ఆ నొప్పి .. ఎలా దూరం?
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 67.2 శాతం మంది స్త్రీలకు నెలసరి నొప్పి ఎప్పుడో ఒకప్పుడు వస్తుంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు పొత్తి కడుపులో నొప్పిగా ఉండటం, కాళ్లు లాగటం, నరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు, నడుంనొప్పి, కూర్చోలేక, నిలబడలేక పోవడం.. ఒక్కోసారి తలతిరిగి పడిపోవడం వంటి మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
స్త్రీలకు ప్రతీమాసం 3-4 రోజుల పాటు నెలసరిదశ తప్పదు. ఈ సమయంలో శరీరంలోని హార్మోన్ల మార్పు వల్ల గర్భసంచిలోని కండరాలలో అసాధారణ సంకోచ, వ్యాకోచాలు జరిగి కడుపునొప్పి వస్తుంది. స్రావం అధికంగా ఉంటే అది గర్భాశయంపై ప్రభావం చూపుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది.
* కొంతమంది స్త్రీలకు బహిష్ఠులు మొదలైనప్పటి నుంచి వివాహమై, పిల్లలు పుట్టే వరకు ఉంటుంది.
* మరికొందరికి శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతలు, అవయవ సంబంధమైన ఈ కింది సమస్యల వల్ల వస్తుంది. గర్భాశయం.. పొరలు బయటకు వెడలడం, ఇరు పక్కల ఉండే ట్యూబులు మెలిపడటం, ఇన్‌ఫెక్షన్ రావడం, గర్భనిరోధక పరికరాలను సరిగా అమర్చకపోవడం, అండాశయాలలో తిత్తులు, కణితుల వలన బహిష్ఠు సమయంలో కానీ ముందుగానీ నొప్పి వస్తుంది.
ఎవరికి అధికమౌతుంది
* మద్యపానం, ధూమపానం, టీ, కాఫీలు, చాక్లెట్లు, తీపి పదార్థాలు అధికంగా తీసుకునే వారికి.. జీర్ణంకాని, పొడిగా ఉన్న పదార్థాలు నొప్పిని అధికం చేస్తాయి.
* మలబద్ధకం, అధికబరువు, బలహీనంగా ఉన్నవారికి ఈ సమస్య తీవ్రతరం అవుతుంది. మానసిక ఆందోళన, అధిక ఒత్తిడికి గురైన వారికి రావచ్చును.
* ఆహారంలో జింక్, మెగ్నిషియం, విటమిన్-సి, ఈ, ఒమెగా-3,6 ఫ్యాటీ యాసిడ్లు లాంటివి లోపించినప్పుడు కడుపునొప్పి పెరిగే అవకాశం ఉంది.
ముందు జాగ్రత్తలు :
* గర్భసంచి సంకోచ వ్యాకోచాలు సక్రమంగా జరగడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు సాయపడుతాయి. ఇందులో మెంతికూర, కరివేపాకు, పుదీన, తులసి, ఉసిరి ముఖ్యమైనవి.
* వీటితో పాటు తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు, పప్పుదినుసులు, చిక్కుడు, సోయాచిక్కుడు ఉండేలా చూసుకోవాలి.
* నొప్పితో బాధపడేవారు విశ్రాంతిగా పడుకుంటే బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
* సరైన శారీరక వ్యాయామాలు శరీరంలోని రకరకాల వినాళగ్రంథులు స్రావాలను నియంత్రిస్తుంటాయి. కాబట్టి 10-15 రోజుల ముందునుంచి గర్భసంచికి రక్తప్రసరణ సక్రమంగా జరిగే విధంగా ఉదర సంబంధ వ్యాయామం చేస్తుండాలి.
* ఒమెగా - 3,6 ప్యాటీఆసిడ్స్, మెగ్నిషియం, విటమిన్-ఇ, జింక్, థయామిన్, అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి.
* బాదంపప్పు, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష లాంటివి ఆరోగ్యానికి శ్రేయస్కరం.
* బహిష్ఠు నొప్పి అధికంగా ఉన్నప్పుడు వేడినీళ్ళలో ముంచిన వస్త్రంతో కాపడం పెట్టడం ద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది.
గృహవైద్యం :
* నొప్పి తీవ్రత సాధారణంగా ఉంటే గృహవైద్యం సాయపడుతుంది. తీవ్రతరమైనప్పుడు డాక్టర్ సలహా తప్పనిసరి.
* 1-3 గ్రాముల వసకొమ్మును పొడిగా చేసి తేనెతో తీసుకోవచ్చు.
* మందారపూలను ముద్దగా చేసి పంచదారతో స్వీకరించవచ్చు.
* నల్లనువ్వులు, జీలకర్ర, వామును సమపాళ్లలో తీసుకొని పొడిచేసి బెల్లంలో కలిపి తీసుకుంటే కొంత ఫలితం ఉంటుంది.
Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details
Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details
Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details