Family Planning


గర్భ నిరోధక మాత్రల్లో సాధారణంగా వాడే లైవోనార్‌ జెస్ట్రెల్‌... ప్రొజెస్టిన్‌ కోవకి చెందిన హార్మోన్‌. ఏ మందైనా నోటిమాత్రల రూపంలో వాడినప్పుడు జీర్ణకోశంలో ప్రవేశించి, కాలేయం నుంచి రక్తప్రసరణ ద్వారా గర్భాశయానికి చేరవలసిందే! గర్భాశయంతో పాటు మిగిలిన అవయవాలకూ ఎంతోకొంత మోతాదు చేరుతుంది. అయితే జీర్ణకోశంలో ఆమ్లాల ప్రభావంతో మందు గాఢత తగ్గిపోతుంది. అందువల్లే కొన్నిసార్లు మాత్రల మోతాదును పెంచడం తప్పనిసరవుతుంది. అలాకాకుండా మందుని సూటిగా గర్భాశయంలోకి ప్రవేశపెడితే.. తక్కువ మోతాదు వాడినా సమర్థంగా పనిచేస్తుందనే ఉద్దేశంతో రూపొందించిందే... ఈ 'మిరేనా'.'టి' ఆకారంలో ఉండే ప్లాస్టిక్‌ పరికరంలో ఎల్‌ఎన్‌జీ అనే ప్రొజెస్టిన్‌ను దట్టించి రోజూ ఇరవై మైక్రో గ్రాముల మందు గర్భాశయంలోకి విడుదలయ్యేలా చేస్తారు. రోజూ ఈ లెక్కన అయిదేళ్లపాటు ఎల్‌ఎన్‌జీ విడుదలవుతుంది. వాడుకలో మాత్రం ఏడేళ్లదాకా కూడా పనిచేస్తుందని గుర్తించారు.

ఎలా పనిచేస్తుంది

ఈ పరికరం శుక్రకణాలను నిర్వీర్యం చేస్తుంది. ఒకవేళ ఫలదీకరణ జరిగినా పిండం గర్భాశయంలో నాటుకోకుండా నిరోధించి గర్భం రాకుండా చేస్తుంది. ఇలాంటి మిరేనాతో ఇతర లాభాలూ ఉన్నాయి. అవేంటంటే?

* రక్తస్రావం 40-50 శాతం దాకా తగ్గిపోతుంది. ఏడాది సమయంలో రుతుక్రమంలో 90 శాతం వరకూ రక్తస్రావం తగ్గుతుంది. నొప్పి నుంచిఉపశమనం ఉంటుంది. అంటే.. అధిక రక్తస్రావం, నెలసరి సమయంలో నొప్పితో బాధపడే వారికి ఇది చక్కగా పనిచేస్తుంది.

* పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పిసిఓఎస్‌) ఉన్న స్త్రీలకు నెలసరి తరచూ ఆలస్యంగా వచ్చి రక్తస్రావం విపరీతంగా అవుతుంటుంది. ఎండోమెట్రియల్‌ హైపర్‌ప్లేసియా లేదా గర్భాశయపు లోపలి పొర ఎక్కువగా పెరిగిపోవడమే దీనికి కారణం. తరచూ అధికబరువు, రక్తపోటుతో బాధపడే వారికి... గర్భాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉన్న వారికి... మిరేనా సరైన పరిష్కారం. అధిక రక్తస్రావాన్ని అరికట్టడంతో పాటు ఎండోమెట్రియం అతిగా పెరగకుండా నిరోధించి గర్భాశయ క్యాన్సర్‌ బారి నుంచి రక్షిస్తుంది.

* ఎడినోమియోసిస్‌ వల్ల అధికరక్తస్రావం, నొప్పితో బాధపడే వారికీ ఎల్‌ఎన్‌జీ- ఐయూడీతో ఉపశమనం ఉంటుంది.

* మెనోపాజ్‌ తర్వాత హెచ్‌ఆర్‌టి లేక హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ తీసుకునే స్త్రీలు ఈస్ట్రోజెన్‌ కోసం మాత్రలు వాడినా.. ప్రొజెస్టిన్‌ కోసం మిరేనా వేయించుకోవచ్చు.

* పీఐడీ, ఎండోమెట్రియోసిస్‌తో బాధపడే వారికీ మిరేనా బాగా పనిచేస్తుందని ఇటీవల గుర్తించారు.

సమస్యలు...
పద్ధతేదైనా కొద్దోగొప్పో దుష్ప్రభావాలు తప్పవు. మిరేనాతోనూ అంతే. మొదటి మూడునెలల్లో తరచూ కొద్దికొద్దిగా రక్తస్రావడం కావడం సర్వసాధారణం. తర్వాత్తర్వాత సర్దుకుంటుంది. రక్తస్రావం తక్కువ కావడం.. నెలసరి సక్రమంగా రాకపోవడం.. వగైరా లక్షణాలతో కొందరి కష్టాలు తొలగిపోయినట్లనిపిస్తే.. ఇవే ఇంకొందరిని ఇబ్బందికి గురిచేయొచ్చు.

ప్రొజెస్టిన్‌లతో ప్రత్యేకంగా వచ్చే దుష్ప్రభావాలు నోటిమాత్రలంత ఎక్కువగా కాకపోయినా, కొందరిలో మిరేనాతో కొంతవరకు కనబడొచ్చు. ఉదా: మొటిమలు, తలనొప్పి, రొమ్ముల్లో నొప్పి, అధిక బరువు, మూడ్స్‌ మారడం వంటివి. అరుదుగా అండాశయాల్లో చిన్నపాటి సిస్ట్‌లు ఏర్పడవచ్చు. ఎలాంటి చికిత్స చేయకపోయినా అవి వాటంతటవే తగ్గిపోతాయి.

ఇంప్లాంట్స్‌
గర్భ నిరోధానికి ప్రొజెస్టిన్‌ ఐయూడీ రూపంలోనే కాదు.. చర్మం అడుగున అమర్చే ఇంప్లాంట్లుగానూ దొరుకుతుంది. సన్నగా పొడుగ్గా అగ్గిపుల్లల్లా ఉండే ఈ ప్లాస్టిక్‌ రాడ్‌లని సున్నితంగా అమరుస్తారు. అయితే ఇవి మన దేశంలో ఎక్కువగా వాడకంలో లేవు. విదేశాల్లో ప్రాచుర్యం పొందడానికి కారణాలు...

* ఒక్కసారి అమరిస్తే 3-7 ఏళ్లదాకా పనిచేస్తాయి.
* కలయిక జరిగిన ప్రతీసారి కండోమ్‌ వాడనవసరంలేదు. గర్భ నిరోధకాలుగా పనిచేస్తాయి. ఒకవేళ అరుదుగా గర్భం వచ్చినా, శిశువు మీద ఎలాంటి ప్రభావం ఉండదు.
* హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ ఉన్న స్త్రీలూ వీటిని వాడొచ్చు.
అయితే అమర్చడానికి, తొలగించడానికి నిపుణులు అవసరం ఉండటమే ఈ పరికరంతో వచ్చే పెద్ద చిక్కు. సైడ్‌ ఎఫెక్టులు కూడా మిరేనాలనే ఉంటాయి.

మిరేనా లేదా ఇంప్లాంట్స్‌ వాడిన తర్వాత గర్భ ధారణలో ఆలస్యం జరగదు. పిల్లలు కావాలనుకున్నప్పుడు వీటిని తీయించుకోగానే ఫెర్టిలిటీ పూర్వ స్థాయికి వచ్చేస్తుంది. వెంటనే రుతుచక్రం, రక్తస్రావం కూడా సాధారణ స్థాయికి చేరుకుంటాయి.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details