కాకరకాయ అనగానే ఒక్క మధుమేహవ్యాధిగ్రస్తులకే మంచిది అనుకోకండి. ఔషధగుణాలున్న కాకరను తరచూ స్వీకరించడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. కాకరలో సోడియం, కొలెస్ట్రాల్ శాతం తక్కువ. థయామిన్, రెబొఫ్లేవిన్, విటమిన్ బి6, పాంథోనిక్ యాసిడ్, ఇనుము, ఫాస్పరస్‌లు మాత్రం పుష్కలంగా లభిస్తాయి. హైపర్‌టెన్షన్‌ని అదుపులో ఉంచుతుంది ఫాస్ఫరస్. అధిక మొత్తంలో పీచు లభిస్తుంది. సోరియాసిస్‌ను నివారణలో కాకర కీలకపాత్ర పోషిస్తుంది. శరీరానికి అత్యావశ్యక పోషకాలైన ఫొలేట్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. అందుకే కాకరను తరచూ తినండి. కనీసం పదిహేనురోజులకోసారైనా టీ స్పూను కాకర రసం తాగండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
గర్భస్థ శిశువుకూ ట్రాఫిక్ చిక్కులు
కాలుష్య ప్రభావం ఇప్పుడు గర్భస్థశిశువునూ వదిలేలా లేదు. తీవ్ర కాలుష్యం కారణంగా గర్భస్థ శిశవు ఎదుగుదలలో లోపాలతోపాటు తక్కువ బరువుతో జన్మించే అవకాశాలు అధికమని తాజా అధ్యయనాలు అంటున్నాయి. యూఎస్ ఎపిడమాలజీ జర్నల్‌లో ప్రచురించిన వివరాల సారాంశమిది. న్యూజెర్సీ విశ్వవిద్యాలయ అధ్యాపకులు మూడు లక్షల పైచిలుకు నవజాతశిశువులను పరిశీలించిన మీదట ఈ అధ్యయన ఫలితాన్ని వెల్లడించారు. వాహన కాలుష్యం నుంచి వెలువడే ప్రమాదకర రసాయన కారకాలు తొలి మూడు నెలలు ఆఖరి మూడు నెలల్లోని గర్భస్థ శిశవును అమితంగా ప్రభావితం చేస్తాయని తెలిపారు. విపరీతమైన ట్రాఫిక్.. వాతావరణంలో ప్రమాదకర రసాయనాలు నిండిపోవడానికి కారణమవుతోంది. వాహనకాలుష్యం మూలంగా గర్భస్థ శిశవుకు ప్రాణవాయువు, అత్యావసర పోషకాలు సంపూర్ణంగా అందవు. మెయిన్‌రోడ్ చేరువలో నివసించే వారిలోనూ.. మరీ చిన్నవయసు లేదా ఆలస్యంగా గర్భం ధరించినవారిలోనూ ఈ రసాయ నాల ప్రభావం అధికంగా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్త డేవిడ్ రిచ్. ముఖ్యంగా మోటారు వాహనాల నుంచి వెలువడే పొగలు ఈ పరిస్థితికి కారణమం. నైట్రోజన్ డైయాక్సైడ్ సూక్ష్మమొత్తంలో అయినా సరే గర్భాన్ని ప్రభావితం చేసి ఒక్కోసారి గర్భస్రావాలు అవడానికి కూడా కారణమౌతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే మీ చిన్నారి శ్రేయస్సు కోసం సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ భూతానికి దూరంగా ఉండే ప్రయత్నం
చేయండి.
ఇవి తినండి
మండుటెండలో బయటకు వెళ్తున్నారా.. ఓ పనిచేయండి.. రెండు బ్రకోలీ పువ్వుల్ని తినేసి అప్పుడు బయలుదేరండి. ఎందుకో తెలుసా.. స్కిన్‌క్యాన్సర్ నుంచి కాపాడుతుంది బ్రకోలీ. బ్రిటన్‌కు చెందిన జాతీయ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నివేదిక ప్రకారం.. దీనిలో ఉండే ప్రత్యేక ఎంజైమ్‌లు అత్యంత శక్తిమంతమైనవి. ఇవి ఎండబారి నుంచి శరీరకణజాలాన్ని సంరక్షిస్తాయి. హాని జరగకుండా చూస్తాయి. చూశారుగా.. ఇది ఎండాకాలం కూడా కాబట్టి రోజూ బయటకు వెళ్లేముందు రెండు బ్రకోలీ పువ్వుల్నితీసుకోండి. పచ్చిగా ఇష్టం లేకపోతే...గుప్పెడు పువ్వుల్ని ఆవిరిపై ఉడికించి ఫ్రిజ్‌లో ఉంచి...రోజూ తీసుకోండి.
Add comment