శరీరానికి కావల్సిన విటమిన్లు, మినరల్స్‌ అందాలంటే ప్రతిరోజూ రెండు బాదం పప్పులను తప్పకుండా తినాల్సిందే మధుమేహం ఉన్నవారు వీటిని తీసుకుంటే గ్లూకోజ్‌స్థాయి నియంత్రణలో ఉంటుంది. వీటిని విడిగాకానీ , నేరుగాకానీ ఆహారంలో తీసుకోవచ్చు. నానబెట్టిన బాదంపప్పుని తీసుకుంటే మరీ మంచిది. ఇవి శరీరానికి కావలసిన కొవ్వుని, విటమిన్లని, మాంసకృత్తులని, పీచుపదార్థం, మెగ్నీషియం, ఐరన్‌ని అందిస్తాయి. వీటితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలంటే మీరు తీసుకునే ఆహారంలో ఇవన్నీ ఉండాల్సిందే....
- ఆడవారికి ఐరన్‌ శాతం తగ్గడంతో రక్తహీనత ఏర్పడుతుంది. తాజాకూరలు, మాంసం, అరటి కాయ, ఆపిల్‌ వీటిల్లో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఆకుకూరల్లో గోంగూరలో ఐరన్‌ శాతం అధికంగా ఉంటుంది. ఐరన్‌ సప్లిమెంట్లను వాడాల్సి వస్తే వైద్యుని సలహా తప్పకుండా తీసుకోవాలి.

-శరీరం ఇనుమును ఎక్కువగా అందుకోవాలంటే దానికి సి విటమిన్‌ కూడా తోడ్పడుతుంది. సి విటమిన్‌ను అందించేవి ఎక్కువగా నిమ్మజాతి ఫలాలు. సిట్రస్‌ ఫలాలుగా చెప్పబడే నిమ్మ,నారింజ, బత్తాయి, ఉసిరి లాంటి ఫలాలన్నింటిలోనూ సి విటమిన్‌ సమృద్ధిగా ఉంటుంది. వీటిని సీజనల్‌గా ఏ కాలంలో వచ్చే పండ్లు ఆ కాలంలో తప్పనిసరిగా ఆహారాన్ని తగ్గించుకుని వీటినే ఎక్కువగా తింటూ ఉండాలి. ఇలా చేస్తే కొన్నాళ్లలో అధిక బరువు తగ్గే అవకాశం ఉంది.

మనలో చాలామందికి డ్రైఫ్రూట్స్‌ అంటే భయం. అవి అవసరమైనదానికన్నా ఎక్కువ కెలొరీలనిస్తాయని భ్రమపడుతుంటాం. నిజానికి నట్స్‌, డ్రైఫ్రూట్స్‌ పలు పోషకాలు కలిగి ఉంటాయి కాబట్టి మనకెంతో మేలు చేస్తాయి. ఉదాహరణకు పిస్తా పప్పుల్నే తీసుకుంటే కొలెస్టరాల్‌ తగ్గించగలవని తేలింది.

పెన్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా కొంతమంది చేత రోజూ 40 నుంచి 85 గ్రాముల వరకూ పిస్తా పప్పు తినిపించారు. ఒక నెల రోజుల పాటు ఇలా తిననిచ్చి వాళ్ల కొలెస్టరాల్‌ స్థాయుల్ని పరీక్షిస్తే 8.4 శాతం, ఎల్‌డిఎల్‌ 11.6 శాతం తగ్గుదల కన్పించిందట. పిస్తాపప్పులో ఉన్న మోనో అన్‌శాచురేటెడ్‌ కొవ్వు పదార్థాలు, ల్యుటెన్‌, బీటాకెరొటిన్‌ లాంటి యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్‌ 'ఇ'లు కొలెస్టరాల్‌ని తగ్గిస్తున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. కాబట్టి భయపడకుండా రోజూ ఒక పరిమితి మేరకు పిస్తాపప్పు తినవచ్చన్నమాట.

కాకరకాయ అనగానే ఒక్క మధుమేహవ్యాధిగ్రస్తులకే మంచిది అనుకోకండి. ఔషధగుణాలున్న కాకరను తరచూ స్వీకరించడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. కాకరలో సోడియం, కొలెస్ట్రాల్‌ శాతం తక్కువ. థయామిన్‌, రెబొఫ్లేవిన్‌, విటమిన్‌ బి6, పాంథోనిక్‌ యాసిడ్‌, ఇనుము, ఫాస్పరస్‌లు మాత్రం పుష్కలంగా లభిస్తాయి. హైపర్‌టెన్షన్‌ని అదుపులో ఉంచుతుంది ఫాస్ఫరస్‌. అధిక మొత్తంలో పీచు లభిస్తుంది. సోరియాసిస్‌ను నివారణలో కాకర కీలకపాత్ర పోషిస్తుంది. శరీరానికి అత్యావశ్యక పోషకాలైన ఫొలేట్‌, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌ కూడా సమృద్ధిగా లభిస్తాయి. అందుకే కాకరను తరచూ తినండి. కనీసం పదిహేనురోజులకోసారైనా టీ స్పూను కాకర రసం తాగండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
బీన్స్‌లో క్యాలరీలు తక్కువగా ఉన్నా, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో విటమిన్‌సీ, విటమిన్‌కే, మాంగనీస్‌ వంటివన్నీ దండిగా ఉంటాయి. రక్తనాళాలు సంకోచించే అథెరోస్ల్కెరోసిస్‌, మధుమేహం కారణంగా తలెత్తే గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి. పార్శ్వనొప్పి వేధించకుండా ఉపశమనం ఉంటుందని అధ్యయనాల్లో సైతం గుర్తించారు.బీన్స్‌లో ఇనుము ఎక్కువగా ఉండటం వల్ల శక్తిని అందించటంలో తోడ్పడతాయి. అంతేకాదు, నెలసరి నిలిచిపోని మహిళలకూ, గర్భిణులకూ మంచి పోషకాలుగా ఉపయోగపడతాయి.

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details