ఈ రోజులలో ఒత్తిడి అనే మాట ప్రతి ఒక్కరి నోటి నుంచి వినిపిస్తోంది. ఒత్తిడిని తగ్గించుకునే ప్రక్రియ మన చేతుల్లోనే ఉంది. మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల నుంచి అధిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆహారపు అలవాట్లను కూడా ఒక దశకు వచ్చేసరికి నియంత్రణ అవసరం. చిన్నప్పువు ఇష్టంగా తిన్నామని...పెద్దయ్యాక కూడా వాటిని అదేలా తింటామంటే కుదరదు. ముఖ్యంగా ఆడవారి విషయంలో సమతుల ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువశాతం ఒత్తిడికి గురయ్యేవిషయంలో పురుషుల కన్నా మహిళలే ముందువరుసలో ఉంటున్నారని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకే వైద్యుల వద్దకు వెళ్లి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగించే మందులను ఊరికే వాడుతుంటాము. మన చేతిలో ఉన్న చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోము. సహజసిద్ధంగా ఒత్తిడిశాతాన్ని తగ్గించే కొన్ని ఆహారపదార్ధాలను పరిశీలిద్దామా...

Poor Mental and Physical Health Linked to Loneliness

ఒంటరిగా ఉండొద్దు
కొందరు ఎక్కువగా ఒంటరిగా జీవించడానికి ఇష్టపడుతుంటారు. ఒంటరిగా ఎవరితోనూ సంబంధం లేకుండా ఉండేవారు చాలా అరుదుగా ఉంటారు. అయితే అటువంటి వారు జీవితంలో చాలా కోల్పోతున్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఒంటరితనం వల్ల మెదడు తీవ్ర ప్రభావానికి లోనవుతుంది. ఫలితంగా ఒత్తిడిస్థాయి పెరుగిపోతుంది. దీంతో అల్జీమర్స్‌ వ్యాధికి గురవుతారని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ జాన్‌కాసియొప్పొ తెలిపారు. ఒంటరితనాన్ని కోరుకునేవారిలో మానసిక ఒత్తిడికూడా అధికంగా ఉంటుందని తేలింది. ఇది వారి శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని సూచిస్తుందని డాక్టర్‌ కాసియొప్పొ తెలిపారు.


పాతకాలపు సాంప్రదాయాలకు మనం ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశాం. అప్పట్లో జాయింట్‌ ఫ్యామిలీలు ఉండేవి. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, తాత, బామ్మ, అమ్మమ్మలలు, తాతయ్యలతో ఉమ్మడి కుటుంబాలు అలరారుతుండేవి. వారి ఆత్మీయతానురాగాలలు, ప్రేమలతో ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా ఉండేవారు. రానురాను జీవనోపాధికోసం ఉరుకుల పరుగుల జీవితం గడుపుతున్న నేటి సగటు మనిషి ఇలాంటి అనుబంధాలకు దూరమవుతున్నాడు. ఇంట్లో పెద్దవారి ఆప్యాయతలకు నోచుకుని, వారి విలువైన సలహాలను పాటిస్తూ ఉత్తమ పౌరులుగా తయారయినవారిని మనం ఎందరినో చూస్తునేవున్నాం. ఇంట్లో ఎవరికైనా సమస్య వస్తే ఇంటిల్లిపాదీ స్పందించేవారు. ఆ కష్టాన్ని తమ కష్టంగా భావించి ఆ కష్టం నుండి అతన్ని దూరం చేయడంకోసం ఇంట్లోనివారంతా పరితపించిపోయేవారు. కష్టసుఖాలను నలుగురూ పంచుకునేవారు. ఎవరు సంపాదించినా, సంపాదించకపోయినా అందరూ కలిసికట్టుగా పనిని విభజించుకుని ఎవరికి తోచిన సంపాదన వారు చేసేవారు.

నిత్యజీవనవిధానంలో నేటి ఆధునిక కాలంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఒత్తిళ్లకు ప్రత్యేకించి మందు లు అంటూ ఏమీ ఉండవు. అవికూడా ఏదో తాత్కాలిక ఉపశమనమే తప్ప వాటిని నియంత్రించుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ముదిమి వయసువారిదాకా ఏ ఒక్కరూ ఈ ఒత్తిడికి అతీతం కాదు. ఏ వయసులోవారికి తగినట్లు ఒత్తిడి ఉంటుంది. దీనికి తోడు మన ఆహారపు అలవాట్లను కూడా మనం పూర్తిగా మార్చేసుకున్నాం. ఆహారంలో పీచుపదార్ధాలు లేని పిజ్జాబర్గర్లను తినేస్తూ...టీ, కాఫీలు తాగేస్తూ...లేనిపోని ఒత్తిళ్లను మరింతగా పెంచుకుంటున్నాం. అయితే మానసిక ఒత్తిడిని నివారించేం దుకు శరీర మర్ధనా నికి మించినది మరొ కటి లేదని వైద్యశాస్త్ర నిపుణులు చెబుతు న్నారు.


అయితే ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాలలో మాలిష్‌ సెంటర్లు వెలుస్తున్నాయి. మాలిష్‌ పేరిట అనవసరంగా ఎక్కువ డబ్బులు వృథా చేసేకన్నా...ఇంట్లోనే మాలిష్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. అదెలాగంటే 30 గ్రాముల వేరుశనగ నూనెలో 5 చుక్కల కైమోమైన్‌ ఆయిల్‌, 5 చుక్కల క్లెరీసెజ్‌ ఆయిల్‌, 15 చుక్కల శాండిల్‌ ఆయిల్‌, 5 చుక్కల మెజోరమ్‌ ఆయిల్‌ను మిశ్రమంగా చేసుకుని ఉంచుకోవాలి.గోరువెచ్చని నీళ్లతో కలిపి శరీరం వెనకభాగంలో, వీపుపైన, మెడ చుట్టూ, భుజాలకింద మసాజ్‌ చేయించుకుంటే ఎంతటి తీవ్రమైన ఒత్తిడి నుంచయినా మనం బయటపడొచ్చు.

మనం జీవిత లక్ష్యాలను సాధించగలమో లేదోననే ఆందోళన, ఆశానిరాశలు, ఆర్థిక ఇబ్బందులు మొదలైన అనేక సమస్యలతో హాయిగా ఊపిరి పీల్చుకోలేని దుస్థితిని మనందరం ఎదుర్కొంటున్నామనడంలో ఎలాంటి అనౌచిత్యం లేదు. దీనిని పెద్దవారికి సంబంధించిన సమస్యగా మాత్రమే పరిగణించడానికి వీల్లేదు. చిన్న పిల్లలు కూడా వారి వయస్సుకు మించిన పుస్తకాల బరువును వీపు మీద మోస్తున్నట్లే, అనేక సందర్బా లలో వారి తలకు మించిన భారాన్ని కూడా మోయాల్సి వస్తున్నది. ఫలితంగా పిల్లలు శారీరకంగానే కాక, మానసికంగా కూడా దెబ్బ తింటున్నారు. పోషకాహారలోపాలతోపాటు చదువులో పోటీతత్వం పెరగడంతో వారికి భోజనంపట్ల ధ్యాస ఉండటం లేదు.

తల్లిదండ్రులు తమనుంచి ఆశించే ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఇబ్బందులు పడటమే కాకుండా, టీచర్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details