గుమ్మాడమ్మాగుమ్మాడి అంటూ పల్లెపడుచులు జానపదగీతాలను పాడుతూ పల్లెల్లో ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుతుంటారు. నేటి పట్టణీకరణ పుణ్యమా అంటూ ఇప్పుడటువంటి పాటలన్నీ అటకెక్కాయి. వాటి సంగతి పక్కకుపెడితే అసలు గుమ్మడికాయ అంటే కూడా చాలామందికి తెలియని పరిస్థితి ఏర్పడింది. చాలామందికి తెలిసిన గుమ్మడికాయ గుమ్మాలకు కట్టడం వరకే. అంతకుమించి దాని ఉపయోగం ఇప్పటి తరానికి తెలియదు. కానీ గుమ్మడిలో ఉన్న పోషక పదార్థాలు మన ఆరోగ్యాన్ని రెట్టింపు చేస్తాయి.
సాధారణంగా మనం గృహప్రవేశాల శుభసమయాలలో, శంకుస్థాపనల సమయాలలో గుమ్మడికాయను తప్పనిసరిగా ఉపయోగిస్తాము. గుమ్మడికాయ ఇంటికి శుభశూచికంగా అనాదిగా భావించేవారు. అందుకే గడపకు తప్పనిసరిగా గుమ్మడికాయను వేల్లాడదీసేవారు. కార్లు కొన్నప్పుడు గానీ, ఇంటికి ఏదైనా వస్తువు కొన్నా తప్పనిసరిగా దానికి గుమ్మడికాయతో దిష్టితీసేవారు పెద్దవాళ్లు. విదేశాలనుంచి వచ్చిన బంధువులకు కూడా ఇంట్లోవాళ్లు పెద్ద గుమ్మడికాయతో దిష్టితీయడం ఆనవాయితీ...అయితే ఎవరి నమ్మకం వారిది. అసలు శుభాలకే వినియోగించే గుమ్మడికాయను పూర్వకాలంలో పల్లెటూర్లలో చూరుపాకలకు గుమ్మడిపాదుల తీగెలను పాకించేవారు. అవి పెద్దపెద్ద కాయలుగా ఇంటి చూరుకు వేలాడుతూ అందంగా కనిపించేవి. వాటిపై భాగానికి సహజసిద్ధంగా బూడిదలాంటి తెల్లపదార్థం అంటుకుని ఉంటుంది. అందుకే గుమ్మడికాయల దొంగ అనగానే టక్కున భుజాలు తడుముకునేవారట వెనకటిరోజుల్లో...అది సామెతే అయినా...ఇప్పటితరానికి మాత్రం గుమ్మడికాయ అంటే విడమర్చి చెప్పాల్సిందే... స్థూలకాయం ఉన్నవాళ్లకు బూడిదగుమ్మడికాయ చేసే మేలు అంతాఇంతా కాదు.
ప్రతిరోజూ ఆహారంలో కూరగా తీసుకున్నా లేక గుమ్మడిరసాన్ని సేవించినా పేగుల్లో మలినాలు బయటకు వచ్చేయడమేగాక...జీర్ణక్రియ వృద్ధి అవుతుంది. కొన్నాళ్లలో ఒంట్లో నీరంతా బయటకులాగేయబడి వాళ్ల బరువుకూడా తగ్గుతుంది. ఇప్పటితరానికి చాలా మందికి అసలు గుమ్మడికాయను కూరలా చేసుకుంటారని కూడా తెలియదు. చూడంగానే ఏదో గడపకు కట్టే దిష్టిబొమ్మలానే కనిపిస్తుంది. కానీ ఆరోగ్యాన్నిచ్చే మెగ్నీషియం, పోషక విలువలు అందులో ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. గుమ్మడికాయ ముక్కలను పులుసులో ముక్కలుగా కూడా వాడవచ్చు. తినడానికి రుచికరంగా ఉండటమేగాక...శరీరానికి కావలసిన మెగ్నీషియం కావలసినంత గుమ్మడికాయలో దొరుకుతుంది. ఇందులో ఉండే పీచుపదార్థం మన జీర్ణవ్యవస్థను సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఆకారానికి అంతలావుగా కనిపించినా ఇందులో ఎక్కువగా నీటిశాతం ఉంటుంది.
గుండెపోటుకు దివ్యౌషధం
గుండెపోటు ఉన్నవాళ్లకు గుమ్మడి విత్తులపొడితో నివారణ అవుతుంది. ప్రతిరోజూ ఈ గుమ్మడిగింజలను తీసుకోవడం ద్వారా గుండెకు బలం చేకూరి గుండెజబ్బులను ముందునుంచే రాకుండా కాపాడుకోవచ్చు. శరీరానికి వేడిచేసి ఒళ్లంతా సలసలా కాగిపోతుంటే గుమ్మడితో చేసిన సలాడ్ లేక జ్యూస్ ఎంతో చలవనిస్తుంది. అలాగే గుమ్మడి రసం, ఉసిరిరసం, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని ప్రతినిత్యం మందులా తీసుకుంటే మలబద్ధకం శీఘ్రంగా నివారణ అవుతుంది. పూర్వకాలంలో మన పెద్దవాళ్లు ఇళ్లలో గుమ్మడికాయలను...వాటి విత్తనాలతో సహా మొత్తగా రుబ్బి ఒడియాలుగా పెట్టేవారు. వాటిని నూనెలో వేయించుకుని ఆహారపదార్థాలతోపాటు రుచికరంగా తినేవారు. అంటే గుమ్మడి విత్తుల విలువ ఆ రోజుల్లోనే గమనించి ఇటువంటి ఏర్పాటు చేశారన్నమాట. గుమ్మడితో చేసిన హల్వాకూడా రుచికరంగా ఉండటమేగాక...ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఎక్కువగా ఉత్తర భారతదేశపు స్వీట్లలో ఈ స్వీటుదే అగ్రస్థానం.
Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details
Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details
Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details