గుమ్మాడమ్మాగుమ్మాడి అంటూ పల్లెపడుచులు జానపదగీతాలను పాడుతూ పల్లెల్లో ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుతుంటారు. నేటి పట్టణీకరణ పుణ్యమా అంటూ ఇప్పుడటువంటి పాటలన్నీ అటకెక్కాయి. వాటి సంగతి పక్కకుపెడితే అసలు గుమ్మడికాయ అంటే కూడా చాలామందికి తెలియని పరిస్థితి ఏర్పడింది. చాలామందికి తెలిసిన గుమ్మడికాయ గుమ్మాలకు కట్టడం వరకే. అంతకుమించి దాని ఉపయోగం ఇప్పటి తరానికి తెలియదు. కానీ గుమ్మడిలో ఉన్న పోషక పదార్థాలు మన ఆరోగ్యాన్ని రెట్టింపు చేస్తాయి.
సాధారణంగా మనం గృహప్రవేశాల శుభసమయాలలో, శంకుస్థాపనల సమయాలలో గుమ్మడికాయను తప్పనిసరిగా ఉపయోగిస్తాము. గుమ్మడికాయ ఇంటికి శుభశూచికంగా అనాదిగా భావించేవారు. అందుకే గడపకు తప్పనిసరిగా గుమ్మడికాయను వేల్లాడదీసేవారు. కార్లు కొన్నప్పుడు గానీ, ఇంటికి ఏదైనా వస్తువు కొన్నా తప్పనిసరిగా దానికి గుమ్మడికాయతో దిష్టితీసేవారు పెద్దవాళ్లు. విదేశాలనుంచి వచ్చిన బంధువులకు కూడా ఇంట్లోవాళ్లు పెద్ద గుమ్మడికాయతో దిష్టితీయడం ఆనవాయితీ...అయితే ఎవరి నమ్మకం వారిది. అసలు శుభాలకే వినియోగించే గుమ్మడికాయను పూర్వకాలంలో పల్లెటూర్లలో చూరుపాకలకు గుమ్మడిపాదుల తీగెలను పాకించేవారు. అవి పెద్దపెద్ద కాయలుగా ఇంటి చూరుకు వేలాడుతూ అందంగా కనిపించేవి. వాటిపై భాగానికి సహజసిద్ధంగా బూడిదలాంటి తెల్లపదార్థం అంటుకుని ఉంటుంది. అందుకే గుమ్మడికాయల దొంగ అనగానే టక్కున భుజాలు తడుముకునేవారట వెనకటిరోజుల్లో...అది సామెతే అయినా...ఇప్పటితరానికి మాత్రం గుమ్మడికాయ అంటే విడమర్చి చెప్పాల్సిందే... స్థూలకాయం ఉన్నవాళ్లకు బూడిదగుమ్మడికాయ చేసే మేలు అంతాఇంతా కాదు.

ఆరోగ్యమైన మితాహారం, జీవనశైలితో రక్తపోటును, హార్ట్‌ఫెయిల్యూర్‌ ప్రమాదాన్ని నివారించొచ్చు. హార్ట్‌ ఫెయిల్యూర్‌ అంటే గుండె సోలిపోవడం. ఈ పరిస్థితిలో శరీరానికి సరఫరా చేసే రక్తాన్ని గుండె పంప్‌ చేయలేదు. హార్ట్‌ ఫెయిల్యూర్‌ అనేది ప్రధాన ప్రజారోగ్య సమస్యలా పరిణమించింది. హృద్రోగ వైద్యం, శస్త్ర చికిత్సల్లో పురోగతి సాధించినా హార్ట్‌ఫెయిల్యూర్‌తో మరణాల రేటు మాత్రం పెరుగుతోంది. జీవితంలో ఎపుడైనా ఒక సారి ఇతర కారణాల వల్ల హార్ట్‌ఫెయిల్యూర్‌తో మరణించే అవకాశాలున్నాయి. 40 ఏళ్ల వయసున్న ప్రతి ఐదుగురిలో ఒకరికి హార్ట్‌ఫెయిల్యూర్‌ కలుగుతుందని అంచనా. కాబట్టి దీన్ని నివారించడానికి ప్రాథమికంగా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా జీవనశైలిని మార్చుకోవాలని అమెరికన్‌ పరిశోధకులు సూచిస్తున్నారు. జీవనశైలి మార్చుకోవడం, తదనంతర కాలంలో గుండెజబ్బు ప్రమాదానికున్న సంబంధంపై వీరు అంచనా వేస్తున్నారు. పరిశోధనలో భాగంగా బోస్టన్‌కు చెందిన పరిశోధకులు 20,900 మంది పురుషుల సమాచారాన్ని విశ్లేషించారు. సగటున ఇది 22.4 ఏళ్లపాటు కొనసాగింది. 40 ఏళ్ల తర్వాత ప్రతి ఏడుగురిలో ఒకరు హార్ట్‌ఫెయిల్యూర్‌ ప్రమాదం బారినపడుతున్నారని తెలుసుకున్నారు. వైవిధ్యమైన ఆరోగ్య జీవనశైలి అవాట్లకు హార్ట్‌ఫెయిల్యూర్‌ ప్రమాదం తగ్గడానికి సంబంధం ఉందని తెలిసింది. ఆ అలవాట్లు... సాధారణ బరువుండడం, ధూమపానం చేయకపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మితంగా మద్యంతాగడం, ధాన్యాలుండే టిఫిన్‌ చేయడం, పళ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవడం. ఈ అలవాట్లకు కట్టుబడని వారిలో జీవితంలో ఒక్కసారైనా హార్ట్‌ఫెయిల్యూర్‌ ప్రమాదం పెరిగే అవకాశం 21 శాతం ఉంటుంది. అలవాట్లు పాటించే వారిలో ఇది 10 శాతం మాత్రమే. రెండోసారి 83,882 మంది మహిళల ఆరోగ్య సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. స్థూలకాయ మహిళల్లో అధిక రక్తపోటు వృద్ధి చెందే ప్రమాదం ఐదుసార్లు ఎక్కువుంటుంది. జీవనశైలి మార్చుకుంటే హార్ట్‌ఫెయిల్యూర్‌ ప్రమాదం నుంచి బయటపడొచ్చని పరిశోధకులు ఓ అంచనాకు వచ్చారు.

ద్రాక్ష పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్స్‌ ఆ పండ్లకు ఆ రంగును అందిస్తాయి. క్వెర్సిటిన్‌, రిజవెరట్రోల్‌ పదార్థాలు గుండె ముప్పును తగ్గిస్తాయి. ద్రాక్ష, ద్రాక్షరసం వంటివి నైట్రిక్‌ ఆక్సైడ్‌ నిల్వల్ని పెంచుతాయి. ఇది రక్తం గడ్డలు కట్టటాన్నీ, రక్తంలో ప్లేట్‌లెట్‌ కణాలు తగ్గటాన్నీ తగ్గిస్తుంది. అంతేకాదు, యాంటీఆక్సిడెంట్‌ పదార్థం ఆల్ఫాటోకోఫెరాల్‌ నిల్వల్నీ పెంచుతుంది. ఎరుపు ద్రాక్ష తొక్కలో రొమ్ము క్యాన్సర్‌ను తగ్గించే రసాయనాలు ఉంటాయి.
రోడ్డు మీద వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోవటం, గంటల తరబడి వాటి మధ్యే గడపటం.. నగర వాసులకు నిత్యకృత్యమే కావచ్చుగానీ.. ఈ కాలుష్య కాసారం మన 'గుండె'లను తొలిచేస్తోందని తాజా పరిశోధనలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. వాహనాల రద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన గంటలో గుండెపోటు ముప్పు మూడు రెట్లు పెరుగుతోందని స్పష్టంగా అంచనా కూడా వేశారు!

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details