ఆరోగ్యమైన మితాహారం, జీవనశైలితో రక్తపోటును, హార్ట్‌ఫెయిల్యూర్ ప్రమాదాన్ని నివారించొచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె సోలిపోవడం. ఈ పరిస్థితిలో శరీరానికి సరఫరా చేసే రక్తాన్ని గుండె పంప్ చేయలేదు. హార్ట్ ఫెయిల్యూర్ అనేది ప్రధాన ప్రజారోగ్య సమస్యలా పరిణమించింది. హృద్రోగ వైద్యం, శస్త్ర చికిత్సల్లో పురోగతి సాధించినా హార్ట్‌ఫెయిల్యూర్‌తో మరణాల రేటు మాత్రం పెరుగుతోంది. జీవితంలో ఎపుడైనా ఒక సారి ఇతర కారణాల వల్ల హార్ట్‌ఫెయిల్యూర్‌తో మరణించే అవకాశాలున్నాయి. 40 ఏళ్ల వయసున్న ప్రతి ఐదుగురిలో ఒకరికి హార్ట్‌ఫెయిల్యూర్ కలుగుతుందని అంచనా. కాబట్టి దీన్ని నివారించడానికి ప్రాథమికంగా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా జీవనశైలిని మార్చుకోవాలని అమెరికన్ పరిశోధకులు సూచిస్తున్నారు. జీవనశైలి మార్చుకోవడం, తదనంతర కాలంలో గుండెజబ్బు ప్రమాదానికున్న సంబంధంపై వీరు అంచనా వేస్తున్నారు. పరిశోధనలో భాగంగా బోస్టన్‌కు చెందిన పరిశోధకులు 20,900 మంది పురుషుల సమాచారాన్ని విశ్లేషించారు. సగటున ఇది 22.4 ఏళ్లపాటు కొనసాగింది. 40 ఏళ్ల తర్వాత ప్రతి ఏడుగురిలో ఒకరు హార్ట్‌ఫెయిల్యూర్ ప్రమాదం బారినపడుతున్నారని తెలుసుకున్నారు. వైవిధ్యమైన ఆరోగ్య జీవనశైలి అవాట్లకు హార్ట్‌ఫెయిల్యూర్ ప్రమాదం తగ్గడానికి సంబంధం ఉందని తెలిసింది. ఆ అలవాట్లు... సాధారణ బరువుండడం, ధూమపానం చేయకపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మితంగా మద్యంతాగడం, ధాన్యాలుండే టిఫిన్ చేయడం, పళ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవడం. ఈ అలవాట్లకు కట్టుబడని వారిలో జీవితంలో ఒక్కసారైనా హార్ట్‌ఫెయిల్యూర్ ప్రమాదం పెరిగే అవకాశం 21 శాతం ఉంటుంది. అలవాట్లు పాటించే వారిలో ఇది 10 శాతం మాత్రమే. రెండోసారి 83,882 మంది మహిళల ఆరోగ్య సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. స్థూలకాయ మహిళల్లో అధిక రక్తపోటు వృద్ధి చెందే ప్రమాదం ఐదుసార్లు ఎక్కువుంటుంది. జీవనశైలి మార్చుకుంటే హార్ట్‌ఫెయిల్యూర్ ప్రమాదం నుంచి బయటపడొచ్చని పరిశోధకులు ఓ అంచనాకు వచ్చారు.
Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details
Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details
Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details