User Rating: / 0
PoorBest 

శరీరానికి కావల్సిన విటమిన్లు, మినరల్స్‌ అందాలంటే ప్రతిరోజూ రెండు బాదం పప్పులను తప్పకుండా తినాల్సిందే మధుమేహం ఉన్నవారు వీటిని తీసుకుంటే గ్లూకోజ్‌స్థాయి నియంత్రణలో ఉంటుంది. వీటిని విడిగాకానీ , నేరుగాకానీ ఆహారంలో తీసుకోవచ్చు. నానబెట్టిన బాదంపప్పుని తీసుకుంటే మరీ మంచిది. ఇవి శరీరానికి కావలసిన కొవ్వుని, విటమిన్లని, మాంసకృత్తులని, పీచుపదార్థం, మెగ్నీషియం, ఐరన్‌ని అందిస్తాయి. వీటితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలంటే మీరు తీసుకునే ఆహారంలో ఇవన్నీ ఉండాల్సిందే....
- ఆడవారికి ఐరన్‌ శాతం తగ్గడంతో రక్తహీనత ఏర్పడుతుంది. తాజాకూరలు, మాంసం, అరటి కాయ, ఆపిల్‌ వీటిల్లో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఆకుకూరల్లో గోంగూరలో ఐరన్‌ శాతం అధికంగా ఉంటుంది. ఐరన్‌ సప్లిమెంట్లను వాడాల్సి వస్తే వైద్యుని సలహా తప్పకుండా తీసుకోవాలి.

-శరీరం ఇనుమును ఎక్కువగా అందుకోవాలంటే దానికి సి విటమిన్‌ కూడా తోడ్పడుతుంది. సి విటమిన్‌ను అందించేవి ఎక్కువగా నిమ్మజాతి ఫలాలు. సిట్రస్‌ ఫలాలుగా చెప్పబడే నిమ్మ,నారింజ, బత్తాయి, ఉసిరి లాంటి ఫలాలన్నింటిలోనూ సి విటమిన్‌ సమృద్ధిగా ఉంటుంది. వీటిని సీజనల్‌గా ఏ కాలంలో వచ్చే పండ్లు ఆ కాలంలో తప్పనిసరిగా ఆహారాన్ని తగ్గించుకుని వీటినే ఎక్కువగా తింటూ ఉండాలి. ఇలా చేస్తే కొన్నాళ్లలో అధిక బరువు తగ్గే అవకాశం ఉంది.

- శరీరంలో ఐరన్‌ తగ్గితే కాల్షియం కూడా తగ్గినట్టే కాబట్టి పాలను కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్‌ని అందిచే పదార్థాలను తీసుకున్న వెంటనే కాల్షియం సంబంధింతాలను తీసుకోకూడదు. వీటికి కనీసం మూడుగంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.

- మనం వాడే పచ్చళ్లలో, ఆధునికంగా చేసుకునే వంటల్లో కాసింత వెనిగర్‌ జోడించే అలవాటును అలవర్చుకోవాలి, వెనిగర్‌లో ఉండే రసాయనాలు శరీరంలోని అధికకొవ్వును తేలికగా కరిగిస్తాయి. దీంతోపాటు రక్తంలో పేరుకుపోయిన కొవ్వును, వంట్లో చక్కెర శాతాన్ని కూడా తగ్గించమేకాకుండా వంటకు మరింత రుచిని పెంచుతుంది. వెనిగర్‌లో నిలవచేసే గుణం ఉంది. పచ్చళ్లు నిలవవుండాలంటే వెనిగర్‌ను తప్పక వాడాలి. వెనిగర్‌తో పచ్చళ్ల రుచి కూడా పెరుగుతుంది.

- రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం దంపుడుబియ్యం, గోధుమగడ్డి, చేపలు, వెల్లుల్లి తీసుకోవాలి. గోధుమ గడ్డిని ఇంట్లోనే కుండీలలోకూడా పెంచుకోవచ్చును. ప్రతిరోజూ గోధుమగడ్డిని కత్తిరించి వాటిని జ్యూస్‌లా చేసుకుని తాగవచ్చు. షుగర్‌ పేషెంట్లకు దివ్యంగా పనిచేస్తుంది ఈ గోధుమ గడ్డి.
నలభై సంవత్సరాల వయసు వచ్చాక ఆహార నియమాలలో తప్పనిసరిగా మార్పులు రావాలి.

- పిజ్జా, బర్గర్లకు స్వస్తిపలికి ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తినాలి. జొన్న, గోధుమలతో చేసిన రొట్టెలు, మొలకెత్తిన తృణధాన్యాలు కూడా అవసరమే.

- తాజా ఆకుకూరలు, పసుపు, చిలగడదుంప తీసుకుంటే విటమిన్‌ ఎ బీటాకేరోటిన్‌ పుష్కలంగా అందుతాయి. ప్రతిరోజూ అన్నం శాతం తక్కువగా...కూరల శాతం ఎక్కువగా ఉండేలా అన్ని రకాల కూరగాయలను తినాలి. దీనివల్ల రోగనిరోధకశక్తి మరింత పెరుగుతుంది.

- డ్రై ఫ్రూట్స్‌, తృణధాన్యాలు అధికంగా తీసుకుంటే జింక్‌ కావల్సన స్థాయిలో అందుతుంది. స్ట్రాబెర్రీ, టమాటో, కాప్సికం వంటివి కూడా సి విటమిన్‌ను అందిచే ఆహారపదార్థాలే.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details