ్చిపెట్టేవే. ముఖ్యంగా పొగ రక్తనాళాలను బాగా దెబ్బతీస్తుంది. మధుమేహుల్లో తీవ్రస్థాయి సమస్యలు తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇవేవీ మితి మీరకుండా చూసుకోవటం అవసరం.

చికిత్స ఎలా?

పటుత్వ లోపంతో బాధపడుతున్న దాదాపు 90% మధుమేహులకు ఎటువంటి సర్జరీలూ అవసరం ఉండదు. కేవలం మధుమేహ నియంత్రణ చర్యల ద్వారానే పరిస్థితి చాలా వరకూ చక్కబడుతుంది. ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవటం, జీవనశైలిని మెరుగుపరచుకోవటం ద్వారా తేలికగానే దీన్ని అధిగమించవచ్చు. కొన్ని ప్రత్యేక వ్యాయామాలూ ఉపకరిస్తాయి. కొన్నిసార్లు సిల్దినాఫిల్‌ (వయాగ్రా) వంటి మందులూ కొంత వరకూ అక్కరకొస్తాయి. అయితే ఇలాంటి మందులను మాత్రం మధుమేహులు తమకు తాముగా తీసుకోవటానికి లేదు. దానివల్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా కూడా పరిణమించవచ్చు కాబట్టి మందుల విషయంలో వైద్యుల సలహా తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో పురుషాంగంలోకి కొన్ని ఇంజక్షన్ల వంటివి, మూత్రమార్గం ద్వారా లోపలికి పంపించే ఆల్‌ప్రోస్టాడిల్‌ వంటి మందులూ సిఫార్సు చేస్తారు. 8-10% మందికి రక్తసరఫరా మెరుగుపరిచేందుకు సర్జరీ అవసరమవ్వచ్చు.

నివారణే మంచిది!
మధుమేహం ఉందంటే... సెక్స్‌ సమస్యలు రాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఆ మాటకొస్తే ఒక్క సెక్స్‌ సమస్యే కాదు.. ఇతరత్రా ఏ సమస్యలు రాకుండా ఉండాలన్నా ముందు జాగ్రత్తలు ఒకటే. చక్కటి ఆహారం. క్రమబద్ధమైన జీవనశైలి. మధుమేహ నియంత్రణ. వీటిని విస్మరించకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే జీవితం హాయిగా సాగిపోతుంది!


Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/250851Samantha_Hot_Photo_Stills_For_JFW_Magazine.jpg

Samantha actress photos

Samantha Photos telugu actress photos,Samantha Photos actress Pictures, Samantha Photos actress gallery, Samantha Photos actress stills,samantha stills   See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/531329Tamanna_latest_new_hot_photos_stills_002.jpg

Tamanna Photo Gallery, tamanna

Tamanna Photo Gallery, tamanna stills, Tamanna Pictures, Tamanna sexy pics, Tamanna images, Tamanna wallpapers, Tamanna photos, Tamanna See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/713299kajal807.jpg

Kajal Agarwal Actress Gallery

Kajal Agarwal Telugu Actress Hot Pictures NewKajal Agarwal Telugu Actress Hot Pictures NewKajal Agarwal Telugu Actress Hot Pictures New See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/174101priyamani328.jpg

Priyamani Hot Pictures, Priyam

Telugu Actress Priyamani Photo Gallery, Priyamani photo gallery, Priyamani photos, Actress Priyamani Photo Gallery, Priyamani hot gallery, Priyamani wallpapers, actress Priyamani hot, Priyamani hot pictures, Priyamani hot See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/615728asin978.jpg

Actress Asin pics, Asin Photo

Telugu Actress Asin Photo Gallery, Asin photo gallery, Asin photos, Actress Asin Photo Gallery, Asin hot gallery, Asin wallpapers, actress Asin hot, Asin hot pictures, Asin hot images. See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/835372nitya_menon82.jpg

Nitya Menon Gallery telugu act

Nitya Menon Gallery telugu actress photos,Nitya Menon Gallery actress Pictures, Nitya Menon Gallery actress gallery, Nitya Menon Gallery actress stills See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/484284ileana886.jpg

Ileayana photo gallery

Telugu Actress Ileayana Photo Gallery, Ileayana photo gallery, Ileayana photos, Actress Ileayana Photo Gallery, Ileayana hot gallery, Ileayana wallpapers, actress Ileayana hot, Ileayana hot pictures, Ileayana hot See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/711536taapsee174.jpg

apsee photo gallery, Telugu Ac

Tapsee photo gallery, Telugu Actress Tapsee Photo Gallery, Tapsee Picture Gallery, Tapsee Stills, Tapsee Hot Photo Gallary, Tapsee spicy photos, Tapsee hot, Tapsee sexy, Tapsee gallery See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/985577anuskha978.jpg

Actress Anushka, Actress Anush

Actress Anushka hot gallery, Actress Anushka photos, Actress Anushka stills, Anushka hot Stills, Actress Anushka, anushka photos See details