Health Tips

neredu palluఅల్లనేరేడు చెట్టుకాడ...అంటూ జానపద పాటలు మనం వింటుంటాం. సిటీలో ఉండేవాళ్లకు నేరేడు పళ్లు అంతగా తెలియవు. కొన్ని చోట్ల దీనిని కాలాజామూన్‌గా వ్యవహరిస్తుంటారు. చూడటానికి వంగపండు రంగులో మిలమిల మెరిసిపోతూవుంటాయి. తినే విషయానికి వచ్చేసరికి చాలామంది వెనకడుగువేస్తుంటారు. ఒక్క నేరేడుపండు తినగానే నోరంతా అదోమాదిరిగా కొట్టుకుపోయినట్లు ఉండి... వగరువగరుగా ఉండటంతో చిన్నపిల్లలు అస్సలే దగ్గరికి రానీయరు. కానీ నేరేడును ఆయుర్వేద శాస్త్రంలో అపర సంజీవిని అంటారు. జీర్ణసంబంధిత రోగాలకు నేరేడు దివ్యౌషధం నేరేడుపండ్లను గింజలతో సహా జ్యూస్‌ చేసుకుని సేవిస్తే కడుపులో నులిపురుగులు వెంటనే చనిపోతాయి.

జీర్ణశక్తిని అమాంతం పెంచేస్తుంది ఈ నేరేడుజ్యూస్‌. తరచుగా కడుపునొప్పితో బాధపడేవారికి ఈ జ్యూస్‌ వారం రోజులపాటు సేవిస్తే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా శ్వాససంబంధిత రోగాలలో బాధపడేవారికి నేరేడు పళ్లు తరచుగా తింటుంటే రోగనిరోధకశక్తి పెరిగి శ్వాససంబంధ రోగాలు దూరం అవుతాయి. చిన్నపిల్లలకు నేరేడు లాభాలను గురించి చెప్పాలి. వగరుగా ఉండటమే దాని ప్రత్యేకత అని దానిని తీసుకుంటే ఎటువంటి రోగాలు దరిచేరవని వారికి అర్థం అయ్యేరీతిలో చెబుతుండాలి.

రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యం వలన, తినే తిండిలో కూడా తేడాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏది తిన్నా ఒకరికి ఫలానా కూరగాయ పడటం లేదనో...ఫలానా పండు పడటం లేదనో చెబుతుంటారు. మరి పూర్వకాలం వారిని పరిశీలిస్తే వారు అరవైలో కూడా ఎంతో ఆరోగ్యవంతంగా తమ పని తాము చేసుకునేలా ఉండేవారు. కానీ ఇప్పుడు జనరేషన్‌ కేవలం థర్టీప్లస్‌కే గ్యాస్‌ట్రబుల్‌, ఎసిడిటీలతో బాధపడుతున్నారు.

పిజ్జాబర్గర్లతో కాలక్షేపం చేసేవారికి కొవ్వు శాతం అధికంగా పేరుకుపోయి ఊబకాయం కూడా వస్తోందని తేలింది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పుదీనాను క్రమం తప్పకుండా వాడితే మంచిదని వైద్యులు చెబుతున్నారు. పుదీనాను సాధారణంగా మనం బిర్యానీ, మషాలాలతో కలిపిన కూరల్లో వాడుతుంటాము. అందులో ఉండే కంటెంట్స్‌ జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తాయని సర్వేలు చెబుతున్నాయి. నిత్యం పుదీనాను వాడేవారిలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతోందని సర్వేలు చెబున్నాయి.

హాని చేయని హనీ
తేనె అంటే ఇష్టపడనివాళ్లంటూ ఉండరు. కానీ తేనె వినియోగించేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. విదేశాలలో బ్రెడ్‌ ముక్కల్లో తేనె ముంచుకుని తింటారు. చిన్నపిల్లలయితే తేనెను తెగ చప్పరిస్తారు. కల్తీలేని స్వచ్ఛమైన తేనెలో ఎన్నో ఔషధగుణాలు ఇమిడివున్నాయి. అవేమిటో చూద్దామా...

తేనెను ఔషధంగా, పైపూతగా కూడా అనాదిగా ఆయుర్వేదంలో చెప్పబడినట్లుగా వాడుతునేవున్నారు. షుగర్‌ వ్యాధిగ్రస్తులు కూడా భయంలేకుండా ఈ తేనెను ఉపయోగించవచ్చు.

పచ్చకామెర్లకు...

పచ్చకామెర్లు ఉన్నవాళ్లు అచ్చంగా పాలన్నమే తినాలని వైద్యులు చెబుతారు. వాళ్లు ఇంకే ఇతర ఆహార పదార్థాలు తినకూడదు. అయితే తేనెను మామిడిపళ్లరసంతో కలిపి తీసుకుంటే పచ్చకామెర్ల వ్యాధి తొందరగా తగ్గిపోతుంది. తినేందుకు కూడా మంచి రుచిగా ఉంటుంది. దీంతో వాళ్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

దగ్గు, ఆయాసానికి...

కొందరు విపరీతమైన దగ్గు, ఆయాసంతో బాధపడుతుంటారు. అటువంటి వారు పొద్దున్నే పరగడుపున వేడినీళ్లల్లో తేనెను కలుపుకుని ఆ రోజంతా ఏ ఇతర ఆహారాన్ని తీసుకోకుండా
కేవలం తేనె కలిపిన వేడినీటినే ప్రతి గంటకూ ఒకసారి తీసుకోవాలి. అలా రెండురోజులు వరుసగా చేస్తే వెంటనే వారి దగ్గు మటుమాయం అవుతుంది. ఎటువంటి ఔషధాలు తీసుకోకుండానే...

'నీళ్లే నా సౌందర్య రహస్యం..' అన్న మాటలు ఈ మధ్య తరచూ వినిపిస్తున్నాయి. అంతే కాదండోయ్‌.. వైద్యనిపుణులు మరో నిజాన్నీ తేల్చిచెప్పారు. ఎక్కువ నీరు తాగితే ముఖం మీద వృద్ధాప్య ఛాయలు కనిపించవని వెల్లడించారు. ముఖం అందంగా, మృదువుగా కనిపించడానికిపదిహేనొందల జీన్స్‌ ఉపకరిస్తాయి. శరీరానికి సరిపడా నీరు అందకపోతే డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. దానివల్ల ఈ జీన్స్‌కు హాని కలుగుతుంది. అధ్యయనం ప్రకారం.. సగం జీన్స్‌ కోల్పోయినా చర్మం ముడతలు పడటం అధికమవుతుంది. అందుకే నీరు తాగే విషయంలో శ్రద్ధ చూపితే వృద్ధాప్య దశలోనూ కొంత యౌవనంగా కనిపించవచ్చు. వేలకు వేలు ఖర్చుపెడతాం. ఎన్నో సౌందర్య సాధనాలు ఉపయోగిస్తాం.అయినప్పటికీ ముఖం మీద ముడతలు వస్తూనే ఉంటాయి. పూర్తిగా రాకుండా ఆపలేం. యువతలోనూ ముఖం మీద ముడతల సమస్య ఎక్కువేనని ఓ అంచనా. దీనికి విరుగుడు మంచినీళ్లు బాగా తీసుకోవడమే.

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details