ప్రపంచంలో జనాభా విపరీతంగా పెరిగిపోతోందని మనకందరికీ తెలిసిన విషయం.
చైనా తర్వాత, మన భారత దేశం అత్యధిక జనాభా గల దేశం. హైదరాబాద్‌లో, పంజాగుట్టలో పగలు రోడ్డు దాటాలంటే పదినిమిషాలు పడుతుందంటే ఆశ్చర్యం లేదు.మెడికల్ టెక్నాలజీ అభివృద్ధి చెంది మరణాలు తగ్గిపోతున్నాయి కానీ పుట్టుకలు తగ్గడం లేదు.ఆ విధంగా దేశ జనాభా పెరిగి పోయి, మన దేశ అభివృద్ధికి అడ్డంకి ఏర్పడుతోంది.
1952లో భారతదేశం మొదటిసారి జనాభా నియంత్రణ పద్ధతులని అమలులోకి తీసుకొచ్చింది.
2000లో భారతదేశ జనాభా ప్రపంచ జనాభాలో 16% కాని ప్రపంచ భూ భాగంలో 2.4% మాత్రమే. భారత జనాభా.
1991 లో 84 కోట్లు
2001 లో 101 కోట్లు
2011 లో 117.8 కోట్లు
1016 లో 126.3 కోట్లు (అంచనా)
అయితే ఈ అధిక జనాభాని తగ్గించడానికి మనం పాటించవలసింది... కుటుంబనియంత్రణ పధ్ధతులు.
చాలా మందికి ఈ పద్ధతుల గురించి తెలిసినా ఎంతో మందికి సరైన అవగాహన లేదు ఎన్నో సందేహాలు....
ఎపుడు ఏ పద్ధతిని అవలంబించాలి? ఎలా పాటిం చాలి? దీనివలన వచ్చే నష్టాలేమైనా వున్నాయా? ఉంటే అవి ఏమిటి? వాటిని నివారించే మార్గాలేమైనా వున్నాయా?
ఉదాహరణకు....ఈ మధ్యనే ఒక యువతి ఒక కొడుకు (3సంరాలు) తర్వాత మళ్ళీ గర్భందాల్చింది,భర్తకి చిన్న ఉద్యోగం.భార్యా భర్తలు చదువుకున్నారు. కానీ ఆదాయం అంతంత మాత్రం రెండవ బిడ్డ వద్దనుకున్నారు. కానీ నిర్ణ యం తీసుకొనే సమయానికి ఆమెకి 5వ నెల అయినా డాక్టరు వద్దకు వెళ్ళారు డాక్టరు సలహాతో అబార్షన్‌కి ప్రయత్నించారు కానీ సరైన వైద్యం అందక దురదృష్ట వశాత్తు ప్రాణాలు కోల్పోయింది.
ఇలాంటివి ఎన్నో సంఘటనలు........
ప్రస్తుత పరిస్థితులలో ఒక్క రు లేక ఇద్దరు పిల్లలు చాలు, ప్రతి కుటుంబానికి ఒక్కరే అయితే ఇంకా మంచిది. ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు అసలు పిల్లలు కలుగక అవస్థలు పడుతూ ఎంతెంతో ఖర్చు చేస్తున్నారు. ఒక ప్రక్కన 4-5 పిల్లలున్న కుటుం బాలు కూడా కోకొల్లలు.
కాబట్టి పెళె్ళైనా 3 సంరాలకి పిల్లలు కలగకపోతే వారు ఏమిచేయాలి? ఎవరిని కలవాలి? ప్రాబ్లమ్ ఎక్కడున్నది.? భార్యలోనా భర్తలోన ,ఇద్దరిలోనా?ప్రాబ్లమ్ ఉంటే ఎలా సరిదిద్దుకోవాలి? అలాగే కుటుంబనియంత్రణ పద్దతు లేమిటి? ఒకరు లేక ఇద్దరితో చాలించాలంటే ఏం చేయాలి? పుట్టే బిడ్డ,తల్లి ఆరోగ్యంగా వుండాలంటే ఏమి పాటించాలి? ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని, ఒక అవగాహనకు వస్తే మన జీవితం ఆరోగ్యవంతంగా, ఆనందమయంగా మలచుకోవచ్చు.
అసలు పెళ్ళిచేసుకునే వధువుకి కనీసం 20 సంవత్సరాల వయస్సు ఉండాలి.వరుడికి 22-25 సంవత్సరాల వయస్సు మించింది, వీలయినంత వరకు పెళె్ళైన 1-2 సంవత్సరాలు వరకు గర్భం రాకుండా చూసుకోవాలి. ఇప్పటికే కొంతమంది. మన పెద్దలు పెళ్లయిన రెండో రోజు నుంచే నాకు మనవడినో మనవరాలినో ఇవ్వమని అంటూవున్నారు. కానీ అది సరికాదు తాత్కాలిక కుటుం బ నియంత్రణ పధ్ధతులు ఎన్నో ఉన్నాయి,(మాత్రలు) లూప్ , కండోమ్, సేఫ్ పీరియడ్,)
రక్తహీనత ( అనీమియా) అనేది మనదేశంలో అత్యధిక శాతం స్ర్తీలలో ఉన్నది. ఈ రక్త హీనత వలన, స్ర్తీలు గర్భం ధరించి, ప్రసవసమయంలో అనేక కష్టాలకు గురి కావడమే కాకుండా పుట్టే బిడ్డ ఆరోగ్యం కూడ అంతంత మాత్రమే ఉంటుంది.
Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details
Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details
Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details